ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బీడీ కార్మికుల వేతనాలు పెంచాలి

ABN, Publish Date - Mar 16 , 2024 | 11:01 PM

చాలీచాలని వేతనాలతో కడు దుర్భరజీవనం కొనసాగిస్తున్న బీడీ కార్మికుల వేతనాలు తక్షణం పెంచేందుకు చర్యలు తీసు కోవాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి సూర్యం డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న సూర్యం

- కార్మికుల సమావేశంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి సూర్యం

చిన్నచింతకుంట, మార్చి 16 : చాలీచాలని వేతనాలతో కడు దుర్భరజీవనం కొనసాగిస్తున్న బీడీ కార్మికుల వేతనాలు తక్షణం పెంచేందుకు చర్యలు తీసు కోవాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి సూర్యం డిమాండ్‌ చేశారు. శనివారం మండల కేంద్రమైన చిన్నచింతకుంటలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జేఎన్‌ దేవదానం అధ్యక్షతన బీడీ కార్మికుల విస్తృతస్థాయి సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బీడీ కార్మికుల నుద్దేవించి సూర్యం మాట్లాడుతూ వేతనాలు చాలకపోవటంతో కార్మికులు ఎంతో కడుదుర్భరంగా బతుకుతున్నారని అన్నారు. వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వెయ్యి బీడీలకు రూ.350 ఇవ్వాలని, పీఎఫ్‌లో తప్పు లు లేకుండా సరిచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం బీడీ కార్మి కులతో కలిసి పరిశ్రమల యజమానులకు డిమాండ్‌ నోటీసులను అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్‌) నాయకులు సామెల్‌, అరుణ్‌కుమార్‌, ఐఎఫ్‌టీ యూ నాయకులు రాజు, ప్రసాద్‌, చంద్రన్న, మన్నెం, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 11:01 PM

Advertising
Advertising