Share News

26 మంది డీఎస్పీల బదిలీ

ABN , Publish Date - Feb 16 , 2024 | 05:51 AM

పోలీస్‌ శాఖలో డీఎస్పీల బదిలీలు కొనసాగుతున్నాయి. మూడో విడత బదిలీల్లో భాగంగా రాష్ట్రంలో 26 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా

26 మంది డీఎస్పీల బదిలీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): పోలీస్‌ శాఖలో డీఎస్పీల బదిలీలు కొనసాగుతున్నాయి. మూడో విడత బదిలీల్లో భాగంగా రాష్ట్రంలో 26 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో నాలుగు రోజులుగా పోలీస్‌ శాఖలో బదిలీలు కొనసాగుతున్నాయి. ఐపీఎస్‌ మొదలుకొని నాన్‌కేడర్‌ ఎస్పీలు, అడిషనల్‌ ఎస్పీలు, డీఎస్పీలతో పాటు ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారుల వరకు బదిలీలు జరిగాయి. కోడ్‌ పరిధిలోకి వచ్చే అధికారులు, సిబ్బంది అందరిని బదిలీ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే సాధారణ బదిలీల్లో భాగంగా అవసరం మేరకు త్వరలో మరికొంత మంది డీఎస్పీలు, ఇతరుల బదిలీలు జరిగే అవకాశం ఉందన్నారు.

Updated Date - Feb 16 , 2024 | 06:55 AM