ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మార్గం సుగమమేనా..?!

ABN, Publish Date - Aug 25 , 2024 | 11:13 PM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న మంచిర్యాల-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవేకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలో సుమారు 25 కిలో మీటర్ల మేర ఈ జాతీయ రహదారిని నిర్మించనున్నారు. ఇందుకు 130.5 హెక్టార్ల భూమి

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి అడ్డంకులు

ప్రశ్నార్థకంగా భూసేకరణ

పరిహారం సరిపోతుదంటున్న రైతులు

ఎకరాకు రూ. 40 లక్షల డిమాండ్‌

భూపాలపల్లి జిల్లాకు 130.5 హెక్టార్ల అవసరం

భూపాలపల్లి కలెక్టరేట్‌, ఆగస్టు 25: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న మంచిర్యాల-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవేకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలో సుమారు 25 కిలో మీటర్ల మేర ఈ జాతీయ రహదారిని నిర్మించనున్నారు. ఇందుకు 130.5 హెక్టార్ల భూమి అవసరం ఉండగా సేకరణ విషయంలో కొన్ని అవరోధాలు ఎదురవుతున్నాయి. దీంతో ఈ రహదారికి మార్గం సుగమయ్యేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, టేకుమట్ల, మొగళ్లపల్లి మండలాల్లోని 14 గ్రామాల మీదుగా గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే నిర్మాణం కానుంది. ఇందుకు 515 రైతులకు చెందిన 326.5 ఎకరాలు (130.5 హెక్టార్లు) భూమి అవసరం ఉంది. చిట్యాల మండలంలోని కల్వపల్లి, గిద్దము త్తారం, నవాబుపేట, టేకుమట్ల మండం లోని రాఘవపూర్‌, పెద్దంపల్లి, పంగి డిపల్లి, ఆశిరెడ్డిపల్లి, రామకృష్ణపూర్‌ (టి), అంకుషాపూర్‌, టేకుమట్ల, సుబ్బక్కపలి,్ల మొగుళ్లపల్లి మండలంలోని మొగుళ్లపల్లి, రంగపూరం, మెదరిమేట్ల గ్రామాల పరిధిలోని భూముల మీదుగా గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మించేందుకు డీపీఆర్‌ను రూపొందించారు. పెద్దపల్లి జిల్లా నుంచి భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం కాల్వపల్లిలో జాతీయ రహదారి మొదలై మొగుళ్లపల్లి మండలం రంగపూరం మీదుగా హనుమకొండ జిల్లాలోకి ప్రవేశించనుంది.

ఎకరాకు రూ.40 లక్షల డిమాండ్‌

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం కోసం చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లోని 14 గ్రామాల పరిధిలోని 130.5 హెక్టార్ల భూమిని వినియోగించనున్న నేపథ్యంలో ఎన్‌హెచ్‌ అధికారులు డీపీఆర్‌ సిద్ధం చేశారు. భూసేకరణపై రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. సేకరణ కోసం గుర్తించిన భూములకు చెందిన రైతులకు ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేసి అవార్డులు రూపొందించారు. రిజిస్ట్రేషన్‌ ధరకు రెండు నుంచి మూడు రెట్ల పరిహారం చెల్లించేందుకు సిద్ధమని విరవించారు. అయితే.. ఈ మండలాల్లో రిజిస్ట్రేషన్‌ ధర రూ.2 లక్షల వరకు ఉంది. దీన్నిబట్టి రైతులకు రూ. 4 లక్షల నుంచి 6 లక్షలు మాత్రమే పరిహారం అందనుంది. దీనిపై రైతులు సుముఖంగా లేరు. తమకు మార్కెట్‌ ధర ప్రకారం డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎకరాకు రూ. 40 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే... రైతులు పరిహారంపై జిల్లా మెజిస్ట్రేట్‌ వద్ద పిటీషన్‌ దాఖలు చేస్తే మరింత పరిహారం అందే అవకాశం ఉంది.

సర్కారు భూముల నుంచి సాధ్యమేనా?

భూపాలపల్లి జిల్లా నుంచి సుమారు 326 ఎకరాల విస్తీర్ణంలో జరుగునున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి రైతుల నుంచి భూసేకరణకు అధికారు లు సిద్ధమవుతున్నారు. హైవే నిర్మాణంతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ భూముల నుంచి రహదారి నిర్మాణం చేసేందుకు భూములను గుర్తిం చాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రంగంలో కి దిగిన అధికారులు సర్వే నిర్వహి స్తున్నట్లు సమాచారం. అయితే.. డీపీఆర్‌ సిద్ధమైన తర్వాత రోడ్డు నిర్మాణానికి ఇతర మార్గంలోకి మరల్చే ఆలోచన ఆచారణ సాధ్యమేనా..? అనే ప్రశ్నలు తెలుత్తుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ భూములు కూడా హైవే నిర్మాణ పరిసరాల్లో అంతంత మాత్రంగానే ఉన్నట్లు సమాచారం.

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం

రాష్ట్రంలోని నేషనల్‌ హైవే నిర్మాణంలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. భూసేకరణ త్వరితగతిన పూర్తి చేసి హైవే అధికా రులకు భూములు అప్పగించాలని కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైతులకు మెరు గైన పరిహారం అందించి భూసేకరణ చేపట్టాలన్నా రు. ఈ నేపథ్యంలో పలుమార్లు రైతులతో కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సమావేశమయ్యారు. నేషనల్‌ హైవే అధికారులు ఇచ్చే పరిహారం సరిపోకపోతే జిల్లా మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకోవాలని, దీంతో మరింత ఎక్కువగా అందించే అవకాశం ఉంటుందని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇదే క్రమంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మించే ఇతర జిల్లాల్లో జరుగుతున్న భూసేకరణ, రైతులకు చెల్లిస్తున్న పరిహారంపై భూపాలపల్లి జిల్లా అధికారులు ఆరా తీస్తున్నారు.

మెరుగైన పరిహారం అందిస్తాం

- గండ్ర సత్యనారాయణరావు,భూపాలపల్లి ఎమ్మెల్యే

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణంలో భూములు కోల్పో తున్న రైతులకు మెరుగైన పరిహారం అందిస్తాం. భూసేక రణలో చాలా మంది సన్నకారు రైతులు మాత్రమే ఉన్నారు. వారి కుటుంబాలకు ఆదుకునే బాధ్యత మాపై ఉంది. ఇతర జిల్లాలో జరుగుతున్న భూసేకరణలో రైతులకు అందిస్తున్న విఽధంగా ఇక్కడా చెల్లిస్తాం.

Updated Date - Aug 25 , 2024 | 11:14 PM

Advertising
Advertising
<