ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రోగుల నిలువు దోపిడీ

ABN, Publish Date - Jun 01 , 2024 | 12:37 AM

వైద్య పరీక్షల పేరిట ప్రైవేట్‌ డయాగ్నోస్టిక్‌, స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ప్రజలను దోచుకుంటున్నారు. వారు చెప్పిందే రేటు అన్నట్టుగా చెల్లించాల్సి వస్తుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. వైద్యుడి మాటను కాదని.. మరో చోట పరీక్షలు చేయించుకునే ధైర్యం లేక ప్రైవేట్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్ల నిర్వాహకులు పెట్టిన ఫీజును చెల్లించలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనంతటికీ వైద్యులు, సెంటర్ల నిర్వాహకుల మధ్య జరిగే కమీషన్ల వ్యవహారమే కారణమన్నది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా వరంగల్‌, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో జరుగుతున్న డయాగ్నస్టిక్‌, స్కానింగ్‌ కేంద్రాల దోపిడీపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.

స్కానింగ్‌, డయాగ్నోస్టిక్‌ సెంటర్ల దందా

వైద్య పరీక్షల పేరిట ఇష్టారాజ్యం

టెస్టులకు వాళ్లు పెట్టిందే రేటు

గుట్టుగా సాగుతున్న లింగ నిర్ధారణ, అబార్షన్లు

జాడలేని టాస్క్‌ఫోర్స్‌

మామూళ్ల మత్తులో వైద్య, ఆరోగ్యశాఖ

వరంగల్‌ మెడికల్‌, మే 30 : వైద్య పరీక్షల పేరిట ప్రైవేట్‌ డయాగ్నోస్టిక్‌, స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ప్రజలను దోచుకుంటున్నారు. వారు చెప్పిందే రేటు అన్నట్టుగా చెల్లించాల్సి వస్తుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. వైద్యుడి మాటను కాదని.. మరో చోట పరీక్షలు చేయించుకునే ధైర్యం లేక ప్రైవేట్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్ల నిర్వాహకులు పెట్టిన ఫీజును చెల్లించలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనంతటికీ వైద్యులు, సెంటర్ల నిర్వాహకుల మధ్య జరిగే కమీషన్ల వ్యవహారమే కారణమన్నది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా వరంగల్‌, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో జరుగుతున్న డయాగ్నస్టిక్‌, స్కానింగ్‌ కేంద్రాల దోపిడీపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.

పుట్టుకొస్తున్న డయాగ్నోస్టిక్‌, స్కానింగ్‌ సెంటర్లు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ నగరంలోనే లెక్కలేనన్ని డయాగ్నోస్టిక్‌, స్కానింగ్‌ సెంటర్లు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ ప్రస్తుతం రోగులను పీల్చిపిప్పిచేసే కేంద్రాలుగా మారాయి. తమ లాభాలతోపాటు దళారులకు, రిఫరల్‌ వైద్యులకు ఇవ్వాల్సిన కమీషన్లను కూడా రోగి నుంచి వసూలు చేస్తున్నారు. దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తూ రోగులకు అవసరం లేకపోయినా ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌, ఈఈజీ లాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోగుల నుంచి వీరు వసూలు చేసే సొమ్ములో 50శాతం కమీషన్లు దళారులకు, రిఫరల్‌ వైద్యులకు చెల్లిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఈ కేంద్రాల్లో పరీక్షల నాణ్యతా ప్రమాణాలు కూడా అంతంత మాత్రమే ఉంటున్నాయని రోగులు వాపోతున్నారు. గుర్తింపు పొందిన సెంటర్లతోపాటు గుర్తింపు లేని సెంటర్లు కూడా వైద్య పరీక్షలు చేస్తున్నా వైద్యఆరోగ్య శాఖ అధికారులు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

టాస్క్‌ఫోర్స్‌ ఎక్కడ?

గుర్తింపులేని సంస్థలతోపాటు అధిక ధరలు వసూలు చేస్తున్న స్కానింగ్‌, డయాగ్నోస్టిక్‌ సెంటర్లను గుర్తించేందుకు నియమించిన టాస్క్‌ఫోర్స్‌ ఎక్కడా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నగరంలో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతున్నా మౌనంగా ఉండటం వెనుక మర్మమేమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సామాన్యుల పక్షాన నిలబడాల్సిన టాస్క్‌ఫోర్స్‌ దళారులకు అండగా ఉంటుందని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు

పలు స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి లింగ యథేచ్ఛగా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం కఠిన నిబంధనలు రూపొందించినా లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్చగా జరుగుతున్నాయని, పరీక్షలు చేయించుకుంటున్న వారిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారని సమాచారం. ఈ పరీక్షలు చేసేందుకు ఆర్‌ఎంపీ లు, పీఎంపీలు సహకరిస్తున్నారని.. ఒక్కో లింగ నిర్ధారణ పరీక్షకు రూ. 15వేల చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన అనంతరం అవసరమైతే అబార్షన్లు కూడా చేస్తున్నారని సమాచారం. నగరంలోని కాకాజీ కాలనీ, రాంనగర్‌, డబ్బాల జంక్షన్‌, కాశీబుగ్గ, బాల సముద్రం, కాజీపేటలో పలు డయాగ్నోస్టిక్‌, స్కానింగ్‌ సెంటర్లలో ఈ తతంగం నిత్య కృత్యంగా మారింది. గతంలోనే పలుసందర్భాల్లో వెలుగులోకి వచ్చినా.. మళ్లీ కొత్త సెంటర్లు పుట్టుకొస్తుండటంతో ఈ దందా యథేచ్ఛగా సాగుతున్నట్టు చర్చ జరుగుతోంది.

మామూళ్ల మత్తులో ఆరోగ్యశాఖ

ప్రైవేట్‌ డయాగ్నోస్టిక్‌, స్కానింగ్‌ సెంటర్ల పనితీరుపై నిరంతరం నిఘా పెట్టాల్సిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని, ఆయా సెంటర్ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి కళ్లు మూసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డయాగ్నోస్టిక్‌, స్కానింగ్‌ సెంటర్లపై నాణ్యత ధరల విషయంలో నిరంతరం తనిఖీలు చేయకుండా మౌనంగా ఉండటం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అబార్షన్లు చేస్తున్నారని వచ్చిన సమాచారంతో పలు సెంటర్లపై దాడులు చేసిన అధికారులు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని, చట్టాలను పకడ్బందీగా అమలు చేసి నిబంధనలను తుంగలో తొక్కుతున్న ఆయా సెంటర్ల నిర్వాహకులపై నిఘా పెట్టి.. పటిష్ఠ చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పట్టుబడినా శిక్షలు లేవు..

గతేడాది మార్చి 23వ తేదీన వరంగల్‌ దేశాయిపేట ఎంహెచ్‌ నగర్‌లో మొబైల్‌ స్కానింగ్‌ మిషన్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అలాగే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి.. ఓ వైద్యురాలు, నర్సుపై కేసులు నమోదు చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. ఇదే తరహాలో హనుమకొండ కాకాజీకాలనీ ప్రాంతంలో కూడా లింగ నిర్ధారణ కోసం స్కానింగ్‌లు నిర్వహిస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు కేసులు నమోదు చేశారు. కానీ ఇలా పట్టుబడుతున్న వారికి శిక్షలు పడకపోతుండటంతో.. ఆయా ఘటనల్లో దొరికిన వారు తిరిగి ఇదే దందాను మరోచోట నిర్వహిస్తున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ తనిఖీల్లో వెల్లడవుతోంది. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ దోపిడీకి అంతం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jun 01 , 2024 | 12:37 AM

Advertising
Advertising