ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భయం.. భయం

ABN, Publish Date - Sep 14 , 2024 | 11:33 PM

పల్లె ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. బయటకు రావాలంటేనే భయంతో వణికి పోతున్నారు. వీధి కుక్కలు దాడులు చేస్తూ గాయపరుస్తుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. మండలంలో 45 రోజుల్లో 75 మంది గాయపడ్డారు. కుక్కల దాడిలో గాయపడి చిట్యాల సామాజిక ఆస్పత్రిలో 62 మంది, ఒడితల పీహెచ్‌సీలో 13 మంది చికిత్స తీసుకున్నారు. మండ ల కేంద్రంలోని పలు వీధుల్లో నాలుగు రోజుల క్రి తం ఒకే కుక్క 10 మందిని గాయపర్చింది,

బెంబేలెత్తిస్తున్న శునకాలు

కుక్కల దాడుల్లో 45 రోజుల్లో 75 మందికి గాయాలు

చిట్యాల మండలంలో తీవ్ర సమస్య

పట్టించుకోని అధికారులు

చిట్యాల, సెప్టెంబరు 14: పల్లె ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. బయటకు రావాలంటేనే భయంతో వణికి పోతున్నారు. వీధి కుక్కలు దాడులు చేస్తూ గాయపరుస్తుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. మండలంలో 45 రోజుల్లో 75 మంది గాయపడ్డారు. కుక్కల దాడిలో గాయపడి చిట్యాల సామాజిక ఆస్పత్రిలో 62 మంది, ఒడితల పీహెచ్‌సీలో 13 మంది చికిత్స తీసుకున్నారు. మండ ల కేంద్రంలోని పలు వీధుల్లో నాలుగు రోజుల క్రి తం ఒకే కుక్క 10 మందిని గాయపర్చింది, . కుక్కల దాడిలో గురయ్యేవారు మండల కేంద్రంలోని సామా జిక ఆస్పత్రి, ఒడితల పీహెచ్‌సీల్లో ఏఆర్‌వీ (యాం టీ రాబిస్‌ వ్యాక్సిన్‌) ఇంజక్షన్‌ను తీసుకుంటున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని భూపాలపల్లి జిల్లా ఆస్పత్రికి రిఫర్‌ చేస్తుండగా అక్కడి వైద్యులు ఇమ్యునోగ్లోబులిన్‌ ఇంజక్షన్‌ను ఇస్తున్నారు. మండ లంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారు లు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కుక్కల దాడిలో గాయపడితే యాంటీ రాబిస్‌ వ్యాక్సి న్‌ అందుబాటులో ఉందని చెబుతున్న అధికారులు.. వాటిని అరికట్టడంలో విఫలమవుతున్నారనే విమ ర్శలు వస్తున్నాయి. చిట్యాల సీహెచ్‌సీ, ఒడితల పీహెచ్‌సీలో ఏఆర్‌వీ (యాంటీ రాబిస్‌ వాక్సిన్‌) అందించినట్లు వైద్యాధికారులు డాక్టర్‌ శ్రీకాంత్‌, డాక్టర్‌ మౌనిక తెలిపారు. కుక్కల బెడదను అరిక ట్టేందుకు మండలంలోని పంచాయతీ అధికారు లు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బైక్‌పై వెళ్లాలంటేనే గుబులు

ద్విచక్ర వాహనదారులు గ్రామాల్లో ప్రయాణిసు న్నారు. కుక్కలు తరుముతుండటంతో అదుపుత ప్పి పలువురు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. చీకటి పడిన తర్వాత కుక్కలు ఎటువైపు నుంచి దాడి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.

అధికారులు పట్టించుకోవాలి..

- గజనాల రవీందర్‌, తిరుమలపురం

గ్రామాల్లో కుక్కల బెడద ఎక్కువైంది. గుంపులు, గుంపులుగా తిరుగుతున్నాయి. దీం తో తీవ్రంగా ఇబ్బందులు పడుతు న్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, మహిళలపై కుక్కలు దాడి చేస్తున్నాయి. గేదెలు, గొర్రెలు, మేకలను సైతం గాయపరుస్తున్నాయి. కుక్కల వల్ల రోడ్డు పై ఒంటరిగా వెళ్లాలంటే భయం వేస్తున్న ది. గ్రామ పంచాయతీ అధికారులు ప్రత్యే క చర్యలు తీసుకుని కుక్కలను నివారించాలి.

వెంటనే వైద్యం తీసుకోవాలి: డాక్టర్‌ మౌనిక, మెడికల్‌ ఆఫీసర్‌, ఒడితల పీహెచ్‌సీ

కుక్క కాటుపై నిర్లక్ష్యం చేయ కుండా అప్రమత్తంగా ఉండాలి. కుక్క, కోతికాటు విరుగుడుకు సంబంధించిన యాంటీ రాబిస్‌ వాక్సిన్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అం దుబాటులో ఉన్నాయి. గాయప ర్చిన వెంటనే ఆస్పత్రికి రావాలి.

Updated Date - Sep 14 , 2024 | 11:34 PM

Advertising
Advertising