ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రైతుకు ధీమా..పంటకు బీమా..

ABN, Publish Date - Jun 11 , 2024 | 12:00 AM

పంటల బీమాకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబం ధించి వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో పంటల బీమాను అమలు చేసి రైతులకు ఆర్థిక భరో సా ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బీమా ప్రక్రియ ను వేగవంతం చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొంత నెమ్మదించగా ప్రస్తుతం వేగం పుంజుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద పంటలకు బీమా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

క్రాప్‌ ఇన్సూరెన్స్‌ అమలుకు ప్రభుత్వం కసరత్తు

గ్రామం యూనిట్‌గా వివరాల సేకరణ

త్వరలోనే మార్గదర్శకాలు విడుదల

జనగామ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): పంటల బీమాకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబం ధించి వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో పంటల బీమాను అమలు చేసి రైతులకు ఆర్థిక భరో సా ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బీమా ప్రక్రియ ను వేగవంతం చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొంత నెమ్మదించగా ప్రస్తుతం వేగం పుంజుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద పంటలకు బీమా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను తయారు చేసే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకంలో చేరలేదు. దీంతో రాష్ట్రంలోని రైతులకు పంటలు నష్టపోయిన సందర్భంలో ఎలాంటి పరిహారం అందలేదు. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫసల్‌ బీమా యోజనలో చేరాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయా జిల్లాలో గ్రామాలు, మండ లాల వారీగా సాగయ్యే పంటలు, వాతావరణ పరిస్థి తులపై వివరాలను ప్రభుత్వం సేకరించింది.

గ్రామం యూనిట్‌గా బీమా

పంటల బీమాను గ్రామం, మండలం యూనిట్‌గా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక గ్రామంలో ఎక్కువగా ఏ పంట సాగవుతోంది.. ఎంత విస్తీర్ణం.. వాతావరణ పరిస్థితులు.. ఇలా పలు అంశాలపై జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు వివరాలు తీసు కున్నారు. అతివృష్టి, అనావృష్టి కారణం గా పంటలు నష్టపోయినా.. చీడపీడల కారణంగా దిగుబడి తగ్గినా గ్రామం యూనిట్‌గా తీసుకొని పరిహారం అందించేందుకు ప్రభుత్వం విధివిధా నాలను తయారు చేస్తోంది. అదే విధంగా మండలాల వారీగా యూనిట్‌గా తీసుకొని బీమా చేయడంపై కూడా ఆలోచన చేస్తోంది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకువచ్చింది. ఈ పథకంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేయగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేరలేదు. దీంతో అప్పటి నుంచి ప్రకృ తి వైపరీత్యాల వల్ల పం టలు నష్టపోయినప్పటికీ రైతులకు పరిహారం అందలేదు. గత ప్రభు త్వం ఈపథకంలో చేరినట్లయితే రైతులకు పంట నష్ట పరిహారం అంది ఉండేది.

ఉచితంగా బీమా

పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం సొమ్మును ప్రభుత్వమే చెల్లించనుంది. ఫసల్‌ బీమా యోజనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా తో పాటు రైతు కూడా ప్రీమియం చెల్లించాల్సి ఉం టుంది. కానీ.. రైతు ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభు త్వమే చెల్లించనుంది. పంటల బీమాకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల కాగానే ఆసక్తి ఉన్న ఇన్స్యూరెన్స్‌ కంపెనీల నుంచి బిడ్డింగ్‌లను ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. బిడ్డింగ్‌ దక్కించుకున్న కంపెనీకి రైతులు, వారు సాగు చేసిన పంటల వారీగా బీమా ప్రీమియం సొమ్మును చెల్లిస్తుంది. ఏడాదికి వానాకా లం, యాసంగి రెండు సీజన్లలోనూ పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. ఫసల్‌ బీమా యోజన కింద ఆయా ప్రాంతాలను బట్టి హెకార్టుకు రూ. 35 నుంచి రూ.70 వేల మొత్తానికి కేంద్ర ప్రభుత్వం బీమా చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమూ ఇదే విధానాన్ని అమలు చేయనుంది. రైతు వాటా కింద రూ. 1000 నుంచి రూ.1600 వరకు ఉంటుంది. బీమా మొత్తంలో వానాకా లం పంటలకు 2 శాతం, యాసంగి పంటలకు 1.5 శాతం, ఏడాది కాలపరిమితి ఉన్న వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియాన్ని రైతు చెల్లిం చాల్సి ఉండగా దీనిని ప్రభుత్వమే చెల్లించనుంది.

జిల్లాలో 171 యూనిట్ల గుర్తింపు

పంటల బీమాకు సంబంధించి జిల్లాలో 171 యూని ట్లను గుర్తించారు. 250 ఎకరాలకు పైబడి వరి పండిం చే గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకున్నారు. అదే వి ధంగా 250 ఎకరాల లోపు వరి విస్తీర్ణం ఉన్న 2 నుంచి ఐదు గ్రామాలను(మొత్తంగా 250 ఎకరాల విస్తీర్ణం) కలిపి ఒక యూనిట్‌గా తీసుకున్నారు. 250 ఎకరాల పై బడిన యూనిట్లు 158 ఉండగా, 250 ఎక రాల లోపు ఉన్న గ్రామాల యూనిట్లు 9 ఉన్నాయి. దీంతో పాటు జిల్లా మొత్తంగా పత్తి పంటను ఒక యూనిట్‌గా, కంది పంటను 3 యూనిట్లుగా తీసుకు న్నారు. ఇదిలా ఉం డగా జిల్లాలో వరి, మొక్కజొన్న, కంది, మామిడి, పత్తి, మిర్చి తదితర అన్ని రకాల పం టలను కలిపి 668 ప్రాంతాల్లో పంట వేసిన నాటి నుంచి కోత అయ్యే వరకు వివిధ దశల్లో పరిశీలించి పంట నష్టాన్ని అంచ నా వేస్తారు. నిర్ణీత విస్తీర్ణంలో ఎంత దిగుబడి రావాల్సి ఉంది? ఎంత వచ్చిందనే వి వరాలను నమోదు చేసు కుంటారు. ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల , చీడపీడల వల్ల దిగుబడులు తగ్గినట్లయితే బీమా నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తారు.

సాగు వివరాలు పంపించాం..

- వినోద్‌కుమార్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

పంటల బీమాకు సంబంధించి జిల్లాలో గ్రామాల వారీగా ఏయే పంటలు సాగవుతాయనే వివరాలను ఉన్నతాధికారులు అడిగారు. దీనిపై ప్రణాళికశాఖతో కలిసి ఉమ్మడి నివేదికను పంపించాం. బీమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు. వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రక్రియ చేపడతాం.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 12:00 AM

Advertising
Advertising