ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐటీఐలకు మహర్దశ

ABN, Publish Date - Jun 23 , 2024 | 11:45 PM

అరకొర వసతులతో కూనారిల్లుతున్న ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ఐటీఐ)లు త్వరలో కొత్తరూపును సంతరించుకోబోతున్నాయి. కాలం చెల్లించిన సంప్రదా య కోర్సులతోనే ఇప్పటికీ నెట్టుకువస్తున్న ఈ ఐటీఐల లో ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఆధునాతన సాంకేతిక కోర్సులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

ములుగురోడ్డులోని వరంగల్‌ ఐటీఐ

ఉమ్మడి జిల్లాలో ఏటీసీలుగా మూడు ఐటీఐలు

టీటీఎల్‌తో ఒప్పంద ఫలితం

ఒక్కొకదానిపై రూ.50 కోట్ల వ్యయం

కొత్తగా ఆరు సరికొత్త కోర్సులు

ఆధునిక హంగులతో కొత్త భవనాల నిర్మాణం

అడ్డంకిగా మారుతున్న స్థలాల కొరత

హనుమకొండ, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి) : అరకొర వసతులతో కూనారిల్లుతున్న ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ఐటీఐ)లు త్వరలో కొత్తరూపును సంతరించుకోబోతున్నాయి. కాలం చెల్లించిన సంప్రదా య కోర్సులతోనే ఇప్పటికీ నెట్టుకువస్తున్న ఈ ఐటీఐల లో ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఆధునాతన సాంకేతిక కోర్సులు త్వరలో ప్రారంభం కానున్నాయి. అన్ని హంగులతో కూడిన ప్రత్యేక భవనాల నిర్మాణం జరుగబోతున్నది. దీనితో ఐటీఐలంటే విద్యార్ధులు, వారి తల్లితండ్రులు చిన్నచూపు చేసే పరిస్థితి మారనున్నది. ఐటీలను ఆధునాతన సాంకేతిక శిక్షణా సంస్థలుగా (ఏటీసీ) మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఐటీఐలను ఏటీసీలుగా మార్చేం దుకు టాటా టెక్నాలజీ లిమిటెడ్‌తో (టీటీఎల్‌) ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంతో వాటి దశ, దిశ మారనున్నది.

ఉమ్మడి జిల్లాలో మూడు...

రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలను ఏసీటీలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మొదటి విడతగా 20 ఐటీలను ఏటీసీలుగా మార్చు తారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్‌లోని మూడు ఐటీఐలు ఏసీటీసీలుగా మారనున్నాయి. వరంగల్‌. ఏటూరునాగారం, భూపాలపల్లిలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (బాలురు)లు వీటిలో ఉన్నాయి. వీటితో పాటు కాజీపేటలోని మరో ప్రభుత్వ ఐటీఐ కూడా ఏటీసీగా మారనున్నది. ఈ ఒక్కొక్క దానిపై రూ.50కోట్ల వరకు ఖర్చు చేస్తారు. టాటా టెక్నాలజీ లిమిటెడ్‌ (టీటీఎల్‌) సహకారంతో రూ.2324 కోట్ల వ్యయంతో వీటిని అప్‌ గ్రేడ్‌ చేస్తారు. ఐటీఐ సర్కిల్‌ డెవలప్‌మెంట్‌ అప్‌గ్రేడెషన్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ ఐటీఐలలో ఆదునిక పరిశ్రమల అవసరాలకు ఆనుగుణంగా యువతకు శిక్షణ ఇస్తారు. ఇందులో కోసం ఆధునాతన సామగ్రిని, సాంకేతికతను ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక నిపుణులతో ఇందులో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.

ఏటీసీల్లో ఆరు కొత్త కోర్సులు

ఆధునాతన సాంకేతికత పరిజ్ఞానం పెరిగింది. పారి శ్రామిక రంగంలో అనేక మార్పులు వచ్చాయి. నూత న సాంకేతిక ప్రక్రియలతో అవి నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఐటీఐలో నేర్చుకున్న కోర్సులు బయట ప్రపంచంలో ఉద్యోగావకాశాలను కల్పించడం లేదు. మారుతున్న సాంకేతికతకు ఆనుగుణంగా సరి కొత్త కోర్సులను అభ్యసించినప్పుడే భవిష్యత్తు ఉంటుం ది. టాటా వంటి కంపెనీలకు అవసర మైన సిబ్బంది దొరకకపోవడానికి కారణం పాత ట్రేడ్‌లనే విద్యార్థులు నేర్చుకోవడం. ఈ కొరతను తీర్చడానికి టీటీఎల్‌ విద్యార్థులు పోటీ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకొని ఉపాధి అవకాశాలు పొందగలి గేలా వారిలో వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంగా భాగంగా ఐటీఐ సర్కిల్‌ డెవప్‌మెంట్‌ అప్‌గ్రేడేషన్‌ ప్రాజెక్టులో భాగస్వామి అయింది. ఇందులో భాగంగా టీటీఎల్‌ ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా. ముఖ్యంగా తమ కంపెనీ కి సరిపడే వృత్తినిపుణులను తయారు చేయడానికి ఆరు ఆధునాతన ట్రేడ్‌లను ఈ ఏసీటీల్లో ప్రవేశపెట్టనున్నది. ఇండస్ట్రియల్‌ రోబోటిక్స్‌, అండ్‌ డిజిటల్‌ మాన్యుఫా క్చరింగ్‌, మాన్యుఫ్యాక్టరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ అండ్‌ ఆటో మిషన్‌, మెకానిక్‌ ఎలక్ర్టికల్‌ వెహికిల్స్‌, ఆర్టీషియిన్‌ యూజింగ్‌ అడ్వాన్సుడ్‌ టూల్‌, బేసిక్‌ డిజైనర్‌ అండ్‌వర్చువల్‌ వెరిఫైర్‌ (మెకానిక్‌) వీటిలో ఉన్నాయి. ఇండస్ట్రియల్‌ రొబొటి క్స్‌ అండ్‌ డిజిటల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, మాన్యు ఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ అండ్‌ ఆటోమిషన్‌లో ఒక్కొక దానిలో 40 సీట్లు, మిగతా కోర్సుల్లో 48 సీట్ల చొప్పున ఉంటా యి. దీనితో ఏటీసీలుగా మారే ఈ మూడు ఐటీఐలలో ఒక్కొకదానిలో సుమారు 250 సీట్లు విద్యార్ధులకు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఏటీసీల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

ప్రత్యేక భవనాలు

ఏటీసీల ఏర్పాటుకు అన్ని హంగులతో కూడిన ప్రత్యేక భవనాలను ఒకొక్కదానిని రూ.5కోట్లతో నిర్మిస్తారు. టీటీఎల్‌ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఈ ఏటీసీ భవనాలు 180గీ75 అడుగుల వైశాల్యంతో ఉంటాయి. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉన్న ఆరు ప్రభుత్వ ఐటీఐలలో ఒక్క ములుగు రోడ్డులోని ఐటీఐలో తప్ప మిగతా వాటిలో అంత స్థలం అందుబాటులో లేదు. రాష్ట్రంలోని మిగతా ఐటీఐల పరిస్థితి కూడా ఇదే. దీనితో వేరే చోట స్థలం సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. దీనితో ఇప్పటికే మొదలు కావలసిన ఏటీసీ భవనాల పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి. ములుగు రోడ్డులోని ఐటీఐలో చాలినం త స్థలం అందుబాటులో ఉన్నందువల్ల ఈ క్యాంపస్‌ లో రెండు ఐటీసీల భవనాలు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. కాజీపేట ఐటీఐలో చాలినంత స్థలం లేదు. దీని వెనుక కొంత దూరంలో ఉన్న ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో ఉన్న కొంత స్థలాన్ని దీనికి కేటాయించారు.

ఏటీసీల ఏర్పాటుపై స్పష్టత రావాల్సి ఉంది..

- పి.వెంకటేశ్వర్‌రావు, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌, ఐటీఐ ఏటూరునాగారం

అడ్వాన్సుడు ట్రేనింగ్‌ సెంటర్‌ (ఏటీసీ) అనేది పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో ఒక భాగం. ఇందులో కొత్తగా టాటా టెక్నాలజీ లిమిటెడ్‌ వారు ఆరు ట్రేడులు ప్రవేశపెడుతున్నారు. ఇందు కోసం ఐటీఐ మొత్తాన్ని ఏటీసీ అంటారాా లేదా అనే విషయం ఇంకా స్పష్టత రావలసి ఉంది. ప్రస్తుత ఐటీఐలో కొన్ని ట్రేడులు నడుస్తున్నాయి. అడ్వాన్సుడు ట్రేడులు అనేవి టీటీఎల్‌ ప్రవేశపెట్టనున్న ఆ ఆరు ట్రేడులే కానీ ప్రస్తుతం ఉన్న ట్రేడులతో కలుపుకొని ఐటీఐ మొత్తం కాదుకదా? ప్రభుత్వం నుంచి అందే మార్గదర్శకాలను బట్టి ఐటీఐల కొత్త రూపు, నిర్వహణ ఉంటాయి. ఉమ్మడి జిల్లాలు ఆరు ప్రభుత్వ ఐటీఐల లో ఏటీసీల ఏర్పాటుకు సంబంధించి అయిదింటికి ల్యాండ్‌ క్లియరెన్స్‌ రావలసి ఉంది. కాజీపేట ఐటీఐకి సంబంధించి అక్కడికి దగ్గరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని కొంత స్థల కేటాయింపు జరిగింది.

ఆరు ఐటీఐలు..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం ఆరు ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి. వరంగల్‌, హనుమకొండ, కాజీపేట, భూపాలపల్లి, ఏటూరునాగారం, మహబూబాబాద్‌లలో ఇవి ఉన్నాయి. ప్రైవేటు ఐటీఐలు మరో 15 వరకు నడుస్తున్నాయి. మూడు మహబూబాబాద్‌లో ఉండగా, మిగతావన్ని వరంగల్‌లోనే నడుస్తున్నాయి. ఐటీఐల పట్ల విద్యార్థులు అంతగా ఆసక్తి చూపకపోవడంతో ప్రైవేటు ఐటీల సంఖ్య క్రమంగా తగ్గింది. గతంలో ఉమ్మడి వరంగల్‌లో 30వరకు ఉండేవి. ప్రవేశాలు లేకపోవడంతో కొన్ని మూతపడ్డాయి. ప్రభుత్వ ఐటీఐలు ఆరకొరత వసతులతో నడుస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఐటీఐలలో 40 ఏళ్లుగా పది వరకు సంప్రదాయ కోర్సుల్లోనే శిక్షణ ఇస్తున్నారు. ఎలక్ర్టిషియన్‌, ఫిట్టర్‌, ప్లంబర్‌, వెల్డర్‌, మోటార్‌ మెకానిక్‌, డీజిల్‌ మెకానిక్‌, టర్నర్‌, డ్రాట్స్‌మెన్‌ సివిల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ తదితర కోర్సులు వీటిలో ఉన్నాయి. ఇవన్నీ పాలకాలపు ట్రేడులు.

Updated Date - Jun 23 , 2024 | 11:45 PM

Advertising
Advertising