రేవంత్ రెడ్డి సర్కార్‌కు మరో భారం..
ABN, Publish Date - Nov 21 , 2024 | 08:48 AM
గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ చెల్లింపులు, ఆన్ గోయింగ్ పథకాలకు తెలంగాణకు వచ్చిన ఆదాయం సరిపోకపోవడంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోంది. ఖర్చుల విషయంలో ఆచీ తూచి అడుగులు వేస్తోంది.
హైదరాబాద్: అసలే ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్‌పై మరో పెనుభారం పడనుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంచడంతో తెలంగాణలో మూడేళ్లుగా రిటైర్‌మెంట్స్ జరగలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాపై మరో రూ. 5వేల కోట్ల అదనపు భారం పడనుంది. ఇది ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ చెల్లింపులు, ఆన్ గోయింగ్ పథకాలకు తెలంగాణకు వచ్చిన ఆదాయం సరిపోకపోవడంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోంది. ఖర్చుల విషయంలో ఆచీ తూచి అడుగులు వేస్తోంది. ప్రతినెల చేయాల్సిన చెల్లింపులకు సర్దుబాటు చేయడానికి సతమతమవుతోంది. అలాంటి సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ అంశం ప్రభుత్వానికి మరింత టెన్షన్ పెడుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన మహాదర్నా వాయిదా
ఐటీకి మరింత ఊతం: సీఎం చంద్రబాబు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 21 , 2024 | 08:48 AM