ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అడిగే వారు లేక..

ABN, Publish Date - Jul 13 , 2024 | 11:55 PM

సింగరేణి అనగానే కొందరికీ అదో కల్పతరువుగా మారిపోయిం ది. యాజమాన్యం నిర్లక్ష్యం, సిబ్బంది ఉదాసీనతతో ఏటా సంస్థకు కోట్లాది రూపాయల మేర గండి పడుతోంది. సింగరేణి సిబ్బంది, కార్మికుల కోసం యాజమాన్యం నిర్మించిన నివాస గృహాలు సింగరే ణేతరుల పాలవుతున్నాయి. సంవత్సరాల కొద్దీ తిష్టవేసి సంస్థకు అద్దె చెల్లించకపోగా దత్తపుత్రుల తరహా అన్ని సౌకర్యాలూ అనుభవిస్తునారు.

సింగరేణి క్వార్టర్స్‌

పేరుకుపోయిన సింగరేణి క్వార్టర్స్‌ అద్దె బకాయిలు

వసూలు కావాల్సినవి రూ.2కోట్లకు పైనే..

కేటాయింపులు ఒకరికి.. ఉండేది మరొకరు

ప్రభుత్వ ఉద్యోగులదే సింహభాగం

నోటీసులిచ్చినా స్పందించని వైనం

ప్రైవేటు సంస్థలదీ అదే వైఖరి

అడ్వాన్సులు లేవు.. కిరాయిలూ లేవు

విచ్చలవిడిగా విద్యుత్‌ వినియోగం

భూపాలపల్లి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): సింగరేణి అనగానే కొందరికీ అదో కల్పతరువుగా మారిపోయిం ది. యాజమాన్యం నిర్లక్ష్యం, సిబ్బంది ఉదాసీనతతో ఏటా సంస్థకు కోట్లాది రూపాయల మేర గండి పడుతోంది. సింగరేణి సిబ్బంది, కార్మికుల కోసం యాజమాన్యం నిర్మించిన నివాస గృహాలు సింగరే ణేతరుల పాలవుతున్నాయి. సంవత్సరాల కొద్దీ తిష్టవేసి సంస్థకు అద్దె చెల్లించకపోగా దత్తపుత్రుల తరహా అన్ని సౌకర్యాలూ అనుభవిస్తునారు. ఆఖరికి కరెంటు బిల్లులు చెల్లించకుండా వందల యూనిట్లు వాడుకుంటూ సంస్థకు ఎంచక్కా శఠగోపం పెడుతు న్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త జిల్లాల సిబ్బందికి, ఉన్నతాధితారులకు, కార్యాలయాలకు సింగరేణి భవనాలు, రెసిడెన్షియల్‌ క్వార్టర్లను కేటాయించారు. ఈ క్రమంలో వందలాది మంది ఉద్యోగులతోపాటు కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా తమ పలుకుబడిని ఉపయోగించి సింగరేణి యాజ మాన్యంతో ఈ క్వార్టర్లను ఆక్రమించుకున్నాయి. కానీ అందులో చేరిన నాటి నుంచి నేటి వరకు నిబంధన ల ప్రకారం సింగరేణికి అద్దె, నీటి బకాయిలు చెల్లిం చకుండా మొహం చాటేస్తున్నారు.

నిబంధనలను అనుసరించి క్వార్టర్లకు అద్దె ఖరారు చేశారు. ఇందులో ఎండీ టైప్‌ క్వార్టర్లకు నెల ఒక్కం టికి రూ.5,290, ఎంసీ టైపు క్వార్టర్లకు రూ.5,040, చెమ్రీ(సీహెచ్‌) టైపు క్వార్టర్లకు రూ.4,024 చొప్పున నిర్ణయించారు. దీంతోపాటు ఒప్పందం సమయంలోనే ఒక్కో క్వార్టర్‌కు నాలుగు నెలల అద్దెను అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంది. కానీ, ఇక్కడ అలాంటి దాఖలాలు కనిపించడం లేదు. ఇదంతా ఒకెత్తయితే.. బకాయిలకు సంబంధించి మే చివరి నాటికి రూ.4 కోట్ల పైచిలుకు పేరుకుపోయాయి. బకాయిలు చెల్లించాలంటూ సింగరేణి ఎస్టేట్‌ విభాగం సదరు అధికారులకు, సంస్థలకు నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. సంస్థ ఆస్తులు, అప్పుల మదింపు సందర్భంగా భారీ ఎత్తున పేరుకుపోయిన బకాయిలపై కాగ్‌ మొట్టికా యలేసింది. అయినా చలించని సింగరేణి అధికారులు అద్దె వసూళ్లలో నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నా రనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. రెండేళ్ల క్రితం సింగరేణి భవనాలను, క్వార్టర్లను వినియోగిం చుకున్న అధికారుల్లో 90 శాతం మంది దర్జాగా సౌకర్యాలను వాడుకొని బకాయిలు చెల్లించకుండా బదిలీపై వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆ బకాయిలను ఎలా వసూలు చేయాలనేది సింగరేణి అధికారులకు తలబొప్పి కట్టిస్తోంది. క్వార్టర్లను వినియోగించుకున్న అధికారులు, ఉద్యోగులందరికీ ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏ రూపంలో అదనపు మొత్తాన్ని చెల్లిస్తున్నా అద్దెలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. బకాయిలు చెల్లించాలని మొక్కుబడిగా నోటీసులు ఇ్వడమే తప్ప గట్టిగా ప్రయత్నించక పోవడంతో ఈ పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా సింగరేణికి పడిన బాకాయిలను పరిశీలిస్తే దాదాపు 200 మందికి పైగా లక్షల్లో బకాయి పడినవారే ఉన్నారు. ఇందులో కలెక్టర్‌ మొదలుకుని, క్లర్కుల వరకు ఉండడం గమనార్హం

ఇదిగో జాబితా..

సింగరేణి సంస్థకు చెందిన క్వార్టర్లు వినియోగిం చుకుని అద్దె చెల్లించని వారి వివరాలను పరిశీలిస్తే విస్మయం వ్యక్తమవుతోంది. ‘ఆంధ్రజ్యోతి’ సేకరించిన సమాచారం ప్రకారం భూపాలపల్లి ప్రాంతంలో మే నెల నాటికి మొత్తం రూ.2,15,67,556 బకాయిలు పేరుకుపోయినట్లు తేలింది. ఇందులో భూపాలపల్లి కలెక్టర్‌ క్వార్టర్‌కు సంబంధించి రూ.7,79,364 బకాయి పడ్డారు. 2016 అక్టోబరు నుంచి ఇంత వరకు అద్దె చెల్లించనట్లు తెలిసింది. ఇలా చెప్పుకుంటూ పోతే... సుమారు 200 మంది రూ.లక్ష నుంచి రూ.7లక్షల వరకు బాకీ ఉన్నారు. అధిక మొత్తంలో బాకీ ఉన్న మొదటి 10మంది జాబితా ఇలా ఉంది.

Updated Date - Jul 13 , 2024 | 11:55 PM

Advertising
Advertising
<