ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TS News: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Sep 26 , 2024 | 08:35 AM

బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జనగామ కాంగ్రెస్‌లో ముగ్గురు కోవర్టు నేతలు ఉన్నారని ఆరోపించారు.

జనగామ: బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జనగామ కాంగ్రెస్‌లో ముగ్గురు నాయకులు కోవర్టులుగా మారారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డితో కంచె రాములు, ఎర్రమళ్ల సుధాకర్, వేమళ్ల సత్యనారాయణరెడ్డి కుమ్మక్కయ్యారని, వీరంతా కలిసి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తన ఓటమికి వీరు ముగ్గురే కారణమని సీఎం రేవంత్ రెడ్డికి ప్రతాప్ రెడ్డి ఫిర్యాదు చేశారు.


ఈ ముగ్గురు కోవర్ట్ నేతలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డితో కుమ్మక్కై పార్టీ ప్రతిష్టను మంటగలుపుతున్నారని, ఈ నేతలపై చర్యలు తీసుకోవాలని ప్రతాప్ రెడ్డి కోరారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి దగ్గర కంచె రాములు రూ.3 కోట్లు తీసుకున్నారని, అందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.


సుఫారీ హత్యలు చేసే వారితో జతకట్టి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు కంచె రాములు, ఎర్రమళ్ల సుధాకర్, వేమళ్ల సత్యనారాయణరెడ్డిలపై సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీకి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

Updated Date - Sep 26 , 2024 | 08:41 AM