TS SSC Result 2024: రేపే 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
ABN, Publish Date - Apr 29 , 2024 | 04:00 PM
TS 10th Class Results 2024: తెలంగాణలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీ అంటే.. రేపు ఉదయం 11.00 గంటలకు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పలితాలను ఆంధ్రజ్యోతి. కామ్ వెబ్‌సైట్‌లో క్లిక్ చేసి విద్యార్థులు.. తమ హాట్ టికెట్ ఎంటర్ చేసి.. వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 18వ తేదీన 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. ఏప్రిల్ 2వ తేదీతో ఈ పరీక్షలు ముగిశాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీ అంటే.. రేపు ఉదయం 11.00 గంటలకు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పలితాలను ఆంధ్రజ్యోతి. కామ్ వెబ్‌సైట్‌లో క్లిక్ చేసి విద్యార్థులు.. తమ హాట్ టికెట్ ఎంటర్ చేసి.. వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 18వ తేదీన 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. ఏప్రిల్ 2వ తేదీతో ఈ పరీక్షలు ముగిశాయి.
LokSabha Elections : లఖ్‌నవూలో నామినేషన్ వేసిన రాజ్‌నాథ్ సింగ్
AP Elections: ఎన్నికల ముందు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్!
రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలకు పైగా విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రభుత్వం ముందే నిర్వహించింది. అయితే ఇప్పటికే ఇంటర్మీడియట్ ఫలితాలను ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. రేపు 10వ తరగతి ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇక పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడైన విషయం విధితమే.
Read National News And Telugu News
Updated Date - Apr 29 , 2024 | 09:35 PM