ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Manchiryāla- ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం

ABN, Publish Date - May 29 , 2024 | 11:02 PM

రైతన్నలు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. బుధవారం చెన్నూరు ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎలాంటి అపోహలకు గురి కావద్దన్నారు

మాట్లాడుతున్న ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి

చెన్నూరు, మే 29: రైతన్నలు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. బుధవారం చెన్నూరు ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎలాంటి అపోహలకు గురి కావద్దన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల కొన్ని సమస్యలు తలెత్తినప్పటికీ ఎప్పటికప్పుడు సంబంధిత ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌లతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశామని చెప్పారు. ఈ ప్రాంతంలో ఎక్కువ రైసుమిల్లులు లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. కానీ పెద్దపల్లి, సుల్తానాబాద్‌ రైసుమిల్లర్ల యాజమానులతో మాట్లాడి ధాన్యం పంపేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1.25 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.277 కోట్లు జమ అయ్యాయని వివరించారు. అంతకుముందు మండలంలోని ఆస్నాద్‌, సోమనపల్లి, ఓత్కులపల్లి, అంగ్రాజ్‌పల్లి తదితర గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అక్కడి పరిస్థితులను నిర్వహకులను అడిగి తెలుసుకుని ఎప్పటికప్పుడు ధాన్యాన్ని రైసుమిల్లర్లకు చేరవేయాలని సూచించారు. సమావేశంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ చల్ల రాంరెడ్డి, కోటపల్లి మాజీ జడ్పీటీసీ పోటు రాంరెడ్డి, కోటపల్లి మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ గొడిసెల బాపురెడ్డి, నాయకులు సూర్యనారాయణ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 11:02 PM

Advertising
Advertising