ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కన్వర్షన్‌.. కరప్షన్‌..

ABN, Publish Date - Jul 18 , 2024 | 12:55 AM

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌లు రెవె న్యూ, రిజిస్ర్టేషన్‌ శాఖలో కొంతమంది అధికారు లకు కాసులు కురిపిస్తున్నాయి. వ్యవసాయ భూము లను నివాస ప్లాట్లుగా మార్చేందుకు నాలా కన్వర్షన్‌ చే యాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం అన్నీ ఉన్నప్ప టికీ రెవెన్యూలో చేతులు తడపనిదే కన్వర్షన్‌ కావటం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. భారీ వెంచర్‌లు చేస్తే పన్నుల భారం పడుతుందని భావిస్తున్న రియల్టర్లు.. వ్యవసాయ భూములను ఫామ్‌ల్యాండ్‌గా గుంటల్లో విక్ర యిస్తున్నారు.

నాలా కన్వర్షన్‌లో రెవెన్యూ వసూళ్లు

ఫార్మ్‌ ల్యాండ్‌ పేరుతో గుంటల్లో విక్రయాలు

వ్యవసాయ భూములను నివాస భూములుగా మార్చుకుంటున్న వైనం

గుంట భూమిని గజాల్లోకి మార్చేందుకు చేతులు తడపాల్సిందే..

పదుల సంఖ్యలో నాలా కన్వర్షన్‌ దరఖాస్తులు

కొత్త డాక్యుమెంట్లకు రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో వసూళ్లే..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెవెన్యూ, రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో దందా

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌)

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌లు రెవె న్యూ, రిజిస్ర్టేషన్‌ శాఖలో కొంతమంది అధికారు లకు కాసులు కురిపిస్తున్నాయి. వ్యవసాయ భూము లను నివాస ప్లాట్లుగా మార్చేందుకు నాలా కన్వర్షన్‌ చే యాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం అన్నీ ఉన్నప్ప టికీ రెవెన్యూలో చేతులు తడపనిదే కన్వర్షన్‌ కావటం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. భారీ వెంచర్‌లు చేస్తే పన్నుల భారం పడుతుందని భావిస్తున్న రియల్టర్లు.. వ్యవసాయ భూములను ఫామ్‌ల్యాండ్‌గా గుంటల్లో విక్ర యిస్తున్నారు. గుంటల్లో కొనుగోలు చేసిన వ్యక్తులు నాలా క న్వర్షన్‌ చేయించేందుకు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు ప్రాంతాన్ని బట్టి గుంటకో రేటు పెట్టి మరీ వసూళ్లు చేస్తున్నారనే ప్రచారం ఉంది. ప్రధానంగా జిల్లా కేంద్రాలకు సమీపంలో ఉన్న రెవెన్యూ అధికారులకు నాలా కన్వర్షన్‌ కాసుల పంట పండిస్తోందనే చర్చ జరుగుతోంది. మరోవైపు రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో ఈ కొత్త డాక్యుమెంట్లను రిజిస్ర్టేషన్‌ చేసేం దుకు అదనంగా వసూళ్లకు దిగుతున్నారు. దీంతోకన్వర్షన్‌.. కరప్షన్‌గా మారిందనే విమర్శలున్నాయి.

గుంటల్లో విక్రయాలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఫామ్‌ల్యాండ్‌ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భారీ వెంచర్లు చేసేందుకు జంకుతున్నారు. వెంచర్లు చేస్తే అను మతులతోపాటు 10శాతం భూమిని మునిపల్‌ కార్పొరేష న్‌కు పార్కుల అభివృద్ధి కోసం వదిలి పెట్టాల్సి వస్తోంది. అటు పన్నులు.. ఇటు భూమిని కోల్పోతుండటంతో భారీగా నష్టం వాటిళ్లుతోందని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భావిస్తు న్నారు. దీంతో 10 ఎకరాల నుంచి వంద ఎకరాలకుపైగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఫామ్‌ల్యాండ్‌గా మారుస్తున్నారు. వివిధ రకాల పండ్ల చెట్లు, కొబ్బరి చెట్లతో పాటు కూరగాయల సాగుకు అనుగుణంగా భూమిని తీర్చిదిద్దుతున్నారు. చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నారు. అనంతరం ఐదు గుంటల నుంచి పైకి ప్లాట్లుగా మారుస్తున్నారు. గజాల్లోకి మార్చాలంటే నాలా కన్వర్షన్‌తో పాటు కూడా అనుమతులు తీసుకుని లేఅవుట్‌ చేయాల్సి ఉండటం ఆర్థికంగా భారాన్ని పెంచుతోందని రి యల్టర్లు భావిస్తున్నారు. ఫామ్‌ల్యాండ్‌లకు ఎలాంటి అను మతులు అవసరం లేదు. దీంతో తహసీల్దార్‌ కార్యాలయా ల్లో ధరణిలోనే ఐదు గుంటల చొప్పున భూమి కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. ఆ తరువాత భూమి కొనుగోలు చేసిన వ్యక్తులకు పట్టాదారు పాసు బుక్‌ లు చేతికి వచ్చిన తరువాత తాము కొనుగోలు చేసిన ఫామ్‌ ల్యాండ్‌ను గుంటల నుంచి గజాల్లోకి నాలా (నాన్‌ అగ్రికల్చ రల్‌ ల్యాండ్‌ అసెస్‌మెంట్‌ యాక్టు)కన్వర్షన్‌ చేయిస్తున్నారు. దీంతో రియల్టర్‌కు భారం తప్పుతుండగా, కొనుగోలు చేసిన వారికి తక్కువ ధరకు భూమి లభిస్తోంది. అయితే ప్రభు త్వానికే భారీగా నష్టం వాటిల్లుతోంది. పన్నులు, లేఅవుట్‌ రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ఇలా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వందల ఎకరాల్లో ఫామ్‌ల్యాండ్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రుపాయల అదాయానికి గండి పడుతోంది.

నాలా కన్వర్షన్‌తో కాసులే..

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా ఉన్న ఏరియాల్లోని రెవెన్యూ సిబ్బంది, అధికారులకు నాలా కన్వర్షన్‌ కాసుల పంట పండిస్తోంది. ప్రధానంగా హనుమకొండ, వరంగల్‌ నగర పరిధి, సమీపంలో ఉన్న రెవెన్యూ సిబ్బంది, అధికా రులకు కన్వర్షన్‌ కలిసి వస్తుందనే వ్యాఖ్యలు ఉన్నాయి. వరంగల్‌ నగర పరిధి భారీగా విస్తరిస్తోంది. అలాగే కొత్తగా ఏర్పడిన భూపాలపల్లి, మహబూబాబాద్‌, జనగా మ, ములుగు జిల్లా కేంద్రాలు కూడా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ భూముల్లో కొత్తగా వెంచర్లతో పాటు ఫామ్‌ ల్యాండ్‌లు, నివాసం కోసం ప్లాట్లుగా మార్చుకుం టున్నారు. వ్యవసాయ భూమిలో ఇంటి నిర్మాణానికి మునిసిపల్‌ కార్పొరేషన్‌ నుంచి అనుమతులు రావటం కష్టం. అంతేకాకుండా బ్యాంకుల నుంచి కూడా రుణాలు ఇవ్వటం కుదరదు. దీంతో వ్యవసాయ భూములను గుంటల నుంచి గజాల్లోకి నాలా కన్వర్షన్‌ చేయిస్తున్నారు. అయితే ఎకరాల భూమిని గుంటల్లో అమ్మకాల సమయంలోనే ధరణలో రిజిస్ర్టేషన్‌ చేయించాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే రెవెన్యూలోని అధికారులు ఏరియాను బట్టి గుంట భూమికి రూ.5వేల నుంచి రూ.20వేల వరకు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తరువాత నాలా కన్వర్షన్‌ చేయాలంటే 200గజాల స్థలానికి ఏరియాను బట్టి రూ.10వేల నుంచి రూ.50వేల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సమస్యాత్మక భూములైతే వాటికి వేరే రేటు ఉంటుందని సమాచారం. వరంగల్‌, హనుమకొండ నగరల్లో అయితే కన్వర్షన్‌కు లక్షల్లో వసూళ్లు చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఇలా ప్రతీ నెల పదుల సంఖ్యలో నాలా కన్వర్షన్‌, ఫామ్‌ల్యాండ్‌ భూములను గుంటల్లో రిజిస్ర్టేషన్‌ చేయటం వంటి వాటితో కొంతమంది రెవెన్యూ సిబ్బంది, అధికారులకు భారీగానే ముట్టుతున్నాయనే చర్చ జరుగుతోంది. నాలా కన్వర్షన్‌ రెవెన్యూకు కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిందనే ఆరోపణలున్నాయి. దీంతో కొంతమంది తహసీల్దార్‌లు వరంగల్‌, హనుమకొండ నగరాలతోపాటు కొత్త జిల్లా కేంద్రాల్లో, రియల్‌ భూమ్‌ ఉన్న ఏరియాల్లో పోస్టింగుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి.

కొత్త డాక్యుమెంట్‌కు అదనపు వసూళ్లు

వ్యవసాయ భూములను నాలా కన్వర్సన్‌తో కథ ముగిసి పోవటం లేదు. గుంటల్లోంచి గజాలకు నాలా కన్వర్షన్‌ చేయించిన తరువాత, అందులో కొంత భూమిని ఇతరులకు విక్రయించాలంటే మళ్లీ చేతులు తడుపాల్సిందేనట. నాలా కన్వర్షన్‌ అయినా భూమి నుంచి కొన్ని గజాల భూమిని ఇతరులకు విక్రయించేందుకు కొత్త డాక్యుమెంట్‌ తయారు చేయించాల్సి ఉంటుంది. రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో కొత్త డాక్యుమెంట్‌ తయారు చేయించటంతో పాటు రిజిస్ర్టేషన్‌ పూర్తి అయ్యే వరకు ఓ 200గజాల స్థలానికి భూమి విలువను బట్టి రూ.20వేల నుంచి రూ.1లక్షకు పైగా ఖర్చు వస్తుందని సమాచారం. ఇందులో డాక్యుమెంట్‌ రైటర్‌ నుంచి సబ్‌ రిజిస్ర్టార్‌ వరకు వాటాలు ఉంటాయనే ఆరోపణలు ఉన్నాయి. పాత డాక్యుమెంట్స్‌ కంటే కొత్తవాటికి 40శాతం అదనంగా వసూళ్లు చేస్తారని సమాచారం. మొత్తానికి వ్యవసాయ భూములను దొడ్డిదారిన కన్వర్షన్‌ చేయిస్తే ప్రభుత్వ అదాయానికి గండి పడితే అధికారులకు మాత్రం కాసుల పంట పండిస్తుందనే చర్చ జరుగుతోంది.

Updated Date - Jul 18 , 2024 | 12:55 AM

Advertising
Advertising
<