జగన్ కుట్రలను ఎదుర్కొని నిలబడ్డా ఏబీఎన్..
ABN, Publish Date - Oct 15 , 2024 | 11:53 AM
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందే తడవుగా ఏబీఎన్‌ను జగన్ టార్గెట్ చేశారు. మీడియా సమావేశాలకు ఏబీఎన్ ప్రతినిధులు రాకుండా బాయ్‌కాట్ చేశారు. విలేకరుల కదలికలను పరిమితం చేసేందుకు ప్రయత్నించారు. ఏబీఎన్ ప్రసారాలు జనం వీక్షించకుండా అడ్డుకునేందుకు జగన్ నానా తంటాలు పడ్డారు. అయినా..
హైదరాబాద్: ఏబీఎన్ చానల్ ప్రారంభించిన దశాబ్దం ఒక ఎత్తు.. గత ఐదు సంవత్సరాలు మరో ఎత్తు.. ఏబీఎన్‌ను అన్ని వైపుల నుంచి ఇబ్బంది పెట్టేందుకు జగన్ సర్కార్ చేయని ప్రయత్నం లేదు.. వాటన్నింటిని ఏబీఎన్ సమర్ధవంతంగా ఎదుర్కొంది. జగన్ దుష్టపాలనలోని తప్పిదాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకువచ్చింది. జగన్ బాధితులకు ఏబీఎన్ ఒక భరోసాగా నిలిచింది. వారి ఆకాంక్షలు నెరవేరేవరకు విశ్రమించకుండా పని చేసింది.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందే తడవుగా ఏబీఎన్‌ను జగన్ టార్గెట్ చేశారు. మీడియా సమావేశాలకు ఏబీఎన్ ప్రతినిధులు రాకుండా బాయ్‌కాట్ చేశారు. విలేకరుల కదలికలను పరిమితం చేసేందుకు ప్రయత్నించారు. ఏబీఎన్ ప్రసారాలు జనం వీక్షించకుండా అడ్డుకునేందుకు జగన్ నానా తంటాలు పడ్డారు. అయినా జనం మాత్రం ఏబీఎన్ పక్షమే వహించారు. జగన్ రెడ్డి దుశ్చర్యలను, ప్రజా వ్యతిరేక విధానాలను ముందే పసిగట్టిన ఏబీఎన్ ప్రజల తరఫున తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. అక్రమార్కుడైన జగన్‌ను వదిలేది లేదని తేల్చి చెప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ప్రముఖుల శుభాకాంక్షలు
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి లక్ష్యంగా హ్యాకర్ల దాడులు..
వికారాబాద్ జిల్లాలో ముందస్తు అరెస్టులు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 15 , 2024 | 11:53 AM