అమ్మకానికి చిన్నారుల అశ్లీల వీడియోలు!
ABN, Publish Date - Nov 27 , 2024 | 05:49 AM
చిన్నారుల అశ్లీల వీడియోలను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని తెలంగాణ మహిళా భద్రత విభాగం పోలీసులు ఇచ్చిన సమాచారంతో పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. టెక్నాలజీని ఉపయోగించి సైబర్ పెట్రోలింగ్ చేపట్టిన తెలంగాణ మహిళా భద్రత విభాగం
పశ్చిమ బెంగాల్‌లో నిందితుడి అరెస్టు
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): చిన్నారుల అశ్లీల వీడియోలను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని తెలంగాణ మహిళా భద్రత విభాగం పోలీసులు ఇచ్చిన సమాచారంతో పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. టెక్నాలజీని ఉపయోగించి సైబర్ పెట్రోలింగ్ చేపట్టిన తెలంగాణ మహిళా భద్రత విభాగం పోలీసులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి డివైజ్‌లో వెయ్యికి పైగా చిన్నారుల అశ్లీల వీడియోలు ఉన్నట్లు కనుగొన్నారు. ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా అతడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో వారు నిందితుడిని అరెస్టు చేశారు. అతను అభ్యంతరకర వీడియోలను టెలిగ్రామ్ గ్రూపులు, ఇతర ప్రైవేట్ డిజిటల్ చానెళ్లకు ఫోన్ పే, పేటీఎంలలో డబ్బులు తీసుకుని విక్రయిస్తున్నాడని బెంగాల్ పోలీసులు గుర్తించారు. సుమారు 50 మంది గ్రూపుగా ఏర్పడి చిన్నారుల అశ్లీల వీడియోలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు కనుగొన్నారు.
Updated Date - Nov 27 , 2024 | 05:49 AM