ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

ABN, Publish Date - Oct 31 , 2024 | 12:35 AM

ఆధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు.

ఆఽంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం నుంచి సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎన్యుమరేటర్లకు శిక్షణ నిర్వహించారు. కనగల్‌,డిండి, గుర్రంపోడు మండలాల్లో నిర్వహిస్తున్న శిక్షణను బుధవారం ఆమె పరిశీ లించారు. పలు సూచనలు చేశారు. ఎన్యుమరేటర్లు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ఇచ్చిన ఫారాల్లో ఉన్న 75రకాల ప్రశ్నలకు సంబం ధించిన వివరాలను సేకరించి క్షుణ్ణంగా నింపాలన్నారు. సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల విషయాలను సవివరంగా నమోదు చేయాలని సూచించారు. బలహీనవర్గాల అభ్యు న్నతికి తగిన ప్రణాళికలను రూపొందించి వాటిని అమలు చేయ డానికి సర్వే ఉపయోగపడుతుందన్నారు. అలాగే కట్టంగూర్‌, చిట్యాలలో అదనపు కలెక్టర్‌ శ్రీని వాస్‌ వేములపల్లి, మాడ్గుల పల్లి శిక్షణలో సబ్‌కలెక్టర్‌ అమిత్‌ నారాయణ్‌ పాల్గొన్నారు. తిప్పర్తిలో మండల ప్రత్యేకాధికారి ఛాయాదేవి, కొండమల్లేపల్లిలో మండల ప్రత్యేకాధికారి విజయేందర్‌రెడ్డి, ఎంపీడీ వో బాలరాజు రెడ్డి, చింత పల్లిలో ప్రత్యేకాధికారి ద్వారక్‌, ఎంపీడీవో సుజాత, శాలిగౌరారంలో ఎంపీడీవో జ్యోతిలక్ష్మి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - Oct 31 , 2024 | 07:37 AM