ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

K-Hub: కాకతీయ వర్సిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రులు

ABN, Publish Date - Mar 10 , 2024 | 07:43 AM

వరంగల్: తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖలు ఆదివారం వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీకి వెళ్లనున్నారు. వర్సిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులను పరిశోధనల వైపు నడిపించేందుకు అడుగులు పడుతున్నాయి.

వరంగల్ (Warangal): తెలంగాణ మంత్రులు (Telangana Ministers) పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), సీతక్క (Sitakka), కొండా సురేఖ (Konda Surekha)లు ఆదివారం వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University)కి వెళ్లనున్నారు. వర్సిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులను పరిశోధనల వైపు నడిపించేందుకు అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.50 కోట్లతో వర్శిటీకి కె–హబ్(K-Hub) మంజూరు చేయగా.. ఆ పనులు పూర్తయ్యాయి. దీంతో ఇవాళ రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ప్రారంభించనున్నారు. మంత్రులు ఈరోజు ప్రారంభించనున్న నేపథ్యంలో పరిశోధక విద్యార్థులతో పాటు వర్సిటీ అధికారులు, అధ్యాపకుల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. కాగా ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

విద్యార్థులకు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో కే-హబ్‌ ఏర్పాటయింది. ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు మూడు అంతస్థుల్లో భవనాన్ని నిర్మించారు. రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌(రూసా) కింద రూ. 50 కోట్లు హబ్‌కు నిధులు మంజూరు చేశారు. విద్యార్థుల్లో స్కిల్స్​ పెంచడంతో పాటు ఇన్నోవేషన్స్, రీసెర్చ్​ వైపు వారిని ఎంకరేజ్​ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కే హబ్ శాంక్షన్​ చేసింది. స్టార్టప్​ కంపెనీలకు ప్లాట్​ఫామ్‌గా నిలువడంతో పాటు రీసెర్చ్​ ల్యాబ్‌ల ఏర్పాటుకు ఈ ఇంక్యుబేషన్​ సెంటర్ ఉపయోగపడుతుంది.

Updated Date - Mar 10 , 2024 | 08:57 AM

Advertising
Advertising