ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమగ్రాభివృద్ధికి.. బాటలు..

ABN, Publish Date - Nov 08 , 2024 | 12:46 AM

వరంగల్‌ నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ‘బాటలు’ వేస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఔటర్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్ల పనులను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. నిధుల సమీకరణతో పాటు భూసేకరణ, రోడ్డు విస్తరణ పనులపై ఫోకస్‌ పెడుతోది. గత ప్రభుత్వం హయంలో ఇన్నర్‌, ఔటర్‌ రింగు రోడ్ల పనుల ప్రతిపాదనలు పట్టాలెక్కినా.. నిధులలేమితో అడుగులు ముందుకు పడలేదు. నాటి సర్కారు వీటికి పైసా నిధులు కేటాయించకపోవటంతో కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కూడా) నిధుల నుంచే రూ.120కోట్ల వరకు ఖర్చు చేసి ప్రాథమిక పనులు పూర్తి చేశారు.

ఔటర్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్ల పనులపై ప్రభుత్వం నజర్‌

వరంగల్‌ మహా నగరంలో ట్రాఫిక్‌ సమస్య లేకుండా రహదారులు

పూర్తయితే అభివృద్ధి పరుగులేనంటున్న ప్రజాప్రతినిధులు

ఎయిర్‌పోర్టు, వరంగల్‌ కోట, మెగా టైక్స్‌టైల్‌ పార్కులకు సులభ ప్రయాణం

రూ.1,500కోట్లతో ఔటర్‌, రూ.570కోట్లతో ఇన్నర్‌ రింగ్‌రోడ్లకు ప్రతిపాదనలు

నిధులు కేటాయింపు, భూసేకరణే ప్రధాన సవాళ్లు

పైసా విడుదల చేయని గత ప్రభుత్వం

నాడు ‘కుడా’ నుంచి రూ.120కోట్టు వెచ్చించి ప్రాథమిక పనుల పూర్తి

రేవంత్‌ సర్కారు హడావుడితో ఓరుగల్లువాసుల్లో పెరుగుతున్న ఆశలు

వరంగల్‌ నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ‘బాటలు’ వేస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఔటర్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్ల పనులను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. నిధుల సమీకరణతో పాటు భూసేకరణ, రోడ్డు విస్తరణ పనులపై ఫోకస్‌ పెడుతోది. గత ప్రభుత్వం హయంలో ఇన్నర్‌, ఔటర్‌ రింగు రోడ్ల పనుల ప్రతిపాదనలు పట్టాలెక్కినా.. నిధులలేమితో అడుగులు ముందుకు పడలేదు. నాటి సర్కారు వీటికి పైసా నిధులు కేటాయించకపోవటంతో కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అఽథారిటీ (కూడా) నిధుల నుంచే రూ.120కోట్ల వరకు ఖర్చు చేసి ప్రాథమిక పనులు పూర్తి చేశారు. తాజాగా మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇన్నర్‌, ఔటర్‌ రింగు రోడ్లను పూర్తి చేసేందుకు అధికారులతో సమీక్షలు నిర్వహించటంతో ఆర్‌ఆర్‌లపై ఆశలు చిగురిస్తున్నాయి. అయితే నిధులు సమీకరణతోపాటు భూసేకరణ ప్రధాన సవాల్‌గా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌)

హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడు గులు వేస్తోంది. అభివృదిలో కీలక పాత్రపోషించే రోడ్ల విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా మహానగరంలో ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌పెడుతూ అభివృద్ధికి బాటలు వేస్తూ ఔటర్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్ల నిర్మాణాలపై దృష్టి పెట్టిం ది. కొత్తగా నిర్మించే 13కి.మీ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) చుట్టూ భూములకు భారీగా డి మాండ్‌ పెరగనుంది. కొత్త వ్యాపారాలు, పరిశ్ర మలు ఏర్పాటుకు అనుకూలంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) ఉండనుంది. అలాగే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకునే అవకాశం ఉం ది. ఓఆర్‌ఆర్‌తో భారీ వాహనాలు నగరంలోకి రాకుండా హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, భూపాలపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లనున్నా యి. ఓఆర్‌ఆర్‌ చుట్టూ కొత్త పరిశ్రమల ఏర్పా టు, విద్యా సంస్థలు తదితర వ్యాపారాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఓఆర్‌ఆర్‌, ఐ ఆర్‌ఆర్‌పై అధికారులతో ఇటీవల కీలక సమా వేశం నిర్వహించారు. త్వరగా పనులు చేపట్టేం దుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ రెండింటికి సుమారు రూ.2వేల కోట్ల వరకు నిధులు అవసరం కానుం డటంతో వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఓఆర్‌ఆర్‌, ఐఆర్‌ఆర్‌ పనుల్లో కదిలిక రావటంతో ఓరుగల్లువాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కోసం 53ఏళ్లుగా ఎదురుచూపు

వరంగల్‌ నగర వాసుల 53ఏళ్ల కల సాకారం కాబోతోంది. 1971లో వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో 200అడుగుల ఇన్నర్‌ రింగు రోడ్డును ప్రతిపాదించారు. అప్పట్లో దీనికి రోడ్ల, భవనాల శాఖ రూ.50కోట్లతో అంచనాలు నూపొందించగా. అప్పటి ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. అయితే అప్పటి నుంచే పలు కారణాలతో పనులు ముందుకు సాగలేదు. అయితే 2008లో ఐఆర్‌ఆర్‌ పనుల్లో కొంత కదిలిక వచ్చినా ముందుకు సాగులేదు. 200 అడుగుల వెడల్పుతో ఆరెపల్లి వద్ద ఉన్న ఆర్‌ఆర్‌ నుంచి 13కిలో మీటర్ల దూరంలో ఉన్న నాయుడు పెట్రోల్‌ బంక్‌ జంక్షన్‌ వరకు ఐఆర్‌ఆర్‌ నిర్మాంచాలని ప్రతిపాదించారు. ఇందుకోసం 2012లో ప్రభుత్వం రూ.20కోట్లు కేటాయించింది. వీటితో భూసేకరణకు మార్కింగ్‌ చేశారు. ఆ తరువాత రోడ్డు పనులు అటకెక్కాయి. 2018లో మరోసారి ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. 2019మే నెలలో భూసేకరణకు అధికారులు నోటిఫికేషన్‌ జారీకి చర్యలు చేపట్టారు. ఇందులో మొదటి దశలో నాయుడు పెట్రోల్‌ బంకు నుంచి ఎనుమాముల వరకు 8కిలో మీటర్లు, రెండో దశలో ఎనుమాముల నుంచి ఆరెపల్లి ఆర్‌ఆర్‌ వరకు 5కిలో మీటర్ల ఐఆర్‌ఆర్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. 360మంది భూనిర్వాసితుల్లో 200మందికి పరిహారం ఇవ్వగా, ఇంకా 160మందికి పరిహారం ఇచ్చే విషయంలో గత ప్రభుత్వం తాత్సారం చేసింది. దీంతో నిర్వాసితుల ఆందోళనలు, నిధుల లేమితో పనులు మరోసారి నిలిచిపోయాయి. ఎట్టకేలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో వరంగల్‌ సమగ్రాభివృద్ధిపై ఫోకస్‌ పెట్టింది. వరంగల్‌ నగరవాసులకు ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు ఐఆర్‌ఆర్‌ పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇన్నర్‌ రింగు రోడ్డును 13కి.మీ పొడువుతో 200 అడుగుల వెడల్పుతో నాయుడు పెట్రోల్‌ పంపు నుంచి ఉర్సు, తిమ్మాపూర్‌, ఫోర్ట్‌ వరంగల్‌, గొర్రెకుంట, ఎనుమాముల, పైడిపల్లి, నుంచి ఆరెపల్లి వద్ద ఓఆర్‌ఆర్‌కు అనుసంధానం చేసేలా మ్యాప్‌ సిద్ధం చేశారు. ఇందు కోసం ప్రభుత్వం తాజాగా రూ.570కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం డీపీఆర్‌ను రూపొందించింది. ఇందులో నుంచి భూసేకరణ కోసం రూ.350కోట్లు, రోడ్లు, చెట్లు తొలగింపు తదతర వాటి కోసం రూ.220కోట్లు ఖర్చు చేయనున్నారు. అయితే గత ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కేటాయింపులు లేకపోవటంతో కూడా నుంచి రూ.120కోట్లు ఖర్చు చేశారు. రోడ్డు మార్కింగ్‌తో పాటు లైనింగ్‌, భూ నిర్వాసితులకు పరిహరం తదితర వాటికి కూడా నిధులనే వెచ్చించారు. ప్రభుత్వం మరో రూ.450కోట్ల వరకు నిధులు ఐఆర్‌ఆర్‌కు కేటాయిస్తే పనులు ముందుకు సాగుతాయి.

ఓఆర్‌ఆర్‌తో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌...

ఓరుగల్లువాసుల మరో కలయిన ఔటర్‌ రింగ్‌రోడ్డు పనులను చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 2017లో 71కిలో మీటర్ల వరకు ఓఆర్‌ఆర్‌ను నిర్మించాలని ప్రతిపాదనలు చేయగా.. ఇందులో భాగంగా ఉత్తరం వైపు రాంపూర్‌ నుంచి ఆరెపల్లి వరకు 30కిలోమీటర్ల రోడ్డును జాతీయ రహదారుల శాఖ నిర్మించింది. ఇక దక్షిణం వైపు రాంపూర్‌ గ్రామం నుంచి నష్కల్‌, ధర్మపురం, వెంకటాపూర్‌, ఐనవోలు, పున్నెలు, బొల్లికుంట, కాపుల కానిపర్తి, వసంతాపూర్‌, ధర్మారం, బొడ్డు చింతలపల్లి. మొగిలిచర్ల, కొత్తపేట మీదుగా 41 కిలోమీటర్ల రోడ్డును ఆరెపల్లి వద్ద ఓఆర్‌ఆర్‌కు అనుసంధానం చేయాల్సిన రోడ్డును ఆర్‌ అండ్‌ బీ నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే ఓఆర్‌ఆర్‌కు అధికారులు మార్కింగ్‌ చేసినా గత ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవటంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత వరంగల్‌ను రాష్ర్టానికి రెండో రాజధానిని చేయాలనే లక్ష్యంతో ఓఆర్‌ఆర్‌ నిర్మాణం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దక్షిణం వైపు 41 కిలో మీటర్ల రోడ్డును మూడు విడతల్లో పూర్తి చేయాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. తొలి విడతలో 20కిలో మీటర్లు, రెండో విడతలో 11కిలో మీటర్లు, మూడో విడతలో 10కిలో మీటర్ల రోడ్డును నిర్మించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందు కోసం సుమారు 911ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని అధికారులు ప్రతిపాదనలు చేశారు. భూసేకరణతో పాటు రోడ్డు నిర్మాణం, వంతెనల నిర్మాణం తదితర వాటికోసం సుమారు రూ.1,500కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు చేశారు. ఇందులో ఉత్తరం వైపు రూ.700కోట్లతో పనులు పూర్తయ్యాయి. ఇక మిగిలిన సుమారు రూ.800కోట్లతో ఓఆర్‌ఆర్‌ పూర్తి అయితే ములుగు, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్‌, తొర్రూరు, వర్ధన్నపేట, జనగామ, స్టేషన్‌ఘనపూర్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు నగరంలోని ట్రాఫిక్‌ కష్టాలు లేకుండా వెళ్లేందుకు సౌకర్యవంతంగా మారనుంది. అంతేకాకుండా మామునూరు ఎయిర్‌పోర్టు, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు, వరంగల్‌ కోట, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ తదితర వాటికి వెళ్లేందుకు నగరంలోకి రానవసరం ఉండదు. మొత్తానికి సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఓఆర్‌ఆర్‌, ఐఆర్‌ఆర్‌లపై ప్రభుత్వంలో కదిలిక రావటంతో ఓరుగల్లు వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌)

  • ఉత్తరం వైపు ఎన్‌హెచ్‌163 నుంచి 30కిలో మీటర్లు పనులు పూర్తయ్యాయి.

  • దక్షిణం వైపు 41కిలో మీటర్లు రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది

  • సుమారు 911ఎకరాల భూమి భూసేకరణ చేయాల్సి ఉంది.

  • అంచనా వ్యయం సుమారు రూ.1,500కోట్లు కాగా ఇందులో ఉత్తరం వైపు రూ.700కోట్లతో పనులు పూర్తయ్యాయి.

  • ఓఆర్‌ఆర్‌ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు: రాంపూర్‌, నష్కల్‌, ధర్మపురం, వెంకటాపూర్‌, ఐనవోలు, పున్నెలు, బొల్లికుంట, కాపుల కానిపర్తి, వసంతాపూర్‌, ధర్మారం, బొడ్డు చింతలపల్లి. మొగిలిచర్ల, కొత్తపేట నుంచి ఓఆర్‌ఆర్‌కు అనుసంధానం చేయనున్నారు.

ఫ ఇన్నర్‌ రింగురోడ్డు (ఐఆర్‌ఆర్‌)

  • 13కి.మీ పోడువు.. 200ఫీట్ల వెడల్పు ఉంటుంది.

  • అంచనా వ్యయం రూ.570కోట్లు కాగా ఇందులో భూసేకరణ కోసం రూ.350కోట్లు, రోడ్లు, వంతెనలు తదతర వాటి కోసం రూ.220కోట్లు వెచ్చించాలి.

  • ఇప్పటి వరకు రూ.120కోట్లు కూడా నిధులు ఖర్చుచేశారు.

  • ఐఆర్‌ఆర్‌ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు: నాయుడు పెట్రోల్‌ పంపు నుంచి ఉర్సు, తిమ్మాపూర్‌, ఫోర్టు వరంగల్‌, గొర్రెకుంట, ఎనుమాముల, పైడిపల్లి, ఆరెపల్లి ఓఆర్‌ఆర్‌ అనుసంధానం అవుతుంది.

Updated Date - Nov 08 , 2024 | 06:18 AM