ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TSRTC: హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించేవారికి టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్

ABN, Publish Date - Sep 04 , 2024 | 03:26 PM

ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు ఎంతలా విలయం సృష్టించాయో తెలిసింది. విజయవాడ నగరం ఇంకా వరద ముంపులోనే ఉంది. కూటమి ప్రభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలను కొనసాగిస్తోంది. కాగా ఈ వరద సమయంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగిన విషయం తెలిసిందే.

TSRTC

హైదరాబాద్: ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు ఎంతలా విలయం సృష్టించాయో తెలిసింది. విజయవాడ నగరం ఇంకా వరద ముంపులోనే ఉంది. కూటమి ప్రభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలను కొనసాగిస్తోంది. కాగా ఈ వరద సమయంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. రోడ్డు పలుచోట్ల వరద నీరు చేరడంతో దాదాపు 36 గంటలపాటు రోడ్డుపై ప్రయాణాలను అధికారులు నిలిపివేశారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత క్రమక్రమంగా వాహన ప్రయాణాలకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్-విజయవాడ జాతీయ రాహదారిపై వాహనాలు యథావిథిగా తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) కీలకమైన ప్రకటన చేసింది.


హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఆ రూట్‌లో రాకపోకలు కొసాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్టు వెల్లడించింది. రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుందని ఆర్టీసీ తెలిపింది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ప్రయాణీకులను సంస్థ కోరింది. ముందస్తు రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించింది.


ప్రకాశం బ్యారేజీ వైపు రాకపోకలు నిలిపివేత

వరదల కారణంగా ప్రకాశం బ్యారేజీ వైపు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ద్విచక్ర వాహనాలు కూడా రాకుండా పోలీసులు బారికేడ్లు పెట్టారు. ట్రాఫిక్ మొత్తం వారధి పైనుంచే కొనసాగుతోంది. వారధి మీద నుంచి ట్రాఫిక్ నిదానంగా కదులుతోంది. దీంతో వాహనాలు బారులు తీరాయి.

Updated Date - Sep 04 , 2024 | 03:38 PM

Advertising
Advertising