ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆస్తుల వివాదంపై అనిల్ ఏమన్నారంటే..

ABN, Publish Date - Oct 29 , 2024 | 12:05 PM

ఈడీ జప్తులో ఉన్న సాక్షిని జగన్ ఉపయోగించుకోవడంలేదా అని అనిల్ కుమార్ ప్రశ్నించారు. ఓ ఇంటర్వ్యూలో ఆస్తుల వివాదాంపై ఆయన స్పందించారు. ఆస్తుల పంపకం విషయంలో ఎటూ చెప్పలేక విజయలక్ష్మి నలిగిపోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన స్క్రిఫ్టును చదవాల్సిన అవసరం షర్మిలకు ఏంటని.. దాని వల్ల వచ్చే లాభం ఏంటని ఆయన ప్రశ్నించారు.

హైదరాబాద్: ఏపీ మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్ మండిపడ్డారు. షర్మిలకు న్యాయంగా రావాల్సిన వాటాను ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు. ఆస్తుల్లో వాటాల పంపిణీకి.. ఈడీ కేసులు, జప్తు కారణమనే వాదనలను అనిల్ కొట్టిపారేశారు. ఈడీ జప్తులో ఉన్న సాక్షిని జగన్ ఉపయోగించుకోవడంలేదా అని ప్రశ్నించారు. ఓ ఇంటర్వ్యూలో ఆస్తుల వివాదాంపై ఆయన స్పందించారు. ఆస్తుల పంపకం విషయంలో ఎటూ చెప్పలేక విజయలక్ష్మి నలిగిపోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన స్క్రిఫ్టును చదవాల్సిన అవసరం షర్మిలకు ఏంటని.. దాని వల్ల వచ్చే లాభం ఏంటని అనిల్ ప్రశ్నించారు.


జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేయాలని షర్మిలను భారతి కోరారని ఈ సందర్బంగా అనిల్ కుమార్ గుర్తు చేశారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు అందులోకి ఎవరూ వెళ్లకుండా జగన్ కట్టడి చేశారని చెప్పారు. తెలంగాణలో పార్టీ పెట్టాలని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ సూచించారని, ఇదే విషయాన్ని జగన్ వద్ద ప్రస్తావిస్తే.. అక్కడ కేసీఆర్ ఉన్నారని, ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నందున అక్కడ పార్టీ పెట్టవద్దని షర్మిలతో అన్నారని అనిల్ గుర్తు చేశారు. అప్పటి నుంచే విబేధాలు ఎక్కువ అయ్యాయని ఆయన చెప్పారు.

జగన్ 2019 ఎన్నికల్లో గెలిచే వరకు ఒకలా.. గెలిచాక మరోలా మారిపోయారని అనిల్ అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక తమను జగన్ పక్కన పడేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీతో దోస్తీ కట్టడంతో తనను క్రైస్తవ ప్రచారం చేయవద్దని జగన్ చెప్పారనే విషయాన్ని అనిల్ కుమార్ ఇంటర్వ్యూలో చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర

హైద్రాబాద్‌లో 163 సెక్షన్ అమలు

బయటపడుతున్న జగన్ అక్రమాలు..

మద్యం వ్యాపారులకు సీఎం కీలక ఆదేశాలు

అదానీతో మంత్రి పొంగులేటి రహస్య సమావేశం: కేటీఆర్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 29 , 2024 | 12:05 PM