ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

యువత ఉపాధికి శిక్షణా కార్యక్రమాలు దోహదం

ABN, Publish Date - May 23 , 2024 | 11:09 PM

స్టేట్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధికల్పనకు ఉపయోగపడతాయని కలెక్టర్‌ జి. రవినాయక్‌ అన్నారు.

శిక్షణా కార్యక్రమాన్ని సందర్శించి, విద్యార్థినులు చేసిన మగ్గం వర్క్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రవి నాయక్‌

- కలెక్టర్‌ జి. రవి నాయక్‌

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), మే 23 : స్టేట్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధికల్పనకు ఉపయోగపడతాయని కలెక్టర్‌ జి. రవినాయక్‌ అన్నారు. గురువారం స్టేట్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను కలెక్టర్‌ సందర్శించి శిక్షణా కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు నిర్వహించే టైలరింగ్‌, బ్యుటీషియన్‌, మగ్గం కోర్సులలో శిక్షణా పొందుతున్న యువతీ, యువకులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రైవేట్‌ రంగంలో, కొత్తగా బిజినెస్‌ ప్రాంభించాలన్నా నైపుణ్య అవసరం అన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా శిక్షణ పొందిన వారు ఇతరులకు శిక్షణ అందించడమే కాకా ఆర్థికంగా కుటుంబానికి తోడ్పాటునదించే అవకాశం ఉందని అన్నారు. వివిధ కోర్సులలో శిక్షణా పొందిన వారికి బ్యాంక్‌ ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించేందుకు తనవంతు సహాయం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్‌ జి. శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - May 23 , 2024 | 11:09 PM

Advertising
Advertising