ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముంపుపై ముందుజాగ్రత్త!

ABN, Publish Date - Jun 21 , 2024 | 11:18 PM

వనాకాలం వచ్చేసింది. ఎప్పటి లాగే ఈసారి కూడా లోతట్టు ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. అయితే.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైం ది. వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు సన్నద్ధ మైంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ ప్రకటనలతో అలర్ట్‌ అయ్యింది.

మోకాలి లోతు నీటిలో మేడారం (ఫైల్‌)

మలుగు జిల్లాకు వరద భయం

గోదావరి, జంపన్నవాగు, దయ్యాలవాగు పరివాహక ప్రజల్లో గుబులు

ప్రభావిత గ్రామాలు 98

సహాయ చర్యలకు అధికార యంత్రాంగం సన్నద్ధం

సిద్ధమైన యాక్షన్‌ప్లాన్‌

పునరావాస కేంద్రాల ఏర్పాటు.. నిత్యావసర సరుకుల నిల్వలు

ప్రత్యేక అధికారుల నియామకం

ఏటూరునాగారం ఐటీడీఏలో కంట్రోల్‌ రూమ్‌

ములుగు, జూన్‌ 21: వనాకాలం వచ్చేసింది. ఎప్పటి లాగే ఈసారి కూడా లోతట్టు ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. అయితే.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైం ది. వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు సన్నద్ధ మైంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ ప్రకటనలతో అలర్ట్‌ అయ్యింది. వరద పోటెత్తే జంపన్నవాగు, దయ్యాలవాగు, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతా లకు తరలించడం, నిత్యావసరాలు, మందులు అందిం చడంపై దృష్టిసారిస్తూనే వరద కట్టడికి జిల్లా ఉన్నతా ధికారులు చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల్లో కలెక్టర్‌ టి.ఎస్‌.దివాకర వరుస పర్యటనలు చేస్తూనే అధికారులతో సమావేశమవుతున్నారు. ముందస్తు సహాయక చర్యలపై అప్రమత్తం చేస్తున్నారు. అయితే.. గతం చేసిన గాయాలను తలుచుకుంటూ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

వరదలకు 16 మంది బలి

ములుగు జిల్లా చరిత్రలోనే తొలిసారిగా గతేడాది జూలై 26న ఒక్కరోజే 193.7మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. వెంకటాపూర్‌(రామప్ప) మండలం లక్ష్మీదేవిపేటలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 649.మి.మీ వర్షం కురిసింది. దీంతో పోటెత్తిన వరదల తో జిల్లా వ్యాప్తంగా 16మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ విపత్తుకు ఇంతమంది బలికావడం ఇదే తొలిసారి. ఏటూరునాగారం మండలం కొండాయిలో ఎనిమిది మంది మృతి చెందారు. వెంకటాపూర్‌(రామప్ప) మండలం బూర్గుపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఓ వృద్ధురాలు, భార్యాభర్తలు వరదలో కొట్టు కుపోగా ఇద్దరి శవాలు ఇంకా లభ్యం కాలేదు. గోవిందరావుపేట మండలం ప్రాజెక్టునగర్‌లో తల్లి, ఇద్దరు కుమారులు దయ్యాలవాగు ప్రవాహంలో గల్లంతయ్యారు. తల్లి, ఓ కొడుకు మృతదేహాలు దొరకకగా రెండేళ్ల మరో బాలుడి ఆచూకీ ఇప్పటికీ లేదు. మేడారంలోని జంపన్నవాగు ఒడ్డున ఓ గుర్తుతెలియని వ్యక్తి వరదకు కొట్టుకొచ్చి విద్యుత్‌ తీగలకు చిక్కుకొని మరణించాడు. 329 మూగజీవాలు వరదలో కొట్టుకుపోయి మృతిచెందాయి.

ధ్వంసమైన రోడ్లు.. తెగిన చెరువులు.. కూలిన ఇళ్లు..

వరదలకు జనజీవనం అస్తవ్యస్థం కాగా రోడ్లు ధ్వంసమయ్యాయి. చెరువులు, కాల్వలు తెగిపోగా కొన్ని ఇళ్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నా యి. అధికారిక లెక్కల ప్రకారం 52 రోడ్లు కొట్టుకు పో యాయి. 81చెరువులు, కుంటల కట్టలు దెబ్బతినగా పంటకాల్వలకు గండ్లు పడ్డాయి. 105 విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్లు, 2 వేలకు పైగా కరెంటు స్తంభాలు దెబ్బతిన గా విద్యుత్‌ శాఖకు రూ.5 కోట్లకు పైగా నష్టం కలిగిం ది. 184 ఇళ్లు పాక్షికంగా, 43 పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఆలస్యమైన పునరుద్ధరణ చర్యలు

ఎన్నికలు, కోడ్‌ అమలులో ఉండటంతో వరదల నివారణ, పునరుద్ధరణ చర్యలపై ప్రభావం పడింది. 2023 చివరార్ధం, 2024 ప్రఽథమార్ధమంతా అలాగే గడిచిపోయింది. దీంతో ప్రతిపాదనలు సమర్పించినా నిధులు మంజూరుకాని పనులు కొన్నైతే.. చాలావరకు నిధులు విడుదలైనా మొదలుపెట్టలేని పరిస్థితి నెలకొంది. 15రోజుల క్రితమే ఆంక్షలన్నీ తొలగిపోగా అధికార యంత్రాంగం కదిలింది. శాశ్వత నిర్మాణాలకు అనువైన సమయం లేకపోవడంతో ఎలాంటి ప్రమా దం, ఇబ్బంది లేకుండా ఈసీజన్‌ గట్టెక్కే విధంగా తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు. వరదలకు కొట్టుకుపోయిన కొండాయి హైలెవల్‌ వంతెనకు రూ.9.50కోట్లు మంజూరైనప్పటికీ ప్రస్తుతం రూ.35 లక్షల వ్యయంతో ఐరన్‌ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిని నిర్మించా రు. తాడ్వాయి-గోవిందరావుపేట మధ్య జలగలంచ కాజ్‌వే కొట్టుకుపోయి జాతీయ రహదా రిపై 27రోజులు రాకపోకలు నిలిచిపోగా తాత్కాలిక మరమ్మతులు చేసి వినియో గంలోకి తెచ్చారు. ఇక్కడ హైలెవల్‌ వంతెన నిర్మాణానికి ప్రభుత్వానికి నివేదించారు. అయితే.. ములుగు-గణ పురం మధ్య బండారుపల్లి వద్ద రాళ్లవాగు కల్వర్టు కూలిపోగా పక్క నుంచి తాత్కాలిక రోడ్డు వేసినప్పటికీ ఈసారి వరదలకు రాకపోకలకు అంతరాయం తప్పేట్టు లేదు. కల్వర్టు నిర్మాణానికి రూ.2 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.

ప్రమాదంలో చెరువులు, కుంటలు

మిషన్‌ కాకతీయ పనులు తప్ప ఈమధ్యలో మరమ్మతులు లేని అనేక చెరువులు, కుంటలు వరదల ప్రభావానికి గురయ్యాయి. మేజర్‌, మైనర్‌ ఇరిగేషన్‌ పరిధిలోని 81 చెరువులు, 38 కాల్వలు దెబ్బతిన్నాయి. రూ.7.8 కోట్లతో పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం వీటికి వరద ముప్పు పొంచి ఉంది. కట్టలు, తూములు, మత్తడి దెబ్బతినగా తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. బూర్గుపేట వద్ద గల మారేడుగొండ చెరువు కట్ట నిర్మాణానికి రూ.4.8 కోట్లతో ప్రతిపాదనలు పంపగా నిధులు మంజూరుకావాల్సి ఉంది. దీంతో 543 ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడింది. ఏటూరునాగారం నుంచి మంగపేట దాకా గోదావరి ఒడ్డు కోతకు గురికాగా రూ.137 కోట్లతో చేపట్టిన కరకట్ట పనులూ ముందుకు సాగడంలేదు. రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు తూములకు మరమ్మతు చేయడంతోపాటు కరకట్టపై పలుచోట్ల ఇసుక బస్తాలను వేస్తున్నారు.

- మునిగేవి 48.. సంబంధాలు తెగేవి 50..

జిల్లావ్యాప్తంగా 98గ్రామాల వరద ప్రభావితమైనవిగా గుర్తించారు. వెంకటాపురం(నూగూరు) మండలంలో 10, గోవిందరావుపేటలో 11, కన్నాయిగూడెంలో 4, ఏటూరునాగారంలో 8, తాడ్వాయిలో 9, వాజేడులో 1, మంగపేట మండలంలో 5గ్రామాలు వరద ముంపునకు గురవుతుండగా మరో 50గ్రామాలకు రోజుల తరబడి సంబంధాలు తెగిపోయే ప్రమాదమున్నట్లు గుర్తించారు. వీటిలో వెంకటాపురం(నూగూరు)లో 2, కన్నాయిగూడెంలో 1, ఏటూరునాగారంలో 11, వాజేడులో 10, గోవిందరావుపేటలో 6, తాడ్వాయిలో 5, ములుగులో 1, మంగపేటలో 5 గ్రామాలున్నాయి. గోదావరి నది, జంపనవాగు పరివాహకంలోని పొదుమూరు, గుడ్డేలుగులపల్లి, కత్తిగూడెం, వాడగూడెం, అకినపల్లి మల్లారం, రమణక్కపేట, రాజుపేట, బ్రాహ్మణపల్లి, రామన్నగూడెం, నందమూరి నగర్‌, ఏటూరునాగారం ఎస్సీ కాలనీ, వాడగూడెం, కొండాయి, మల్యాల, గుమ్మడిదొడ్డి ఎస్సీ కాలనీ, మురుమూరు కాలనీ, వాజేడు నాగారం, బీసీ కాలనీ, పూసూరు, ఇప్పగూడెం, కంతనపల్లి వెంకట్రావ్‌పల్లి, కొత్తూరు సర్వాయి, గంగుగూడెం, వెంగల్‌రావుపేట, బోదాపురం, పుస్సవానిగూడెం ముంపుకు గురయ్యే జాబితాలో ఉన్నాయి.

- గ్రామానికో అధికారి

వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం గ్రామానికో ప్రత్యేక అధికారిని నియమించడం జరిగింది. ఆయా శాఖల మండలస్థాయి అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఏటూరునాగారం ఐటీడీఏలో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. ములుగు కలెక్టరేట్‌తోపాటు ఇక్కడినుంచి జిల్లాస్థాయి అధికారులు నిరంతరం సమీక్షించనున్నారు. గతేడాది 49 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి 5,861 మందికి ఆశ్రయం కల్పించిన అధికారులు ఈసారి కూడా ఆయా పునరావాస కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. 61 గ్రామపంచాయతీల పరిధిలోని 93 ఆవాసాల ప్రజలు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటుండగా సమీపంలోని పాఠశాలలు, పంచాయతీ భవనాల్లో విడిది, భోజనం సదుపాయం కల్పించేందుకు సిద్దమయ్యారు. అవసరమైన నిత్యావసరాలు, మందులను ముందే అందుబాటులో ఉంచుకుంటున్నారు. పారిశుధ్య చర్యల కోసం బ్లీచింగ్‌ పౌడర్‌, దోమల మందు పిచికారీ ద్రావకాన్ని నిల్వ చేస్తున్నారు.

Updated Date - Jun 21 , 2024 | 11:18 PM

Advertising
Advertising