ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన పోలీసులు

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:41 AM

భర్తతో గొడవపడి ఇంటి నుంచి పారిపోయి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన మహిళను 100 కాల్‌ ద్వారా నార్కట్‌పల్లి పోలీసులు కాపాడారు.

కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న పోలీసులు

ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన పోలీసులు

నార్కట్‌పల్లి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): భర్తతో గొడవపడి ఇంటి నుంచి పారిపోయి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన మహిళను 100 కాల్‌ ద్వారా నార్కట్‌పల్లి పోలీసులు కాపాడారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టులో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆమనగల్లుకు చెందిన ఓ మహిళ తన భర్తతో గొడవపడి శుక్రవారం రాత్రి చెర్వుగట్టుకు వచ్చింది. తాను చెర్వుగట్టుకు వచ్చానని, చనిపోతున్నానని తన కోసం వెతకవద్దని తల్లిదండ్రులకు ఫోన చేసి చెప్పింది. వారు వెంటనే 100 కాల్‌కు ఫోనచేసి సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన నార్కట్‌పల్లి హెడ్‌ కానిస్టేబుల్‌ భూతరాజు రమేష్‌, హోంగార్డు రమేష్‌లు వెంటనే చెర్వుగట్టు గుట్టపైకి చేరుకున్నారు. అప్పటికే వాట్సాప్‌ ద్వారా సదరు మహిళ ఫొటోను తెప్పించుకుని ఆమె వద్ద ఉన్న ఫోన నెంబర్‌ను లొకేషన ట్రాక్‌ చేసి పట్టుకున్నారు. అనంతరం ఆమెను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. తమ సోదరిని కాపాడి అప్పగించినందుకు బాధిత మహిళ సోదరుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.

Updated Date - Nov 24 , 2024 | 12:41 AM