ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ములుగు మెరిసేలా..

ABN, Publish Date - Jul 31 , 2024 | 12:20 AM

ములుగు.. అభివృద్ధి దిశగా పయనిస్తోంది. అంచెలంచెలుగా పురోగమనం చెందు తోంది. గ్రామ స్థాయి నుంచి పట్టణంగా పురోగతి సాధిస్తోంది. ఐదేళ్ల క్రితం జిల్లా కేంద్రంగా ఏర్పడిన ములుగు తాజాగా మునిసిపాలిటీగా గుర్తింపు పొం దింది. రాష్ట్ర మంత్రి సీతక్క చొరవతో దీని సుంద రీకరణకు యంత్రాంగం ముందడుగు వేసింది. ఇందు లో భాగంగా హెచ్‌ఎండీఏ అధికారుల పర్యవేక్షణలో యాక్షన్‌ప్లాన్‌ సద్ధమవుతోంది.

ములుగులోని ఏరియా ఆస్పత్రి కూడలి

పట్టణ సుందరీకరణకు ప్రణాళిక

మంత్రి సీతక్క సూచనతో కదిలిన యంత్రాంగం

హెచ్‌ఎండీఏ అధికారుల పర్యవేక్షణలో యాక్షన్‌ ప్లాన్‌

గట్టమ్మ నుంచి జంగాలపల్లి దాకా..

కూడళ్లు, ప్రధాన రోడ్ల అభివృద్ధి

పచ్చదనం ఉట్టిపడేలా చర్యలు

ములుగు, జూలై 30: ములుగు.. అభివృద్ధి దిశగా పయనిస్తోంది. అంచెలంచెలుగా పురోగమనం చెందు తోంది. గ్రామ స్థాయి నుంచి పట్టణంగా పురోగతి సాధిస్తోంది. ఐదేళ్ల క్రితం జిల్లా కేంద్రంగా ఏర్పడిన ములుగు తాజాగా మునిసిపాలిటీగా గుర్తింపు పొం దింది. రాష్ట్ర మంత్రి సీతక్క చొరవతో దీని సుంద రీకరణకు యంత్రాంగం ముందడుగు వేసింది. ఇందు లో భాగంగా హెచ్‌ఎండీఏ అధికారుల పర్యవేక్షణలో యాక్షన్‌ప్లాన్‌ సద్ధమవుతోంది. మెట్రో సిటీలకు తగ్గకుండా పచ్చదనం, లైటింగ్‌తో అందంగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తున్నారు.

గట్టమ్మ, జంగాలపల్లి వద్ద తోరణాలు

ములుగు పట్టణ కీర్తి కిరీటంగా భావించే గట్టమ్మ తల్లి దేవాలయం నుంచి జంగాలపల్లి క్రాస్‌రోడ్డు వర కు 163 జాతీయ రహదారిని అభివృద్ధి చేయనున్నారు. ఏడు కిలోమీటర్ల పొడవునా డివైడర్‌ మధ్యలో చెట్లు, పూల మొక్కలను పెంచనున్నారు. గట్టమ్మ ఆలయం వద్ద స్వాగత తోరణం, జంగాలపల్లి క్రాస్‌రోడ్డులోని కూడలిలో రామప్ప దేవాలయాన్ని ప్రతిబింబిస్తూ పూల మొక్కలతో అలంకరణ చేయనున్నారు. గట్టమ్మ పరిసరాల్లో గతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మినీ పార్కును ఏర్పాటు చేయగా మహాజాతర సమయం లో చేపట్టిన అభివృదిఽ్ధ పనులతో దానిని తొలగించారు. ఇప్పుడు మళ్లీ స్మృతివనం ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు.

కూడళ్లలో పచ్చదనం

ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, మసీదు, ఆర్టీసీ బస్టాండు, పీఆర్‌ కార్యాలయ కూడళ్లను అభివృద్ధి జాబితాలో చేర్చారు. పచ్చిక గడ్డి, పూలమొక్కలు, మహనీయుల విగ్రహాలు, ‘ఐ లవ్‌ ములుగు’ అని రాసి ఉన్న థీమ్‌లతో అలంకరించనున్నారు. ఇప్పటికే పీఆర్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు రోడ్డు పక్కన ఎండిన భారీ వృక్షాలను తొలగించే ప్రక్రియ పూర్తయ్యింది.

హెచ్‌ఎండీఏ అధికారుల ఫీల్డ్‌ విజిట్‌

ములుగు సుందరీకరణ బాధ్యతను రాష్ట్ర పంచా యతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కి అప్పగించారు. హెచ్‌ఎండీఏ కమి షనర్‌గా ఉన్న సర్ఫరాజ్‌ అహ్మద్‌ గతంలో ములుగు సబ్‌ కలెక్టర్‌గా పనిచేశారు. ఈపరిణామం జిల్లా కేం ద్రం అభివృద్ధికి అనుకూలాంశంగా మారింది. ఆలేరు నుంచి ఘట్కేసర్‌ వరకు ఉన్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవే బ్యూటి ఫికేషన్‌ను పర్యవేక్షిస్తున్న అధికారులు ఇటీవల ములు గుకు వచ్చారు. సుందరీకరణకు ఎంపిక చేసిన ప్రదేశాలను పరిశీలించారు.

సెంట్రల్‌ లైటింగ్‌.. డివైడర్లు

ములుగులోని ప్రధాన రోడ్లను అభివృద్ధి జాబితా లో చేర్చారు. డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నుంచి జీవంతరా వుపల్లి క్రాస్‌రోడ్డు వరకు దారిని విస్తరించి సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత రానున్న రోజుల్లో ములు గు, బండారుపల్లి నర్సాపూర్‌ మీదుగా రామప్పకు వెళ్లేందుకు ఈ రూట్‌ను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేశారు. ఈనేపథ్యంలో ఈ దారిని సుందీకరిస్తే వచ్చిపోయే పర్యాటకులను ఆకట్టుకునే వీలుంది. ఇదే క్రమంలో పత్తిపల్లి రోడ్డు, శివాలయం వీధి, మసీదు నుంచి గొల్లవాడ వరకు రోడ్లను అభివృద్ధి చేస్తారు. రోడ్డు, డ్రెయినేజీ విస్తరణకు ఉన్న అడ్డంకులను అధి గమించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ములుగు శివారులోని తోపుకుంటను గత బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వంలో మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలనే ప్రయత్నం అమలు కాలేదు. కట్ట విస్తరణ, బతుకమ్మ ఘాట్‌ల నిర్మాణంతోనే సరిపుచ్చారు. ములుగు సుందరీకరణ ప్రాజెక్టులో తోపుకుంటను కూడా చేర్చి పార్కు, థీమ్‌లతో అభివృద్ధి చేయడంతో పాటు కుంటలో బోటింగ్‌ సౌకర్యం కల్పిస్తే పట్టణ ప్రజలకు, పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా మార నుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ములుగును అందంగా తీర్చిదిద్దుతాం : సీతక్క, రాష్ట్రమంత్రి

ములుగును సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోంది. చారిత్రక, భౌగోలిక ప్రత్యేకతలు కలిగిన జిల్లాకు కేంద్రంగా ఉన్న ములుగును నగరాలకు తీసిపోకుండా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. అవసరమైనన్ని నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయిస్తాం.

Updated Date - Jul 31 , 2024 | 12:21 AM

Advertising
Advertising
<