ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అర్హతలేని వైద్యులు.. అక్రమ క్లినిక్‌లు

ABN, Publish Date - Nov 20 , 2024 | 04:10 AM

తెలంగాణ వైద్యమండలి(మెడికల్‌ కౌన్సిల్‌) ఖమ్మం జిల్లాలో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఎంబీబీఎస్‌ అర్హత లేకుండానే కొంతమంది వ్యక్తులు క్లినిక్‌ల పేరిట ఏకంగా ఆస్పత్రులే నిర్వహిస్తున్న విషయం

మెడికల్‌ కౌన్సిల్‌ ఆకస్మిక తనిఖీల్లో బహిర్గతం

ఖమ్మం జిల్లాలో 40మంది ఆర్‌ఎంపీలపై కేసు

ఖమ్మం, నవంబరు19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వైద్యమండలి(మెడికల్‌ కౌన్సిల్‌) ఖమ్మం జిల్లాలో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఎంబీబీఎస్‌ అర్హత లేకుండానే కొంతమంది వ్యక్తులు క్లినిక్‌ల పేరిట ఏకంగా ఆస్పత్రులే నిర్వహిస్తున్న విషయం వెలుగులోకొచ్చింది. ఇందుకుగాను 41మంది రిజిష్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌(ఆర్‌ఎంపీ)లపై కేసు నమోదైంది. కేవలం ప్రాథమిక చికిత్సా కేంద్రాలు నిర్వహించాల్సిన ఆర్‌ఎంపీలు... మెడికల్‌ కౌన్సిల్‌ నిబంధనలు విరుద్ధంగా ఇంజక్షన్లు, ఫ్లూయిడ్స్‌ ఇవ్వడంతో పాటు అన్ని రకాల వైద్యసేవలు చేస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. విజిలెన్స్‌ అధికారి మామిడాల రాము ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం ఖమ్మం సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఖమ్మం జిల్లా సెంట్రల్‌ క్రైం స్టేషన్‌(సీసీఎ్‌స) పోలీసులు 41 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు ఖమ్మం పట్టణంలో 13మంది ఉండగా, ముదిగొండ, నేలకొండపల్లి, రఘునాథపాలెం, తల్లాడ తదితర ప్రాంతాల్లో మిగిలిన వారిని గుర్తించారు. అయితే ఆర్‌ఎంపీల అక్రమ క్లినిక్‌ల నిర్వహణపై జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోగా.. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మెడికల్‌ కౌన్సిల్‌ అధికారులని తప్పుబడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి... కౌన్సిల్‌ సభ్యులతో వాగ్వాదానికి దిగారన్న ప్రచారం జరుగుతోంది. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ కౌన్సిల్‌లోని కొంతమంది సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వినికిడి. కాగా ఏకకాలంలో 41 మందిపై కేసు నమోదవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Nov 20 , 2024 | 04:10 AM