శబ్ద కాలుష్యానికి విశాఖ పోలీసులు చెక్
ABN, Publish Date - Nov 10 , 2024 | 01:03 PM
విశాఖ: నగరంలో శబ్ద కాలుష్యానికి కారకులవుతున్న వాహనదారులపై పోలీసులు కొరడా ఝులిపించారు. వాహన తయారీ కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ కాకుండా మాడిఫైడ్ సైలెన్సర్లను మార్చుకుని తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.
విశాఖ: నగరంలో శబ్ద కాలుష్యానికి కారకులవుతున్న వాహనదారులపై పోలీసులు కొరడా ఝులిపించారు. వాహన తయారీ కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ కాకుండా మాడిఫైడ్ సైలెన్సర్లను మార్చుకుని తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. బైకులనుంచి తొలగించిన మాడిఫైడ్ సైలెన్సర్లను బీచ్ రోడ్డులో రోడ్ రోలర్‌తో తొక్కించారు. ఇకపై ఎవరైనా మాడిఫైడ్ సైలెన్సర్ల వాహనాలతో పట్టుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ సీపీ హెచ్చరించారు.
విశాఖ నగర సీపీ మీడియాతో మాట్లాడుతూ నగరంలో చాలా మంది యువకులు బైక్ సైలెన్సర్లు మాడిఫైడ్ చేసి పెద్ద శబ్ధంతో బైక్‌లు నడుపుతున్నారని అన్నారు. రాత్రి పూట పెద్ద శబ్ధంతో బైకులు నడపడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని.. సీనియర్ సిటిజన్స్ తనకు ఫోన్ చేశారని అన్నారు. దీంతో 181 మాడిఫైడ్ సైలెన్సర్లను పట్టుకున్నామని చెప్పారు. ఇటువంటి మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టి బైక్‌లు నడపడం ప్రమాదమని, సౌండ్ పొల్యూషన్‌తో రకరకాల జబ్బులు వస్తాయని ఆయన అన్నారు. రెండోసారి పట్టుబడితే వాహనాలు సీజ్ చేస్తామని కఠినమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అటవీశాఖ అమర వీరులకు పవన్ నివాళి..
సజ్జల భార్గవ్ రెడ్డిపై కేసు నమోదు..
యమునా నదిపై దట్టంగా విషపు నురుగు..
విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా..: కేటీఆర్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 10 , 2024 | 01:03 PM