తల్లిలాంటి ఒడి!
ABN, Publish Date - Oct 01 , 2024 | 12:18 AM
కడు పేదరిక జీవితాలు అవి. చెమట చిందిస్తేనే పూట గడుస్తుంది. కూలికి పోతేనే కూడు.. లేదంటే పస్తులే. పొద్దు పొడవక ముందే మొదలై సాయంసంధ్య వరకూ రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిందే. పల్లెల్లో జీవన చిత్రంలో నిత్యం కనిపించే దృశ్యాలివి. చంటి బిడ్డలను చంక దింపదింపలేక.. గుడిసెలో ఒంటరిగా వదిలి వెళ్లలేక అనేకమంది పేద తల్లులు ఇబ్బందులు పడుతున్నారు.
పేద పిల్లల కోసం ‘శిశు సదనం’
మూడేళ్లలోపు చిన్నారుల కోసం చైల్డ్‌కేర్ సెంటర్లు
అంగన్‌వాడీలకు అనుసంధానంగా ఏర్పాటు
ములుగు జిల్లా వ్యాప్తంగా 30 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహం
ఆరుచోట్లు ప్రారంభానికి సిద్ధం
ములుగు, సెప్టెంబరు 30: కడు పేదరిక జీవితాలు అవి. చెమట చిందిస్తేనే పూట గడుస్తుంది. కూలికి పోతేనే కూడు.. లేదంటే పస్తులే. పొద్దు పొడవక ముందే మొదలై సాయంసంధ్య వరకూ రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిందే. పల్లెల్లో జీవన చిత్రంలో నిత్యం కనిపించే దృశ్యాలివి. చంటి బిడ్డలను చంక దింపదింపలేక.. గుడిసెలో ఒంటరిగా వదిలి వెళ్లలేక అనేకమంది పేద తల్లులు ఇబ్బందులు పడుతున్నా రు. పొలం గట్టుపైనో, చెట్టుకు చీరతో ఊయల కట్టో వారిని నిద్రపుచ్చి పనులు చేసుకునేవారు ఎంతమం దో! వృద్ధులైన తల్లిదండ్రులుంటే బాలల ఆలనా పాల నా వారు చేసుకుంటారు. అదే పెద్దదిక్కు లేకుంటే ఆ పేద తల్లిదండ్రులకు గోసే. ఇలాంటి పరిస్థితి నుంచి ఊరట కలిగించేందుకు ప్రభుత్వం శిశు సదనాలను ఏ ర్పాటు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తం గా నిర్వహించే ఈ చైల్డ్‌కేర్ సెంటర్లకు క్రష్ ఫౌండేష న్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఏడు నెలల వయసు నుంచి మూడేళ్లలో పు చిన్నారులకు ఇక్కడ అమ్మ ఒడిలాంటి ప్రేమనుపం చుతూ సంరక్షించేందుకు అడుగులు పడుతున్నాయి.
ములుగు జిల్లాలో 30 కేంద్రాలు
కేంద్ర ప్రభుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం వాటాతో ఈ శిశు సదనాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడున్న అంగన్‌వాడీ కేంద్రాలకు అనుబంధంగా వీటిని నెలకొల్ప నున్నారు. తెలంగాణ రాష్ర్టానికి వెయ్యి కేంద్రా లు మంజూరు కాగా ఆర్థికంగా, సామాజికంగా వెనుక బడిన ములుగు జిల్లాకు 30 కేటాయించారు. వ్యవసా య, దినసరి కూలీలు, మూడేళ్లలోపు చిన్నారులు ఎక్కువ మంది ఉన్న కేంద్రాలను గుర్తించి వాటికి ప్రాధాన్యమివ్వనున్నారు. ప్రయోగాత్మకంగా తొలి విడతలో ఆరు చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ములుగు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధి లోని దేవనగర్, మల్లంపల్లి-3, ఏటూరునాగారం ప్రాజె క్టు పరిధిలోని రోహీర్-1, వెంకటాపురం(నూగూరు) పరిధిలోని రామచంద్రాపురం, ముత్తారం, ఏటూరు నాగారం ప్రాజెక్టు పరిధిలో మంగపేటలోని కూరాకుల వీధి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ శిశు సదనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్ర్తీ శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ అక్కే శ్వర్‌రావు బృందం శనివారం ములుగు మండలంలోని ఆయా అంగన్‌వాడీ కేంద్రాల ను సందర్శించి సానుకూల తను పరిశీలించింది. తొలుత ఈ ఆరు కేంద్రాలను ప్రారం భించనున్నారు. నిర్వహణలో లోటుపాట్లను సర్దుబా టు చేసుకొని నవంబరు 14 వరకు మిగతా 24 కేం ద్రాలను సిద్ధం చేయనున్నారు. కాగా, రెండు మొబైల్ శిశు సదనాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ దివాకర ప్రతిపాదించారు. ఉపాధిహామీ పనులు, కూలీ పను లు జరిగే ప్రదేశంలో వాహనాలను ఏర్పాటుచేసి చం టిపిల్లలను సంరక్షించనున్నారు. దీనికి అనుగుణంగా మోడల్ వాహనాలను రూపొందించేందుకు ఆలోచన చేస్తున్నారు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు..
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు ఉంటారు. ఉదయమే పనిలోకి వెళ్లి సాయంత్రానికి గానీ తిరిగి రారు. అందుకే ఈ శిశు సదనాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా ఓ టీచర్, ఆయాలను నియమిస్తారు. పిల్లలను నిద్రపుచ్చడానికి ఉయ్యాలలు, ఆడుకోవడానికి బొమ్మలు, ఆట వస్తువులు, వాకర్లు, ఇతర ఏర్పాట్లు ఉంటాయి. గుడ్డు, బాలామృతం పాలు, పండ్లు ఇవ్వనున్నారు. ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ కిట్లను కూడా సమకూర్చుతున్నారు. ఒక్కో చిన్నారికి రోజుకు రూ.8 చొప్పున ఖర్చుచేయనున్నారు.
జిల్లాలో 9,824 మంది చిన్నారులు
జిల్లావ్యాప్తంగా నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 640 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారు లు 9,824 మంది ఉన్నారు. అయితే 294 కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా 149 అద్దె గదుల్లో కొనసా గుతున్నాయి. మరో 197 ప్రభుత్వ పాఠశాలల్లోని గదుల్లో నిర్వహిస్తున్నారు. శిశు సదనాలకు ప్రత్యేకం గా ఓ గది, మూత్రశాల, మరుగుదొడ్డి తదితర సౌక ర్యాలున్న నిర్మాణాలు అవసరమున్నాయి. వీటిని గుర్తించేందుకు ఐసీడీఎస్ అధికారులు గ్రామాల్లో పరిశీలన చేపట్టారు.
తల్లిదండ్రులకు మంచి అవకాశం : కె.శిరీష, ఇన్‌చార్జి డీడబ్ల్యూవో
మూడేళ్లలోపు చిన్నారులున్న నిరుపేద తల్లిదండ్రుల కు శిశు సదనాలు ఎంతగానో ఉపయుక్తం కానున్నా యి. పాలు తాగే చంటిబిడ్డలను ఈ శిశు సదనాల్లో చేర్చుకొని సంరక్షించనున్నాం. వారికి అవసరమైన పౌష్టికాహారాన్ని ఇస్తూనే తల్లి ప్రేమను పంచుతాం. ఈ శిశు సదనాలను గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులు సద్వి నియోగం చేసుకోవాలి. ఈ కేంద్రాల నిర్వహణ కోసం కొత్తగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను నియమించు కుంటాం. దీంతో మరింత మంది నిరుద్యోగ మహిళలకు ఉపాధి లభిస్తుంది.
Updated Date - Oct 01 , 2024 | 12:18 AM