ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీపీఎస్‌లో సర్కారు వాటా ఏదీ?

ABN, Publish Date - Nov 20 , 2024 | 05:18 AM

ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షన్ల భారం తగ్గించుకొనేందుకు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకాన్ని(సీపీఎస్‌)ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా సక్రమంగా చెల్లించడం లేదు. ఏడాది కాలంగా ఉద్యోగుల సీపీఎస్‌ ఖాతాల్లో తన వాటా సొమ్మును జమ చేయడం లేదు. సీపీఎస్‌ ఉద్యోగులకు శాశ్వత పదవీవిరమణ ఖాతా సంఖ్య(ప్రాన్‌)లో ప్రతి నెలా

ఏడాదిగా ఖాతాలకు జమకాని ప్రభుత్వ సొమ్ము

2023 అక్టోబరు నుంచి 10% చెల్లించని ప్రభుత్వం

షేర్‌ మార్కెట్‌ పెట్టుబడుల్లో ఆ మేరకు లోటు

లాభాల్లో వాటా నష్టపోతామంటున్న ఉద్యోగులు

సీపీఎస్‌ స్ఫూర్తి దెబ్బ తింటోందని ఆందోళన

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షన్ల భారం తగ్గించుకొనేందుకు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకాన్ని(సీపీఎస్‌)ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా సక్రమంగా చెల్లించడం లేదు. ఏడాది కాలంగా ఉద్యోగుల సీపీఎస్‌ ఖాతాల్లో తన వాటా సొమ్మును జమ చేయడం లేదు. సీపీఎస్‌ ఉద్యోగులకు శాశ్వత పదవీవిరమణ ఖాతా సంఖ్య(ప్రాన్‌)లో ప్రతి నెలా సీపీఎస్‌ సొమ్మును ప్రభుత్వం జమ చేయాల్సి ఉంటుంది. 2023 అక్టోబరు నుంచి జమ కావడం లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 2004 సెప్టెంబర్‌ 1 నుంచి సీపీఎస్‌ విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీపీఎఫ్‌ ఖాతాలు ఉండవు. కేవలం సీపీఎస్‌ మాత్రమే అమలవుతోంది. ఉద్యోగి వాటా కింద మూల వేతనం, కరువు భత్యం(డీఏ) మొత్తం నుంచి ప్రతి నెలా 10 శాతాన్ని మినహాయించుకొని, ‘నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌(ఎన్‌ఎ్‌సడీఎల్‌)లోని ఉద్యోగుల ప్రాన్‌ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ప్రభుత్వం కూడా తన వాటా కింద 10 శాతాన్ని ఉద్యోగుల ప్రాన్‌ ఖాతాల్లో జమ చేయాలి. రెండు వాటాలు కలిసి 20 శాతం సొమ్ము ప్రతి నెలా ప్రాన్‌ ఖాతాల్లో జమ అవుతుంటుంది. ఈ మొత్తాన్ని స్టాక్‌ మార్కెట్‌లో నిర్దేశిత పద్దతిలో ఉద్యోగి ఖాతా సంఖ్య పేరిట ఎప్పటికప్పుడు సిప్‌ల తరహాలో పెట్టుబడి పెడతారు. ఇందులో పెట్టుబడి, లాభాల రూపంలో జమ అయిన మొత్తం సొమ్ము నుంచి పదవీ విరమణ రోజు 40 శాతం డబ్బును ఉద్యోగి తీసుకునేందుకు అవకాశం ఇస్తారు. మిగిలిన 60 శాతాన్ని షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడిగా కొనసాగిస్తారు. అందులో నుంచే ప్రతి నెలా కొంత మేర పెన్షన్‌ రూపంలో చెల్లించాలనేది సీపీఎస్‌ విధానం. ఈ విధానం వల్ల తాము నష్టపోతున్నామని, సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల ఉద్యోగులు కూడా డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యమాలు సాగిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు సీపీఎ్‌సను రద్దు చేశాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దీని జోలికి వెళ్లలేదు. కాంగ్రెస్‌ పార్టీ సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇది రద్దు కాలేదు. కనీసం సీపీఎస్‌ కింద జమ చేయాల్సిన ప్రభుత్వ వాటాను కూడా విడుదల చేయకపోవడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2023 సెప్టెంబరు వరకు ఉద్యోగుల ప్రాన్‌ ఖాతాల్లో ప్రభుత్వం తన 10 శాతం వాటా సొమ్మును జమ చేసింది. 2023 అక్టోబరు నుంచి జమ చేయలేదు. ఉద్యోగుల వాటా 10 శాతం మాత్రమే క్రమం తప్పకుండా జమ అవుతోంది. దీనికి సంబంధించిన ఫోన్‌ మెసేజ్‌లు మాత్రమే ఉద్యోగులకు నెలనెలా వస్తున్నాయి. ప్రభుత్వ వాటా 10 శాతం గురించి ఎలాంటి సమాచారం లేదు. రాష్ట్రంలో సీపీఎస్‌ ఉద్యోగుల సంఖ్య 1.70 లక్షలమంది ఉండేవారు. కొత్త ఉద్యోగులను కలుపుకుంటే రెండు లక్షలకు చేరింది. సగటు వేతనం 50 వేలు అనుకుంటే 10 శాతం చొప్పున ప్రతి నెలా రూ.5 వేలు ప్రాన్‌ ఖాతాల్లో జమ అవుతుంది. ప్రభుత్వం కూడా రూ.5 వేలను జమ చేయాలి. ఏటా రూ.1.20 లక్షలు ప్రాన్‌ ఖాతాల్లో జమ కావాలి. దాన్నే ఎన్‌ఎ్‌సడీఎల్‌ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడిగా పెడుతుంది. లాభ నష్టాలను ప్రాన్‌ ఖాతాల్లో జమ చేస్తుంది. ఏడాది కాలంగా ప్రభుత్వ వాటా జమ కాకపోవడం వల్ల ఆ కాలంలో షేర్‌ మార్కెట్‌ నుంచి ఉద్యోగికి అందాల్సిన లాభాల వాటా తగ్గిపోతుంది. ప్రభుత్వం భవిష్యత్తులో జమ చేసినా 10 శాతం లెక్క వేసి జమ చేస్తుందే తప్ప షేర్‌ మార్కెట్లో రావాల్సిన లాభాల వాటాను సమకూర్చుతుందన్న నమ్మకం లేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. లాభాల వాటాకు నష్టం కలిగించడమంటే సీపీఎస్‌ పథకం స్ఫూర్తిని దెబ్బ తీయడమేనని వ్యాఖ్యానిస్తున్నాయి.

Updated Date - Nov 20 , 2024 | 05:18 AM