మద్యం బాటిళ్లకు నకిలీ హోలోగ్రాం స్టిక్కర్లు..
ABN, Publish Date - Jul 31 , 2024 | 07:46 AM
విజయవాడ: ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్‌లో తవ్వే కొద్ది అవకతవకలు బయటకొస్తునే ఉన్నాయి. తాజాగా నకిలీ హోలోగ్రాం స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలడంతో గత ప్రభుత్వ పాపాల పుట్ట మరోసారి కదిలింది.
విజయవాడ: ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్‌లో తవ్వే కొద్ది అవకతవకలు బయటకొస్తునే ఉన్నాయి. తాజాగా నకిలీ హోలోగ్రాం స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలడంతో గత ప్రభుత్వ పాపాల పుట్ట మరోసారి కదిలింది. ఏడాదికి 13 కోట్ల 68 లక్షల మద్యం బీరు బాటిళ్ల.. హోలోగ్రాం స్టిక్కర్ల టెండర్ల విషయంలోనూ అవకతవకలు జరిగినట్లు తేలడంతో ఈ విషయంపై ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం బాటిళ్లకు వేసే హోలో గ్రామ్ టెండర్లను కట్టబెట్టినట్టు విచారణలో వెల్లడైంది. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు లేకుండానే ఆయ కంపెనీలకు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి టెండర్లు ఇచ్చేసినట్టు విచారణలో తేటతెల్లమైంది. టెండర్ల ఖరారు ప్రక్రియలో సాంకేతిక కమిటీ నివేదికపై అధీకృత సంతకాలు లేనట్టు అధికారులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విపక్షాలపై కేంద్రమంత్రి ఫైర్..
గ్రామీణ వైద్యులకు బంపర్ ఆఫర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 31 , 2024 | 07:55 AM