ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హిందూత్వంపై వ్యంగ్యాస్త్రాలు మానుకో నటుడు ప్రకాశ్‌రాజ్‌కు వీహెచ్‌పీ హెచ్చరిక

ABN, Publish Date - Sep 23 , 2024 | 05:37 AM

వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో కవ్వింపు చర్యలకు దిగి పరువు తీసుకోవద్దని నటుడు ప్రకాశ్‌రాజ్‌ను విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) హెచ్చరించింది.

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో కవ్వింపు చర్యలకు దిగి పరువు తీసుకోవద్దని నటుడు ప్రకాశ్‌రాజ్‌ను విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) హెచ్చరించింది. ఈ మేరకు ఆదివారం వీహెచ్‌పీ తెలంగాణ ప్రచార ప్రముఖ్‌ పగుడాకుల బాలస్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంలో హిందూ విశ్వాసాలపై నమ్మకం లేని వ్యక్తులు తలదూర్చడం ఏ మాత్రం క్షమార్హం కాదన్నారు. ‘చిన్న విషయాన్ని పెద్దది చేసి, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయవద్దు’ అంటూ ప్రకాశ్‌ రాజ్‌ వ్యంగ్యంగా మాట్లాడటాన్ని బాలస్వామి తీవ్రంగా ఖండించారు. ఇది రాజకీయ విమర్శలకు సంబంధించిన అంశం కాదని స్పష్టం చేశారు. కాగా, దేశవ్యాప్తంగా సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేసి, దాని ద్వారానే హిందూ దేవాలయాల నిర్వహణ కొనసాగాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయానికి విశ్వహిందూ పరిషత్‌ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని బాలస్వామి ప్రకటించారు.

Updated Date - Sep 23 , 2024 | 05:37 AM