ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీమా.. రైతన్నకు ధీమా

ABN, Publish Date - Jul 27 , 2024 | 11:20 PM

పెద్ద దిక్కును కోల్పోయిన అన్నదాతల కుటుంబాలకు రైతు బీమా పథకం ఆసరా గా నిలుస్తోంది. కర్షకులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే ఈ పథకాన్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రారంభించిం ది. కొత్తగా పట్టాదారు పుస్తకాలు పొందిన వారు, గతంలో బీమా పథకంలో ఉండి నామినీ చనిపోయిన వారు, ఆధార్‌కార్డులో తప్పులు ఉన్నవారు సరిదిద్దుకు నేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.

బాధిత కుటుంబాలకు బాసటగా ‘రైతు బీమా’

నూతన పట్టాదారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

జూన్‌ 28లోపు పాస్‌బుక్‌ పొందిన వారు అర్హులు

ఆగస్టు 5వ తేదీ తుది గడువు

ఈనెల 30 వరకు రెన్యూవల్స్‌, తప్పుల సవరణకు అవకాశం

జిల్లాలో 8,665 మంది నూతన పట్టాదారులు

జఫర్‌గడ్‌, జూలై 27 : పెద్ద దిక్కును కోల్పోయిన అన్నదాతల కుటుంబాలకు రైతు బీమా పథకం ఆసరా గా నిలుస్తోంది. కర్షకులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే ఈ పథకాన్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రారంభించిం ది. కొత్తగా పట్టాదారు పుస్తకాలు పొందిన వారు, గతంలో బీమా పథకంలో ఉండి నామినీ చనిపోయిన వారు, ఆధార్‌కార్డులో తప్పులు ఉన్నవారు సరిదిద్దుకు నేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రామాల వారీగా గడువులోగా కొత్త పట్టాలు పొందిన వారి జాబితాను ప్రకటించింది. వారి నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకు సంబం ధించిన దరఖాస్తు పత్రాలను సంబంధిత వ్యవసాయ శాఖాధికారులు, విస్తరణాధికారులు (ఏఈఓ)లకు ఇచ్చారు. వారి సమక్షంలో రైతు దరఖాస్తుపై సంతకం చేయాల్సి ఉంటుంది. బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోంది.

2018 నుంచి బీమా ఫథకం అమలు

కుటుంబ యజమాని అయిన రైతు ఏదేని కారణం చేత మరణించినపుడు బాధిత రైతు భార్యా, పిల్లలను ఆర్థికంగా ఆదుకునేందుకు గత ప్రభుత్వం 2018, ఆగస్టు 18 నుంచి రైతు బీమా పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. అకాల మరణం చెందిన రైతు మర ణ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాతో పాటు నామినీ పత్రాలను అందిస్తే రూ.5 లక్షల పరిహా రాన్ని ఎల్‌ఐసీ సంస్థ అందిస్తుంది. రైతుల వార్షిక ప్రీమి యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా ఎల్‌ఐసీ సంస్థతో ఒప్పందం కొనసాగుతోంది. ఒక్కో రైతు పేరు మీద సంస్థకు ప్రభుత్వమే రూ.3,600ల చొప్పున ప్రీమి యం చెల్లిస్తుంది. 2023 ఆగస్టు 19 వరకు గత సర్కార్‌ ప్రీమియం చెల్లించినప్పటికీ.. ఈ ఏడాది 2024 ఆగస్టు లో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా ప్రభు త్వం 2024 జూన్‌ 28 వరకు పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండి 18 నుంచి 59 ఏళ్ల వయసున్న రైతులు ఈ బీమా పథకానికి అర్హులని ప్రకటించింది.

రైతు కుటుంబాలకు ఆర్థికంగా అండగా..

జిల్లాలో జనాభాలో అత్యధిక శాతం రైతులు ఉన్నారు. అనుకోని పరిస్థితుల్లో రైతు చనిపోతే అతని కుటుంబ సభ్యులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. అటువంటి సందర్భాల్లో బీమా పథకం ఆర్థికంగా చేయూతనందిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో పట్టాదారు పాస్‌పుస్తకాలు కలిగిన రైతులు 1,92,786 మంది ఉన్నారు. కొత్తగా పట్టాదా రు పుస్తకాలు పొందిన రైతులు 8,665 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఆగస్టు 5 వరకు దరఖాస్తులకు అవకాశం

రైతు బీమా పథకానికి కొత్తగా పట్టాదారు పాసుపు స్తకాలు పొందిన రైతులు ఆగస్టు 5వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఏడాది జూన్‌ 28లోపు పట్టాదారు పాసుపుస్తకం లేదా తహసిల్దార్‌తో డిజిటల్‌ డీఎస్‌ పేపర్‌ ఉన్నవారే బీమా దరఖాస్తుకు అర్హులు. రైతు వయసు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హులైన వారు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డు జిరాక్స్‌ ప్రతులను స్థానికంగా ఉండే ఏఈవోలకు నేరుగా అందించాలి. వారు వ్యవసా య శాఖ సైట్‌లో వివరాలను నమోదు చేస్తారు. కాగా, బీమాను రెన్యూవల్‌ చేసుకోవాలన్నా.. సవరణలు చేసు కోవాలన్నా ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకో వాలి. బీమా చేసుకున్న రైతు ఏ విధంగా మరణించినా బాఽధిత కుటుంబానికి పరిహారం కింద రూ.5 లక్షలు అందుతుంది. నామినీ ఖాతాలో బీమా పరిహారాన్ని ఎల్‌ఐసీ సంస్థ జమ చేస్తుంది.

రైతులు దరఖాస్తు చేసుకోవాలి..

పి.వినోద్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి

ప్రభుత్వం కల్పించిన బీమా సదుపాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారు 8,665 మంది రైతులు ఉన్నారు. ఇందులో నిబం ధనల ప్రకారం 18 నుంచి 59 ఏళ్ల లోపు ఉన్న రైతులకు మాత్రమే బీమా పథకం వర్తిస్తుంది. వ్యవసాయాఽధికారులు, ఏఈవోల వద్దకు రైతులు నేరుగా వెళ్లి సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులను సమర్పించి తమ పేర్లను నమోదు చేయించుకోవాలి.. ఈ పథకం గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.

Updated Date - Jul 27 , 2024 | 11:20 PM

Advertising
Advertising
<