ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాకినాడ పోర్టును తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం పవన్..

ABN, Publish Date - Nov 29 , 2024 | 02:36 PM

కాకినాడ పోర్టులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనిఖీలు నిర్వహించారు. బార్జీలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం బియ్యం గోదాముల్లో సోదాలు నిర్వహించారు.

కాకినాడ: కాకినాడ పోర్టులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనిఖీలు నిర్వహించారు. బార్జీలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం బియ్యం గోదాముల్లో సోదాలు నిర్వహించారు. కాకినాడ పోర్ట్ నుంచి సౌత్ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన నౌకలో 6 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పవన్ గుర్తించారు. దీనిపై అధికారులతో చర్చించి డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు కాకినాడ పర్యటనకు వెళ్తుండగా పిఠాపురం బైపాస్ రోడ్డులోని అగ్రహారం వాసులతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. అగ్రహారానికి చెందిన ప్రభుత్వ పట్టా భూముల్లో నివాసం ఉంటున్న తమను ఆక్రమణల పేరుతో అర్ధాంతరంగా ఖాళీ చేయిస్తున్నారని స్థానికులు పవన్ ఎదుట వాపోయారు. మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఖాళీ చేయమంటూ ఒత్తిడి చేస్తున్నారని పవన్‌కు ఫిర్యాదు చేశారు. సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి బాధితులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానంటూ పవన్ హామీ ఇచ్చారు.

Updated Date - Nov 29 , 2024 | 02:36 PM