ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మరోసారి జిల్లాల పునర్విభజన వివాదం..

ABN, Publish Date - Oct 25 , 2024 | 11:58 AM

అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా ప్రతిపక్షాలు కవ్వింపు చర్యలు.. కాంగ్రెస్ కౌంటర్లు.. సవాళ్లు.. ప్రతి సవాళ్లపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. ప్రజలకు పాలన సౌకర్యాలు మరింత చేరువ చేసే ఉద్దేశంతో గత ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేసిన విషయం తెలిపిందే.

హైదరాబాద్: జిల్లాల పునర్విభజన వివాదం మరోసారి తెరపైకి వస్తోంది. అధికారంలోకి వస్తే హుస్నాబాద్, కోహెడ్ మండలాలను పూర్వపు జిల్లాల్లో కలుపుతామని ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారని జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ టార్గెట్‌గా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుండగా.. దేనికైనా టైమ్ వస్తుందని అమాత్యుని కౌంటర్‌తో విలీన మండలాల పంచాయతి మరోమారు తెరపైకి వచ్చింది. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా ప్రతిపక్షాలు కవ్వింపు చర్యలు.. కాంగ్రెస్ కౌంటర్లు.. సవాళ్లు.. ప్రతి సవాళ్లపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. ప్రజలకు పాలన సౌకర్యాలు మరింత చేరువ చేసే ఉద్దేశంతో గత ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేసిన విషయం తెలిపిందే.


2016లో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపారు. అంతేకాకుండా సెగ్మెంట్‌లోని కొన్ని మండలాలు, వివిధ జిల్లాలతో విలీనం చేశారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ బెజ్జంకి, కోహెడ, అక్కన్న పేట మండలాలను సిద్ధపేటలో కలపగా.. చిగురుమామిడి, సైదాపూర్ మండలాలను కరీంనగర్ జిల్లాలో.. భీమదేవరపల్లి ఎల్కతుర్తి మండలాలను హన్మకొండలో కలిపారు. అదే విధంగా కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలాన్ని.. బెజ్జంకి, గన్నేరువరం మండలాలుగా విభజించి బెజ్జంకి మండలాన్ని సిద్ధిపేట జిల్లాలో కలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు..

నాలుగు హోటళ్లకు బాంబు బెదిరింపులు.

రామయ్యను దర్శించుకున్న గవర్నర్

తీరం దాటిన ‘దాన’ తీవ్ర తుఫాన్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 25 , 2024 | 11:58 AM