నారా కుటుంబంలో తీవ్ర విషాదం
ABN, Publish Date - Nov 16 , 2024 | 04:19 PM
Andhrapradesh: . 72 ఏళ్ల రామ్మూర్తి నాయుడు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజులుగా ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచారు. మధ్యాహ్నం 12:45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.
అమరావతి, నవంబర్ 16: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు (Nara Rammurthy Naidu) కన్నుమూశారు. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 72 ఏళ్ల రామ్మూర్తి నాయుడు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజులుగా ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచారు. మధ్యాహ్నం 12:45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. రేపు(ఆదివారం) రామ్మూర్తి నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు.
Btech Ravi: భూకబ్జాలపై బీటెక్ రవి సెన్సేషనల్ కామెంట్స్
చిత్తూరు జిల్లాలో 1952లో రామ్మూర్తి నాయుడు జన్మించారు. 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994- 1999 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడుకు ఇద్దరు కుమారులు రోహిత్, గిరీష్ ఉన్నారు. నారా రోహిత్ టాలీవుడ్‌లో హీరోగా రాణిస్తున్నారు. రామ్మూర్తి నాయుడు మృతితో నారా, నందమూరి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆయన బంధువులంతా ఏఐజీ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఆస్పత్రికి చేరుకున్నారు. రామ్మూర్తి సోదరుడు చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. కాసేపట్లో ఆయన ఆస్పత్రికి చేరుకుంటారు. రామ్మూర్తి నాయుడు మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
Adireddy Srinivas:ఆదిరెడ్డి భవానిపై ట్రోల్స్..ఆదిరెడ్డి వాసు వార్నింగ్
AP: ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి సర్చ్ వారెంట్.. ఏ క్షణంలోనైనా..
Read Latest AP News ANd Telugu News
Updated Date - Nov 16 , 2024 | 04:50 PM