ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓటరు స్లిప్పు అందలేదా?

ABN, Publish Date - May 13 , 2024 | 05:05 AM

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కోసం ఓటర్‌ స్లిప్పులు అందలేదా? ఓటర్‌ కార్డు చేతిలో ఉన్నా..

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కోసం ఓటర్‌ స్లిప్పులు అందలేదా? ఓటర్‌ కార్డు చేతిలో ఉన్నా.. ఏ పోలింగ్‌ స్టేషన్‌లో.. ఏ బూత్‌లో ఓటు వేయాలో తెలియట్లేదా? మీరు ప్రతీ పోలింగ్‌ బూత్‌ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేదు..! మూడు మార్గాల్లో మీరు మీ పోలింగ్‌ బూత్‌ ఎక్కడుందో కనుక్కోవచ్చు. అక్కడికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఆయా వివరాలు..

1. ఆన్‌లైన్‌లో నుంచి ఓటర్‌ స్లిప్పును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే.. మూడు ఆప్షన్లు వస్తాయి. అందులో ఓటరు ఐడీ, మొబైల్‌ నంబరు, పేరు, ప్రాంతం వంటి వివరాలను నమోదు చేయాలి. ఆ వెంటనే మీ ఓటరు స్లిప్‌ కనిపిస్తుంది. పీడీఎఫ్‌ రూపంలో ఓటరు స్లిప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

2. ఎన్నికల సంఘం ప్రత్యేకంగా రూపొందించిన ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా కూడా మొబైల్‌ ఫోన్‌లో ఓటరు స్లిప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఎలక్టోరల్‌ రోల్‌ సెర్చ్‌ ఆప్షన్‌పై క్లిక్‌చేసి.. వివరాలు నమోదు చేయాలి. అప్పుడు ఓటరు స్లిప్‌ను పొందవచ్చు. లేదంటే మీ ఓటర్‌ ఐడీపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను ఈ యాప్‌ ద్వారా స్కాన్‌ చేసినా.. ఓటర్‌ స్లిప్పు వస్తుంది.

3. ఇక స్మార్ట్‌ఫోన్‌ కాకుండా.. మామూలు ఫోన్‌ ఉన్నవారు 1950 నంబరుకు ఎస్సెమ్మెస్‌ పంపడం ద్వారా ్ఛఛిజీ అని టైప్‌ చేసి, మీ ఓటర్‌ఐడీ నంబర్‌ను ఎంటర్‌ చేస్తే.. పోలింగ్‌ బూత్‌కు సంబంధించిన వివరాలు వస్తాయి.పైన పేర్కొన్న మూడు పద్ధతుల్లో ప్రింట్‌అవుట్‌ తీసుకోకున్నా.. పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లి ఆ వివరాలను అందజేస్తే.. అక్కడ పార్టీల ఏజెంట్లు మీకు ఓటర్‌ స్లిప్పును రాసిస్తారు.

మీ ఓటును ఇతరులు వేస్తే..

మీరు పోలింగ్‌ బూత్‌కు వెళ్లేసరికి మీ ఓటును ఎవరైనా వేసినట్లు(దొంగ ఓట్లు) తెలుసుకుంటే.. వెంటనే నిరాశతో వెనుదిరగకూడదు. మీరు మీ ఓటు హక్కును వినియోగించుకునేలా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చట్టం-1961లో 49సీని అమల్లోకి తీసుకువచ్చారు. 49సీ ద్వారా మీరు మీ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ప్రిసైడింగ్‌ అధికారి(పీవో)ను కలవాల్సి ఉంటుంది. తన ఓటును ఎవరో వేశారని, అసలు వ్యక్తి తానేనని నిరూపించుకోవాలి. ఓటర్‌కార్డుతోపాటు.. ఇతర గుర్తింపు కార్డులను చూపించాలి. అప్పుడు ప్రిసైడింగ్‌ అధికారి ఫామ్‌-17డీ ఇస్తారు. దాన్ని పూర్తిచేసి ఇస్తే.. టెండర్‌ బ్యాలెట్‌ పేపర్‌ను అందజేస్తారు. దానిపై ఓటువేసి, ప్రిసైడింగ్‌ అధికారికి అందజేయాలి.

వీవీప్యాట్‌ గురించి తెలుసు కదా?

మీరు ఎవరికి ఓటు వేశారో.. ఆ అభ్యర్థి పార్టీ లేదా ఎన్నికల గుర్తు, పేరు, సీరియల్‌ నంబర్‌.. వీవీప్యాట్‌లో స్లిప్‌ రూపంలో కనిపిస్తాయి. దాని ద్వారా మీరు మీ ఓటుహక్కును సక్రమంగానే వినియోగించుకున్నారని అర్థం చేసుకోవచ్చు. 7 సెకన్లపాటు వీవీప్యాట్‌లో స్లిప్‌ కనిపిస్తుంది.

15 నిమిషాల్లోనే ఓటేయొచ్చు..

పోలింగ్‌ రోజు సెలవును ఎంజాయ్‌ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ఓటింగ్‌కు వెళ్లరు. కొందరైతే.. క్యూలో నిలబడలేక.. ఇంట్లో ఉండడమే బెటర్‌ అనుకుంటారు. అయితే.. కొన్ని చిట్కాలు పాటిస్తే పోలింగ్‌ బూత్‌ వద్ద త్వరగా ఓటు వేయవచ్చని అధికారులు చెబుతున్నారు.

  • ఓటింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఉదయం ఓటింగ్‌ ప్రారంభమైన వెంటనే పెద్దగా క్యూ ఉండదు. ధ్రువపత్రాలు సరిగ్గా ఉంటే.. 10-15 నిమిషాల్లో ఓటు వేసి బయటకు రావొచ్చని అధికారులు వివరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లలో చైతన్యం ఎక్కువ. అందుకే వారు ఉదయాన్నే క్యూకడతారు. అక్కడ మధ్యాహ్నం వేళల్లో వెళ్తే.. పెద్దగా క్యూ ఉండదు.

  • చాలా మంది ఉదయం 5-6 గంటల సమయంలో వాకింగ్‌కు వెళ్తుంటారు. అలాంటి వారు ఓటర్‌ ఐడీని వెంట తీసుకెళ్తే.. పనిలోపనిగా ఓటువేసి రావొచ్చు.

  • పోలింగ్‌ కేంద్రం దూరంగా ఉన్నవారికి ర్యాపిడో ఉచిత రైడ్‌ సౌకర్యాన్ని అందజేస్తోంది. వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు.

  • సాయంత్రం 6 గంటల్లోపు క్యూలైన్‌లో ఉన్నా.. ఓటు వేసేందుకు అనుమతి ఉంది.

Updated Date - May 13 , 2024 | 05:05 AM

Advertising
Advertising