ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాయా జూదం!

ABN, Publish Date - Jul 23 , 2024 | 11:39 PM

సరదా కోసం అలవాటు చేసుకున్న ఆన్‌లైన్‌ గేమ్‌ కాస్తా ప్రాణాల మీదికి వస్తోంది. ఆట మోజులో పడిన యువకులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ మాయదారి జూదానికి జిల్లాలో ఇప్పటికే ముగ్గురు యువకులు బలయ్యారు. మరికొందరు అప్పులపాలైతే తల్లిదం డ్రులు భూములు అమ్మి అప్పు తీర్చిన సంఘ టనలు ఉన్నా యి. సరదాగా రంగంలోకి దిగి.. సీరియస్‌గా మారి.. అనాలోచితంగా అప్పులు చేసి వాటిని ఎలా తీర్చాలో తెలియక.. ఎవరికీ చెప్పుకోలేక అందోళనతో బలవన్మరణానికి పాల్పడుతూ కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్న సంఘటనలు ఉన్నాయి.

కుటుంబాలను ఆగం చేస్తున్న ఆన్‌లైన్‌ గేమ్‌

అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్న యువత

జిల్లాలో ఇప్పటికే ముగ్గురి బలవన్మరణం

అవగాహన కల్పిస్తున్న పోలీసులు

రఘునాథపల్లి, జూలై 23: కొత్తగా పుట్టుకొచ్చిన ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటుపడి.. అడ్డదారిలో అనతికాలంలో సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో యువకులు పక్కదారి పడుతున్నారు. ఆన్‌లైన్‌ గేమ్‌లో డబ్బులు పెట్టి ఆడిన వారు నిండా మునిగిపోతున్నారు. ఆన్‌లైన్‌ గేమ్‌ నిర్వాహకులకు ఆదాయం మాత్రం మూడు పువ్వులు..ఆరు కాయలుగా వస్తోంది. పోయిన డబ్బు మళ్లీ గెలువవచ్చన్న దురాశతో మళ్ళీ..మళ్లీ ఆడి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడిన వారు మునుగుతున్నారే తప్పా లాభపడిన దాఖలాలు లేవు. ఆన్‌లైన్‌ గేమ్‌కు అలవాటుపడిన వారు పనీపాట వదిలేసి పొద్దు..మాపు అదే ధ్యాసలో ఉం టూ అప్పులపాలై మనోధైర్యం కోల్పోతూ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. వారిపై ఆధారపడిన కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు.

మచ్చుకు కొన్ని సంఘటనలు..

ఠ రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూ డెం గ్రామానికి చెందిన బైరగోని నజీర్‌ బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతూ ఆన్‌లైన్‌ గేమ్‌కు అలవాటు పడి అప్పులు చేసి.. అవి తీర్చే మార్గం కనిపించకపోవడంతో 8 జనవరి 2023న ఇంట్లో ఉరేసుకొని చనిపోయాడు.

ఠ రఘునాథపల్లి మండల కేంద్రానికి చెం దిన సిరికొండ మురళి ఆన్‌లైన్‌ గేమ్‌కు అలవాటు పడి రూ.30 లక్షల వరకు అప్పులు చేసి తీర్చలేక అయిదు నెలల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని భార్య, పిల్లలను ఆగం చేశాడు.

ఠ అదేకోవలో రఘునాథపల్లికి చెందిన ద్యావర రాజు అనే రైల్వే ఉద్యోగి ఆన్‌లైన్‌ గేమ్‌లో రూ.20 లక్షల వరకు పోగొట్టుకొని అప్పులపాలై తాను పని చేస్తున్న స్టేషన్‌ పరిధిలోనే 15 జూలై 2024న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య పిల్లలకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చాడు.

ఠ మండల కేంద్రానికి చెందిన ఒక రైతు కుమారుడు హైదరాబాద్‌లో ఉంటూ ఆన్‌లైన్‌ గేమ్‌కు అలవాటు పడి రూ.40 లక్షల వరకు అప్పు చేయగా, సదరు రైతు తనకున్న వ్యవసాయ భూమిని అమ్మి అప్పులు తీర్చాడు.

ఠ మండల కేంద్రానికి చెందిన పాన్‌ బ్రోకర్‌ షాపు యాజమాని కుమారుడు ఆన్‌లైన్‌ గేమ్‌కు బానిసై రూ.1.40 కోట్ల అప్పు చేసి పారిపోవడంతో తండ్రి విలవిలలాడుతు న్నాడు. ఇవి కేవలం బయటపడిన సంఘటనలు మాత్రమే. బయటకు రానివి ఇలాంటివి మరెన్నో ఉన్నాయి.

దగా చేస్తున్న ఆన్‌లైన్‌ ముఠా..

కొందరు ముఠాగా ఏర్పడి ఆన్‌లైన్‌ సైట్‌లో రమ్మీ, తిన్‌ పత్తా, అందర్‌ బాహర్‌ ఆటలతో పాటు క్రికెట్‌ తదితర బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నారు. రమ్మీలో పాయింట్స్‌ రమ్మీ, పూల్‌ రమ్మీ, డీల్స్‌ రమ్మీ అని మూడు రకాల ఆటలుంటాయి. ఆన్‌లైన్‌ సైట్‌లో జూదం ఆడాలంటే... ముందు ఫేక్‌ ఐడి క్రియేట్‌ చేసుకుంటారు. దీంతో వారు ఎక్కడి నుంచి ఆడుతున్న విషయం ఎవరికీ తెలియదు. తర్వాత ఆన్‌లైన్‌ రమ్మీ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకుంటారు. ఫోన్‌-పే..లేక గుగూల్‌-పేలో డబ్బులు ఉంటే చాలు.. ఎంచక్కా..ఆన్‌లైన్‌లో మూడు రకాల రమ్మీ, తిన్‌ పత్తా, అందర్‌ బాహర్‌ ఆడడంతో పాటు క్రికెట్‌ బెట్టింగ్‌లు కాస్తారు. ఆన్‌లైన్‌ జూదంలో ఎంత ఆడదల్చుకుంటే అంత డబ్బు ఐడి నెంబర్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. ఆన్‌లైన్‌ జూదం రమ్మీ ఆటలో ఒకసారి అంటే గంటలోపు రూ.10 వేల నుంచి రూ.90 వేల వరకు పెట్టి ఆడతారు. ఉదాహరణకు రమ్మీ ఆటలో ఏడుగురు వ్యక్తులు రూ.10 వేల చొప్పున పెట్టి ఆడితే రూ.70 వేల గేమ్‌ అవుతుంది. ఒక ఆట గంటలోపై అయిపోతుంది.. గెలిస్తే రూ.70 వేలు వస్తాయి.. లేదంటే రూ.10 వేలు పోతాయి. అలాగే తిన్‌ పత్తా ఆటలో అయితే బ్లైండ్‌లో రూ.100, సీన్‌లో అయితే డబుల్‌ అంటే రూ.200 చొప్పున పది సార్లు వేస్తే పది నిమిషాలలో రూ.2 వేలు పోతాయి. ఒక వేళ గెలిస్తే వచ్చే డబ్బులలో నిర్వాహకులు 3 నుంచి 5 శాతం కమీషన్‌ తీసుకొని మిగిలిన మొత్తం ఇస్తారు. ఆన్‌లైన్‌ గేమ్‌ ప్రతీ రోజు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఒక్కోసారి ఒక్క రోజులోనే రూ.90 వేల నుంచి రూ.2 లక్షల వరకు పొగొట్టుకున్న వారు ఉన్నారు. ఇంట్లో వారికి తెలియకుండానే అప్పులు చేసి ఆన్‌లైన్‌ గేమ్‌లో ఏదో ఒక రోజు అదృష్టం కలిసి రాకపోతుందా అనే ఆశతో ఆడి.. చివరకు అప్పులే మిగలడంతో అటు అప్పులు తీర్చలేక.. ఇటు కుటుంబసబ్యులకు చెప్పలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌ గేమ్‌ పట్ల ముఖ్యంగా యువత ఆకర్షితులవుతున్నారు. ఆన్‌లైన్‌ గేమ్‌లో పెట్టుబడులు పెట్టిన వారు నిండా మునుగుతున్నారే తప్ప లాభపడిన వారు ఎవరూ లేరని ఈ ఆట ఆడిన వారే ఒప్పుకుంటున్నారు. ఆన్‌లైన్‌ గేమ్‌ల వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రతీ ఒక్కరికి తెలిసేటట్లు చేయడానికి అధికారులు, పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు..

ఎలబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌, సీఐ-రఘునాథపల్లి

యువత ఆన్‌లైన్‌ గేమ్‌లు, సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలో ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. సోషల్‌ మీడియాలో వ్యక్తిగత వీడియోలను ఆప్‌లోడ్‌ చేయవద్దు. లోన్‌ యాప్‌లను డౌన్‌ లోడ్‌ చేసుకుంటే మన వ్యక్తిగత సమచారం వారికి తెలిసి పోయే ప్రమాదముంది. తర్వాత మనల్ని వారు బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశముంటుంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌లో అపరిచిత వ్యక్తులు ఫ్రైండ్‌ రెక్వెస్ట్‌ పెడితే యాక్సెప్ట్‌ చేయొద్దు. సైబర్‌ నేరాలకు గురయితే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయాలి.

Updated Date - Jul 23 , 2024 | 11:39 PM

Advertising
Advertising
<