ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘ఉపాధి’కి ఊతమేదీ?

ABN, Publish Date - Apr 03 , 2024 | 10:56 PM

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలకు రానురాను ప్రోత్సాహం కరువవుతోం ది. గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పించి వలసలు నిరోఽధించాలనే లక్ష్యంతో మహాత్మాగాంధీ గ్రామీణ జాతీ య ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి వంద రోజుల పాటు పని కల్పించాలి. కానీ అది అమలు కావడం లేదు. అధి క ఉష్ణోగ్రతల్లో పని చేస్తున్నందుకు కూలీలకు ఏటా వేసవి భత్యంతో పాటు ఇతర వసతులు కల్పించేవారు. కానీ రెండేళ్లుగా అది కూడా మరిచిపోయారు.

జఫర్‌గడ్‌ మండలం తమ్మడపల్లి(జి)లో ఎండలోనే పని చేస్తున్న ఉపాధి కూలీలు

కూలీలకు ప్రోత్సాహం కరువు

పని ప్రదేశాల్లో కనిపించని సౌకర్యాలు

ఎండలోనే పనులు.. సకాలంలో అందని కూలి డబ్బులు

రెండేళ్లుగా నిలిచిన వేసవి భత్యం

వంద రోజుల పని కొందరికేనా..

కూలి రేటు రూ.28పెంపుపై పెదవి విరుపు

నిబంధనలు అమలు చేయాలంటున్న కూలీలు

జఫర్‌గడ్‌, ఏప్రిల్‌ 3: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలకు రానురాను ప్రోత్సాహం కరువవుతోం ది. గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పించి వలసలు నిరోఽధించాలనే లక్ష్యంతో మహాత్మాగాంధీ గ్రామీణ జాతీ య ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి వంద రోజుల పాటు పని కల్పించాలి. కానీ అది అమలు కావడం లేదు. అధి క ఉష్ణోగ్రతల్లో పని చేస్తున్నందుకు కూలీలకు ఏటా వేసవి భత్యంతో పాటు ఇతర వసతులు కల్పించేవారు. కానీ రెండేళ్లుగా అది కూడా మరిచిపోయారు. పని ప్రదేశాల్లో కూలీలకు టెంట్లు, తాగునీరు, పరికరాలు, ఇతర వైద్య సదుపాయాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కూలీలతో పాటు సిబ్బందికి వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పాటై ఐదేళ్ల పదవీ కాలం ముగిసినా.. నేటికీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల నియామ కాలు చేపట్టకపోవడంతో పనులకు వచ్చే కూలీల సం ఖ్య పెరగడంలేదని చెబుతున్నారు.

కూలీలకు సదుపాయాలు కరువు..

ఉపాధి కూలీలకు కనీస సదుపాయాలు కల్పించడం లేదు. 2007లో కూలీలకు గడ్డపారలు అందించారు. 2001లో గ్రామ పంచాయతీకో టెంటు ఇచ్చారు. 2014లో గ్రూపుకో మెడికల్‌ కిట్‌ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి పరికరాలు.. సదుపాయాలూ లేవు. వీటికి బదులు కూలీ సొంతంగా గడ్డపార సమ కూర్చుకుంటే రోజుకు రూ.10లు వేతనంలో కలిపేవా రు. తాగునీటికి మరో రూ.5లు అందించేవారు. అయితే కూలీల వేతనాలు రెండేళ్ల క్రితం నుంచి రాష్ట్రంలో కేంద్ర సర్వర్‌కు అనుసంధానం చేయడంతో అసలు సమస్య మొదలైంది. అప్పటి నుంచి కూలీలకు సదుపాయాలు కల్పించలేకపోగా, వాటికి బదులు ఇచ్చే డబ్బులు కూడా అందించని పరిస్థితి. కొన్ని చోట్ల నేల గట్టిగా ఉండి మట్టి తవ్వడం కష్టమవుతోంది. దీంతో కూలి గిట్టుబాటు కావడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడ్డపారలు, పారలు వంటి పరికరాలను కూలీలే వెంట తెచ్చుకుంటున్నారు. గడ్డపారలకు మొన చేయించాలంటే వారానికి రూ.200ల వరకు ఖర్చు అవుతోందని, తామే భరించాల్సి వస్తోందని వాపోతున్నారు.

నిలిచిన వేసవి భత్యం...

ఉపాధి హామీ పథకం రాష్ర్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండగా కూలి ఎక్కువగా వచ్చేది. దీనికి తోడు కూలీలు చేసిన పనుల్లో 25 నుంచి 30 శాతం వరకు 5 నెలల పాటు వేసవి భత్యం కేంద్రం చెల్లించేది. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25, ఏప్రిల్‌, మే నెలల్లో 30 శాతం, జూన్‌లో 20 శాతం అదనంగా ఇచ్చేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సాఫ్ట్‌వేర్‌లో వేసవి భత్యానికి సంబంధించిన ఆప్షన్‌ తొలగించారు. నేషనల్‌ ఇన్ఫర్‌మేషన్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) సర్వర్‌కు మారడంతో రెండేళ్లుగా వేసవి భత్యం నిలిపి వేశారు.

కూలి రేటు పెంపుపై పెదవి విరుపు...

చేసిన పనికి కొలతల ప్రకారం వేతనం చెల్లిస్తూండడంతో ఒక్కో కూలీకి రోజుకు రూ.150 నుంచి రూ.180ల వరకు మాత్రమే అందుతోంది. తాజాగా దినసరి కూలీ రేటును రూ.272ల నుంచి రూ.300లకు పెంచారు. రూ.28లు కూలీ రేటును పెంచినంత మాత్రాన తమకు ఒనగూరేదేమీ ఉండదని కూలీలు పెదవి విరుస్తున్నారు. అదే వ్యవసాయ, వ్యవసాయేతర పనులకు వెళితే రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు చెల్లిస్తున్నారు. ఈ కారణంగా ఉపాఽధి పనులకు కూలీలు ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2,789 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని..

జిల్లాలోని 281 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 1.18 లక్షల జాబ్‌ కార్డులు ఉండగా, 2.34 లక్షల కూలీలు నమోదై ఉన్నారు. అయితే ఇందులో 83 వేల జాబ్‌ కార్డులు కలిగిన, 1.40 లక్షల మంది కూలీలు మాత్రమే ఉపాధి పనుల్లో భాగస్వాములవుతున్నారు. 2023-24 ఆర్థిక సంవ్సతరం మార్చి వరకు జిల్లాలో 2,789 మంది కుటుంబాలు మాత్రమే వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 10:56 PM

Advertising
Advertising