పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
ABN, Publish Date - Oct 22 , 2024 | 01:01 AM
విధి నిర్వాహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయ మని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం పోలీసు అమరవీరుల సంస్మర ణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
కలెక్టర్ సత్య ప్రసాద్
ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
జగిత్యాల క్రైం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) :విధి నిర్వాహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయ మని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం పోలీసు అమరవీరుల సంస్మర ణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి పోలీసు అమరవీరులకు పుష్ప గుచ్చాలతో శ్రధ్దాంజలి ఘటించారు. పోలీసు సిబ్బంది, అధికారులు తమ పరేడ్‌తో నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల కుటుం బ సభ్యులు హాజరై తమ కన్నీళ్లతో నివాళులు అర్పించారు. అనం తరం అడిషనల్ ఎస్పీ భీంరావ్ దేశ వ్యాప్తంగా అమరులైన పోలీస్ అధికారుల త్యాగాలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ పటిష్టమైన శాంతి భధ్రతలతోనే అభివృధ్ది సాధ్యమవు తుందన్నారు. సొసైటీలో శాంతియుతంగా, ప్రశాంతంగా జీవిస్తున్నా మంటే దానికి 24 గంటలు పనిచేస్తున్న పోలీసులే కారణమన్నారు. పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని వివరించారు. విధి నిర్వాహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహార్లు అని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఈ సమాజం కోరుకు నేది శాంతి, స్థిరత్వం, అభివృద్ధి అని వీటిని పోలీస్ శాఖ వారి త్యా గాల ద్వారా ఎన్నొ దశాబ్ధాలుగా సమాజంలో ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తుందని వివరించారు. శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యమని, విధి నిర్వాహణలో ప్రాణాలర్పించి అమరులైన పోలీసు త్యాగాలు వెలకట్టలేనివన్నారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి ఏటా అక్టోబరు 21న పోలీసు అమరవీరులు సంస్మరణ వేడుకలను నిర్వహిస్తుందన్నారు. అనంత రం పోలీసు అమరవీరుల కుటుంబాలతో కలెక్టర్ ఎస్పీలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారి కుటుంబాల ఆర్థిక స్థితి గతులు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు రవీంద్ర కుమార్, రఘ చందర్, ఉమామహేశ్వర్ రావు, రాంగారెడ్డి, డీసీఆర్‌బీ, సీసీఎస్, ఐటీ కోర్, ఎస్‌బీ ఇన్స్‌ఫెక్టర్లు శ్రీని వాస్, లక్ష్మినారాయణ, రఫీక్ ఖాన్, కిరణ్ కుమార్, రామకృష్ణ, వేణు, ఆరీఫ్‌అలీ ఖాన్, సీఐలు వేణు గోపాల్, రాంనర్సింహా రెడ్డి, రవి, నిరంజన్ రెడ్డి, సురేష్‌తో పాటు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, అమర వీరుల కుటుంబ సభ్యులు ఉన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 01:01 AM