ఆపద్బాంధవులు
ABN, Publish Date - Jul 04 , 2024 | 11:52 PM
వర్షాకాలం వచ్చిందంటే... మారుమూల గ్రామాల ప్రజలకు ప్రళయమే. జల దిగ్బంధనంలో చిక్కుకొని విలవిలలాడాల్సిందే. వరద చుట్టుముట్టి నిండా ముంచేస్తే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమనాల్సిందే. ఇల్లూ వాకిలి ఆగ మై... ఎటు వెళ్లాలన్నా దారి దొరక్క వారు పెట్టే ఆక్రం దనలు మిన్నంటుతుంటాయి.
విపత్తు సహాయక చర్యల కోసం పోలీసుల ప్రత్యేక బృందం
40 మందితో రెస్క్యూ టీం ఏర్పాటు
రాష్ట్రంలోనే ములుగు జిల్లాలో తొలిసారి
నాలుగు డీడీఆర్‌ఎఫ్ బృందాల ఏర్పాటు
ములుగు, పస్రా, ఏటూరునాగారం, వెంకటాపురంలో క్యాంపులు
ములుగు, జూలై 4: వర్షాకాలం వచ్చిందంటే... మారుమూల గ్రామాల ప్రజలకు ప్రళయమే. జల దిగ్బంధనంలో చిక్కుకొని విలవిలలాడాల్సిందే. వరద చుట్టుముట్టి నిండా ముంచేస్తే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమనాల్సిందే. ఇల్లూ వాకిలి ఆగ మై... ఎటు వెళ్లాలన్నా దారి దొరక్క వారు పెట్టే ఆక్రం దనలు మిన్నంటుతుంటాయి. ఆపద సమయంలో సాయం అందించే వారి కోసం వారి కళ్లు ఎదురుచూ స్తుంటాయి. అయితే.. అలాంటి వారి కోసమే ఆపన్న హస్తాన్ని అందించేందుకు సిద్ధమైంది ఓ రక్షణ దళం. విపత్తు సంభవించినప్పుడు ఆపదలో ఉన్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు పోలీసు శాఖ ఈ స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. వర్షాకాలంలో వరద ముప్పు నుంచి ఈ దళం రక్షణ కల్పించనుంది.
రాష్ట్రంలో తొలిసారిగా..
ఏదైనా విపత్తు సంభవించినప్పుడు గతంలో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ప్రభుత్వం రంగంలోకి దింపేది. వారు వచ్చే వరకు ఎదురుచూ డాల్సిన పరిస్థితి ఉండేది. ఏటూరునాగారానికి ఐదారు గురు సభ్యులతో కూడిన టీమ్‌ను ముందస్తుగా పంపించినా జిల్లాలోని అనేక ప్రాంతాలు ఒకేసారి ముంపునకు గురైతే సహాయక చర్యలకు ఇబ్బందిగా ఉండేది. కానీ, తొలిసారిగా ములుగు జిల్లాలో డిస్ర్టిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీడీఆర్‌ఎఫ్)ను గతేడాది ఏర్పాటు చేశారు. అప్పటి ఎస్పీ గాష్‌ఆలం చొరవతో 20 మంది స్పెషల్‌పార్టీ, డిస్ర్టిక్ట్ ఆర్మ్డ్ పోలీసు కానిస్టేబుళ్లతో రెండు బృందాలను నియమించారు. జీహెచ్‌ఎంసీ విప త్తు స్పందన బృందంతో వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. ఇద్ద రు ఆర్‌ఎస్సైలను ఇన్‌చార్జిలుగా నియమించారు.
50 మంది ప్రాణాలను కాపాడిన డీడీఆర్‌ఎఫ్
గత ఏడాది జూలైలో జిల్లాలోని లోతట్టు ప్రాంతా లను వరదలు అతలాకుతలం చేశాయి. ఏటూరునా గారం, మంగపేట, కన్నాయిగూడెం, మేడారం, పస్రా, వెంకటాపూర్, వాజేడు, వెంకటాపురం(నూగూరు) ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్న 50 మందికి పైగా ప్రజలను డీడీఆర్‌ఎఫ్ పోలీసులు కాపాడారు. మేడా రంలో జంపన్నవాగు వరద పోటెత్తడంతో రేకుల షెడ్డులో చిక్కుకొని ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడు తున్న 20 మందిని ఒకేసారి కాపాడారు. లేకుంటే వారంతా వరద ఉధృతిలో కొట్టుకుపోయేవారే. వెంక టాపురం(నూగూరు) మండలం ముత్యంధార జల పాతం సందర్శనకు వెళ్లి వరద ఉధృతిలో చిక్కు కున్న 40మంది పర్యాటకులను అర్ధరాత్రి పూట రెస్క్యూ చేసి కాపాడారు. వందలాది మంది ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షి త ప్రదేశాలకు తరలించారు. ధైర్యసాహసా లు ప్రదర్శించి ప్రజలను కాపాడినందుకు శ్రీకాంత్, రాంబాబు అనే ఇద్దరు స్పెషల్‌పార్టీ కానిస్టేబుళ్లను ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పురస్కారంతోపాటు రివార్డును అందజేసింది.
ఈసారి 40మందితో..
ములుగు జిల్లాకు ఈసారి కూడా వరద ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో డీడీఆర్‌ఎఫ్‌ను 20 మం ది నుంచి 40 మందికి పెంచారు. వీరందరికీ ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. వరద ప్రభావం ఉన్న ములుగు, పస్రా, ఏటూరునాగారం, వెంకటాపురం(నూగూరు) వద్ద స్పెషల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఒక్కో క్యాంపులో 10మంది చొప్పున నియమించారు. అత్య వసర పరిస్థితుల్లో వీరిని ఆయా క్యాంపుల్లో సిద్ధంగా ఉంచనున్నారు. ఒక్కో బృందానికి ఆర్‌ఎస్‌ఐ ర్యాంకు పోలీసు అధికారి ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తారు.
ప్రజల రక్షణకు సిద్ధంగా ఉన్నాం : శబరీశ్, ములుగు ఎస్పీ
ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉంది. 40మందితో నాలుగు బృందాలను నియమించాం. ముంపు ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల నుంచి ముందస్తుగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచిస్తున్నాం. అధికారులు, ప్రజల సహకారంతో ఈసారి వరద ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సన్నద్ధమైంది.
Updated Date - Jul 04 , 2024 | 11:52 PM