ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అభివృద్ధి మాటున చీకటి!

ABN, Publish Date - Jul 09 , 2024 | 11:47 PM

రామప్ప దేవా లయం అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. యునెస్కో గుర్తింపు పొంది నాలుగేళ్లవుతున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. ఎలాంటి పురోగతి ఇక్కడ కనిపించడం లేదు. ఆలయంలో అభివృద్ధి అనే ది ముందుకు సాగడం లేదు.

ప్రస్తుతం అవే లైట్లు వెలగడం లేదు..

నిర్లక్ష్యపు నీడలో రామప్ప దేవాలయం

మూణ్నాళ్ల ముచ్చటగా సెంట్రల్‌ లైటింగ్‌

‘బూడిదలో పోసిన పన్నీరు’లా నిధులు

రూ. కోటి వెచ్ఛించినా వృథా ప్రయాసే..

వెంకటాపూర్‌(రామప్ప), జూలై 9: రామప్ప దేవా లయం అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. యునెస్కో గుర్తింపు పొంది నాలుగేళ్లవుతున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. ఎలాంటి పురోగతి ఇక్కడ కనిపించడం లేదు. ఆలయంలో అభివృద్ధి అనే ది ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా రూ. కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌ మూ ణ్నాళ్ల ముచ్చటగానే మిగిలి పోయింది. ప్రధాన ఆర్చ్‌ నుంచి దేవాలయం వరకు 400 మీటర్ల డబుల్‌ సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ఈరోడ్డుపై సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్స్‌ను 2020 ఫిబ్రవరి 22న ప్రారంభిం చారు. అందులో 43 లైట్లను ఏర్పాటు చేశారు. అయి తే.. అవి మూడునెలలు పనిచేశాయి. ఆ విద్యుద్దీపాల వెలుగులు రామప్పలో కాంతులు నింపాయి. ఆతర్వాత అవి పని చేయకుండాపోయాయి. మరమ్మతులు చేయాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. దీంతో రామప్ప ఆలయ పరిసరాల్లో చీకట్లు అలుము కున్నాయి. నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా వాటిని వెలిగించాలన్న ఆలోచన అధికారులకు తట్టడంలేదు. అభివృద్ధి మాట దేవుడెరుగు.. కనీసం లైట్లను పునరు ద్ధరించాలనే ఉద్దేశం వారికి కలగడం లేదు. డబుల్‌ రోడ్డు కూడా గత వర్షాకాలంలో 400 మీటర్లమేర మధ్యలో తెగిపోయింది. దీంతో స్థానిక ప్రజలే మొరం పోశారు. అయినా అధికారులకు చలనం రాకపోవడం పట్ల పర్యాటకులు, గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామప్పకు కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తామని చెబుతున్న పాలకులు కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు.

అభివృద్ధి.. అంధకారం

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు కోట్లాది రూపాయలు వెచ్ఛించి రామప్ప దేవాలయంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కానీ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవన్నీ నిర్వీర్యమవుతున్నాయనే విమర్శలు వస్తున్నా యి. కాంట్రాక్టు పనులు ముగిసిన వెంటనే అభివృద్ధి పనులను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వాటి పర్యవేక్షణను గాలికొదిలేస్తున్నారని తెలుస్తోంది. రామ ప్పలో చేసిన అభివృద్ధి ఫలాలు పర్యాటకులకు అందా లంటే ఉన్నతాధికారిని పర్యవేక్షణ అధికారిగా నియ మించాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దేవా లయం తూర్పు ముఖద్వారానికి ఒక పక్క అభివృద్ధి పనులు, మరోపక్క అంధకారంలో నీలినీడలు కమ్ము కుంటున్నాయి. కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌, డబుల్‌రోడ్డు నిర్మాణం వృథా ప్రయా స అవుతోంది.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి రామప్ప తూర్పు ముఖద్వారంలో సెంట్రల్‌ లైటింగ్‌ పునర్నిర్మాణం చేసి డబుల్‌రోడ్డుకు మరమ్మతు లు చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jul 09 , 2024 | 11:47 PM

Advertising
Advertising
<