ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS NEWS: వరంగల్ జిల్లాలో విషాదం.. కరెంట్ షాకుతో ముగ్గురి మృతి

ABN, Publish Date - Mar 04 , 2024 | 10:42 PM

జిల్లాలోని పర్వతగిరి మండలం మోత్య తండాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ ప్రమాదానికి గురై ముగ్గరు వ్యక్తులు మృతిచెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. రేపు(మంగళవారం) దుర్గమ్మ పండుగ నేపథ్యంలో విద్యుత్ తీగలను మండపానికి పెట్టే సమయంలో 33/11 కేవీ హెవీ లైన్ తెగి పడింది. ఈ ఘటనలో నలుగురు విద్యుత్ షాక్‌కు గురయ్యారు.

వరంగల్: జిల్లాలోని పర్వతగిరి మండలం మోత్య తండాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ ప్రమాదానికి గురై ముగ్గరు వ్యక్తులు మృతిచెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. రేపు(మంగళవారం) దుర్గమ్మ పండుగ నేపథ్యంలో విద్యుత్ తీగలను మండపానికి పెట్టే సమయంలో 33/11 కేవీ హెవీ లైన్ తెగి పడింది. ఈ ఘటనలో నలుగురు విద్యుత్ షాక్‌కు గురయ్యారు.

భూక్యా దేవేందర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో ముగ్గురిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతి చెందిన వారిని దేవేందర్, రవి, అనిల్‌గా గుర్తించారు. మృతుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఓదారుస్తున్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:12 PM

Advertising
Advertising