పండ్ల తోటలకు ప్రాధాన్యం
ABN, Publish Date - Aug 22 , 2024 | 11:59 PM
సంప్రదాయ పంటలకు బదులు ఉద్యాన పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ రకాల పండ్ల తోటల విస్తీర్ణం పెంచేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఆసక్తి ఉన్నవారికి సహకారం అందిస్తోంది. పలురకాలుగా రాయితీలను వర్తింపజేస్తోంది.
సాగును ప్రోత్సహించేందుకు సర్కారు సాయం
మూడేళ్ల వరకు నిర్వహణ ఖర్చుల చెల్లింపు
16 రకాల మొక్కల పెంపకం
చిన్న, సన్నకారు రైతులకే అవకాశం
జిల్లాలో 600 ఎకరాల్లో సాగు లక్ష్యం
జఫర్‌గడ్, ఆగస్ట్టు 22 : సంప్రదాయ పంటలకు బదులు ఉద్యాన పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ రకాల పండ్ల తోటల విస్తీర్ణం పెంచేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఆసక్తి ఉన్నవారికి సహకారం అందిస్తోంది. పలురకాలుగా రాయితీలను వర్తింపజేస్తోంది. మొక్కల కొనుగోలు దగ్గర నుంచి ఫలసాయం అందే వరకు వివిధ దశల్లో అయ్యే ఖర్చులను ఉపాధి హామీ కింద చెల్లిస్తోంది. అయిదు ఎకరాల లోపు నీటి వసతి కలిగిన భూమి ఉన్న రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతీ మండలానికి 50 ఎకరాల చొప్పున జిల్లాలోని 12 మండలాలకు కలిపి మొత్తం 600 ఎకరాల్లో పండ్ల తోటలను సాగు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
చిన్న, సన్నకారు రైతుల అభివృద్ధే లక్ష్యంగా...
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పండ్ల ఉత్పత్తి లేక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పండ్లకు మార్కెట్‌లో నానాటికీ డిమాండ్ పెరుగుతోంది. మరో వైపు నీటివనరులు సమృద్ధిగా ఉంటూండడంతో ఏటా వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా పండ్ల తోటల సాగును పెంచేందు కు సర్కారు చర్యలు చేపట్టింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధుల ద్వారా రైతు లకు సహాయం అందేలా జిల్లా యంత్రాంగం కార్యా చరణ రూపొందించింది. ఐదు ఎకరాల వరకు గల చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లా లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మండ లాల్లో చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా పండ్ల తోటల పెంప కానికి చర్యలు చేపట్టారు.
రైతులకు అవగాహణ..
గ్రామీణాభివృద్ధి శాఖ నేతృత్వంలో ఉద్యాన, ఉపాధి హామీ శాఖల సహకా రంతో వివిధ పండ్లతోటల సాగుపై రైతుల కు అవగాహన కల్పిస్తున్నారు. మామిడి, జామ, సపోట, మునగ, చింత, డ్రాగన్ ఫ్రూట్, నారింజ, బత్తాయి, కొబ్బరి, దానిమ్మ, ఆయిల్‌పామ్, నేరేడు వంటి పండ్ల తోటలు పెంచేలా చర్యలు తీసుకుం టున్నారు. మొక్కలను వంద శాతం రాయితీపై అం దిస్తున్నారు. ఈ పథకం కింద ఎంపికైన రైతులకు పండ్ల తోటల సాగుకు మూడేళ్ల వరకు నిర్వహణ ఖర్చులను చెల్లిస్తారు. భూమి సారాన్ని బట్టి ఉద్యానశాఖ అధికారుల సూచనల మేరకు పండ్ల తోటలను ఎంపిక చేస్తారు. మొక్కల పెంపకానికి సంబంధించి గుంతలు తీసేందుకు కూలీలకు డబ్బులు, తోట చుట్టూ కంచె ఏర్పాటు కు, ఎరువు ల కొనుగోలుకు రైతులకు సాయం కింద డబ్బులు చెల్లిస్తారు. పంట మొదటి దిగుబడి వచ్చే వరకు సాయం అందిస్తారు.
అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ..
వసంత, డీఆర్‌డీవో జనగామ
పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్స హించడం కోసం ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం అందిస్తోం ది. సన్న, చిన్నకారు రైతులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. పంట దిగుబడి వచ్చే వరకు పర్యవేక్షణతో పాటు మూడేళ్ల వరకు అయ్యే ఖర్చులను ఉపాఽధి హామీ పథకం ద్వారా ప్రభుత్వమే భరిస్తుంది. సంబంధిత నగదును రైతు ఖాతాలో జమ చేస్తారు. రూపాయి పెట్టుబడి లేకుండా పండ్ల తోటలను సాగు చేసుకోవచ్చు. క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రతీ మండలంలో 50 ఎకరాల చొప్పున వివిఽధ పండ్ల తోటలు సాగు చేసేలా కార్యాచరణ చేపట్టాం. జిల్లాలో నిర్దేశిత లక్ష్య సాధనకు కృషి చేస్తున్నాం. ఆసక్తి గల రైతులు మండల పరిషత్ కార్యాలయంలో, ఉపాధి హామీ పథకం, ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి.
Updated Date - Aug 23 , 2024 | 12:00 AM