ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళ సాధికారతే ప్రభుత్వ ధ్యేయం : బాలునాయక్‌

ABN, Publish Date - Dec 03 , 2024 | 12:37 AM

మహిళ సా ధికారతే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌ అన్నారు.

మహిళ సంఘాలకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బాలునాయక్‌

మహిళ సాధికారతే ప్రభుత్వ ధ్యేయం : బాలునాయక్‌

దేవరకొండ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మహిళ సా ధికారతే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌ అన్నారు. దేవరకొండ పట్టణంలో సోమవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా శ్రీ నిధి, వడ్డిలేని రుణాలు, ఇందిరా మహిళ శక్తి పథకాల ద్వారా రూ.140 కోట్ల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళ సంఘాలలోని మహిళలకు వడ్డీలేని రుణాలు, ఇందిర మ్మ గృహాలను మంజూరు చేసి మహిళ సంక్షేమానికి కృ షి చేస్తుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణా లు అందజేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పులపాలు చేసిందన్నారు. సీఎం రేవంతరెడ్డి, మంత్రు లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ, డిండి, నక్కలగండి ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీ రు అందించాలనే లక్ష్యంతో నిధులు కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీడీ శేఖర్‌రెడ్డి, ఆర్డీవో రమణారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన నాయిని జమున మాధవరెడ్డి, అలివేలు సంజీవరెడ్డి, ఆలంపల్లి నర్సింహ, సిరాజ్‌ఖాన, డాక్టర్‌ వేణుధర్‌రెడ్డి, దూదిపాల రేఖ శ్రీధర్‌రెడ్డి, అరుణ సురే్‌షగౌడ్‌, చందునాయక్‌, హరికృష్ణ, రాంసింగ్‌, అధికారులు, మహిళ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రె్‌సలో చేరిన బీజేపీ వార్డు కౌన్సిలర్‌

దేవరకొండ మునిసిపాలిటీ 13వ వార్డు బీజేపీ కౌన్సిల ర్‌ లక్ష్మీశ్రీనివాస్‌ సోమవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు ఎమ్మెల్యే బాలునాయక్‌ తెలిపారు. కౌన్సిలర్‌ లక్ష్మీశ్రీనివా స్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రే వంతరెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆ కర్షితులై కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. లక్ష్మీశ్రీనివాస్‌ వెంట మరికొందరు నాయకులు కాంగ్రె్‌సలో చేరినట్లు తెలిపారు.

Updated Date - Dec 03 , 2024 | 12:37 AM