రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
ABN, Publish Date - Sep 05 , 2024 | 12:15 AM
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.
భూదాన్‌పోచంపల్లి, సెప్టెంబరు 4: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ రైతు విభాగం మండల అధ్యక్షుడు వారాల రామచంద్రారెడ్డి నాయకత్వంలో 60మంది నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఏకకాలంగా రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతుల పక్షాన నిలబడ్డారని, 10ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో విసుగు చెందిన అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీలోకి స్వచ్ఛందంగా చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాక మల్లేష్‌యాదవ్, నాయకులు సామ మధుసూదన్‌రెడ్డి, ఉప్పునూతల వెంకటేష్‌యాదవ్, చిలుక సంతోష్ యాదవ్, రామకృష్ణారెడ్డి, గోరంటి శ్రీనివాస్‌రెడ్డి, తోట శ్రీనివాస్, బండా రు ప్రకాష్‌రెడ్డి, మన్నెం వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మండల ంలోని జిబ్లక్‌పల్లి గ్రామానికి చెందిన మీసాల జంగమ్మకు మంజూరైన రూ.1.50లక్షల చెక్కును బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే అందజేశారు.
Updated Date - Sep 05 , 2024 | 12:15 AM