ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: దసరా వేళ హైదరాబాద్‌లో అమ్మవారికి అవమానం

ABN, Publish Date - Oct 11 , 2024 | 09:30 AM

నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. దేవి నవరాత్రుల సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గత అర్థరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి.. నిర్వాహకులకు సమాచారం అందించారు.

హైదరాబాద్, అక్టోబర్ 11: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. దేవి నవరాత్రుల సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గత అర్థరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి.. నిర్వాహకులకు సమాచారం అందించారు. దీంతో అమ్మవారి భక్తులతోపాటు పలు హిందు సంఘాల నేతలు.. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బేగంబజార్ పోలీసులు నాంపల్లి గ్రౌండ్స్‌కు చేరుకున్నారు.


అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్‌తోపాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోకి ప్రవేశించిన దుండగులు తొలుత విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత ఆ ప్రదేశంలోని సీసీ కెమెరాలను పగలకొట్టారు. అనంతరం అమ్మవారి విగ్రహం చేతిని విరగొట్టారు. అంతేకాకుండా అమ్మవారి విగ్రహం వద్దనున్న పూజా సామాగ్రిని సైతం చెల్లాచెదురుగా పడేశారు. అమ్మవారి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం దుండగులు తొలగించారు.


ప్రతి ఏడాది ఎక్కడో అక్కడ హిందు దేవతల విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని ఈ సందర్భంగా భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం హిందూదేశంలో ఉన్నామా? లేకుంటే ఇస్లామిక్ దేశంలో ఉన్నామా? అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహంపై దాడి చేసిన దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని పలు హిందు సంఘాలు నేతలు డిమాండ్ చేస్తున్నారు.


ఇంకోవైపు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి ఏడాది ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. అందులోభాగంగా ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే గురువారం రాత్రి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దాండియా కార్యక్రమం నిర్వహించారు.


ఈ కార్యక్రమం అయ్యే వరకు పోలీసులు అక్కడే విధులు నిర్వహించారని ఉన్నతాధికారులు తెలిపారు. అమ్మవారి విగ్రహాం ధ్వంసం ఘటన అర్థరాత్రి లేకుంటే... శుక్రవారం తెల్లవారుజామున జరిగి ఉండవచ్చని పోలీస్ ఉన్నతాధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

For Telangana News And Telugu News...

Updated Date - Oct 11 , 2024 | 09:48 AM