ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మళ్లీ మంచిరోజులు!

ABN, Publish Date - Jul 11 , 2024 | 12:16 AM

గత ఏడాది సంభవించిన ప్రకృతి వైపరీత్యాన్ని తలచుకుంటే.. ఇప్పటికీ వెన్నులో వణుకు వస్తోంది. జూలై 27 రాత్రిని మరచిపోలేం. కుంభవృష్టి వర్షం భూపాలపల్లి జిల్లాను అతలాకు తలం చేసింది. వాగులు వంకలు పొంగిపోర్లాయి.. చెరువులు దెబ్బతిన్నాయి. జలదిగ్బంధనంలో జనం చిక్కుకొని విలవిలలాడారు. ఊర్లను వరద ముంచెత్తింది.

నిర్మాణం పూర్తయిన గణపురం మండలం ధర్మారావుపేట ఊర చెరువు కట్ట

యుద్ధప్రాతిపదికన చెరువుల పునరుద్ధరణ

రూ. 25 కోట్లతో ముమ్మరంగా పనులు

10వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నదే లక్ష్యం

ఈ వానాకాలంలోనే అందించేందుకు చర్యలు

భూపాలపల్లి కలెక్టరేట్‌, జూలై 10: గత ఏడాది సంభవించిన ప్రకృతి వైపరీత్యాన్ని తలచుకుంటే.. ఇప్పటికీ వెన్నులో వణుకు వస్తోంది. జూలై 27 రాత్రిని మరచిపోలేం. కుంభవృష్టి వర్షం భూపాలపల్లి జిల్లాను అతలాకు తలం చేసింది. వాగులు వంకలు పొంగిపోర్లాయి.. చెరువులు దెబ్బతిన్నాయి. జలదిగ్బంధనంలో జనం చిక్కుకొని విలవిలలాడారు. ఊర్లను వరద ముంచెత్తింది. ఇల్లు చెదిరి అనేక మంది నిరాశ్రుయులయ్యారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు. పొలాల్లోకి నీరు చేరి పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ధ్వంసమైన చెరువులు

గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో భూపాలపల్లి నియోజకవర్గంలోని చెరువులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏడు మండలాల పరిధిలో మొత్తం 162 చెరువులు ధ్వంసమయ్యాయి. మరింత నష్టం వాటిల్లకుండా వీటిలో కొన్నిటిని రైతుల సాయంతో నీటిపారుదల శాఖ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. మిగిలిన 124 చెరువుల్లో కొన్నిటి కట్టలు పూర్తిగా కొట్టుకుపోయాయి. మరికొన్నిటి మత్తడులు, తూములు ధ్వంసమయ్యాయి. ఎక్కువ శాతం చెరువులు కట్టలు కోట్టుకుపోవడంతోపాటు పొలాలకు సాగు నీరందించే కాల్వలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. భూపాలపల్లి మండలంలో కొత్తపల్లి(ఎస్‌ఎం), రేగొండ మండలంలోని చిన్నకోడేపాక తది తర పెద్ద చెరువులు వరద ఉధృతితో పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని వందల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. వానలకు దెబ్బతిన్న చెరువుల్లో కొన్నిటిని అధికారులు అప్పటికప్పుడు పునరుద్ధరించి సాగునీరు అందించారు. మిగి లిన 124 చెరువులు మాత్రం పూర్తిగా ధ్వంసం కావడంతో రైతులు గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు వేయలేదు. సాగునీరు అందక సుమారు 10వేల ఎకరాలు పూర్తిగా బీడువారిపోయాయి.

రూ. 25 కోట్లతో పునరుద్ధరణ

భూపాలపల్లి నియోజకవర్గంలో పూర్తిగా దెబ్బతిన్న 124 చెరువుల పునరుదఽ్ధరణ పనులను అధికారులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. రూ. 25 కోట్ల ప్రత్యేక నిధులతో ఆయకట్టుకు ఖరీఫ్‌ పంటకు నీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. దెబ్బతిన్న చెరువుల కట్టలు, మత్తళ్లు, తూములను పునరుద్ధరిస్తున్నారు. 75 శాతం చెరువులకు సం బంధించిన పనులను ఇప్పటికే పూర్తి చేసిన అధికారులు కాల్వల పునరు ద్ధరణపై దృష్టి సారించారు. రైతులు పంటలు వేసుకునే సమయం సమీపి స్తుండటంతో పనుల్లో వేగం పెంచారు.

అధికారుల అలసత్వమే కారణం!

గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు చెరువులు దెబ్బతినడంలో అధికా రుల అలసత్వం ఉన్నట్లు అప్పట్లో విమర్శలు వచ్చాయి. చేపలు కొట్టుకుపోకుండా మత్తళ్లకు స్థానిక మత్సకారులు ఏర్పాటుచేసుకున్న పనులే చెరువులు కొట్టుకుపోవడానికి కారణమని నిర్ధారించిన నీటిపారుదల అధికారులు అప్పటి ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చుకున్నారు. వరదల వల్ల చెరువు మత్తడి గుండా చేపలు కొట్టుకుపోకుండా మత్సకారులు ఇసుప జాలీలను కట్టారు. చెరువులోకి వచ్చే వరద నీరు బయటకు వెళ్లే క్రమంలో మత్తళ్ల వద్ద అక్రమంగా ఏర్పాటుచేసిన ఇనుప జాలీలకు వరదల్లో వచ్చే చెత్తాచెదారం పేరుకుపోయి అడ్డుకట్టగా ఏర్పడి కట్టలపై ఒత్తిడి ఏర్పడిందని తెలుస్తోంది. దీంతో కట్టలు కొట్టుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. భూపాలపల్లి మండలం కొత్తపల్లి(ఎస్‌ఎం) శివారు దొమ్మటిపల్లి చెరువు, రేగొండ మండలం చిన్నకోడేపాక చెరువులు ఈ కారణంతోనే తెలిపోయాయి. మరిన్ని చెరువులు కూడా ఇలానే ధ్వంసమయ్యాయి. మత్తడి గుండా చేపలు కొట్టుకుపోకుండా తెరలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా మత్స్యకారులు పటిష్ఠ జాలీలను ఏర్పాటు చేసుకోవడం వల్లే చెరువులు తెగిపోవడానికి కారణమని తెలుస్తోంది. దీనిపై అధికారులు మొదట్లోనే దృష్టి పెట్టలేదని, దీని వల్లే చెరువులకు నష్టం వాటిల్లిందని విమర్శలు వినిపిస్తున్నాయి. మత్స్యకారులకు అవగాహన కల్పిస్తే ఇలా చెరువులు ధ్వంసమయ్యేవి కావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ

భారీ వర్షాలతో దెబ్బతిన్న చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా జరగ డంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణరావు ప్రత్యేక చొరవ చూపారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నీటి పారుదల శాఖ అధికారులతో ఆయన సమావే శమయ్యారు. చెరువుల మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పాలనపరమైన అనుమతులు తెప్పించారు. పనులు వేగంగా జరిగేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో తనకున్న ప్రత్యేక అనుబంధంతో రూ.25 కోట్ల నిధులను మంజూరు చేయించుకున్నారు. మళ్లీ పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ రావడంతో ఎన్నికల అధికారులతో మాట్లాడి అంతకుముందే పాలన అనుమతులు పొందిన టెండర్‌ నమోదు చేసిన పనులను ప్రారంభించేలా ఎమ్మెల్యే విశేష కృషి చేశారు.

ధ్వంసమైన 124 చెరువుల మరమ్మతులకు రూ. 25 కోట్లు మంజూరు చేయించి, యుద్ధప్రతిపాదికన పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. కొన్ని చోట్ల పనులు పూర్తి కాగా, మరికొన్ని చోట్ల పనులు 90శాతం పూర్తయ్యాయని, ఈ వానాకాలంలోనే రైతులకు చెరువుల ద్వారా సాగునీరు అందించి తీరుతామని చెప్పారు. రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని అన్నారు.

Updated Date - Jul 11 , 2024 | 12:16 AM

Advertising
Advertising
<