ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యంగ్ స్టార్ కదా అని అవకాశమిస్తే..

ABN, Publish Date - Jul 26 , 2024 | 07:15 AM

న్యూఢిల్లీ్: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌పై లోక్ సభ వేదికగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నిప్పులు చెరిగారు. జగన్ ఆర్ధిక ఉగ్రవాది అంటూ మండిపడ్డారు. సొంత బాబాయిని ఆయన చంపారని ఆరోపించారు. ఏపీలో ఐదేళ్లు అరాచకపాలన చేసిన జగన్‌.. ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేశారని ఎద్దేవా చేశారు.

న్యూఢిల్లీ్: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌పై లోక్ సభ వేదికగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నిప్పులు చెరిగారు. జగన్ ఆర్ధిక ఉగ్రవాది అంటూ మండిపడ్డారు. సొంత బాబాయిని ఆయన చంపారని ఆరోపించారు. ఏపీలో ఐదేళ్లు అరాచకపాలన చేసిన జగన్‌.. ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేశారని ఎద్దేవా చేశారు. జగన్ అరాచకాలకు సహకరించిన అధికారులపై కేంద్రం చర్యలు తీసుకోవాలని సీఎం రమేష్ కోరారు. అవినీతి అధికారులపై సీబీఐ, ఈడీ, విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని ఆయన విజ్జప్తి చేశారు. అవినీతి సంపాదనంతా తిరిగి తెచ్చి ఏపీ అభివృద్ధికి ఖర్చు చేయాలని అన్నారు. ప్రధాని మోదీ.. చంద్రబాబుకు పేరు వస్తుందనే అమరావతిని జగన్ సర్వనాశనం చేశారని సీఎం రమేష్ విమర్శించారు.


ఒక్కసారి అవకాశం ఇవ్వాలని జగన్ అడిగితే యంగ్ స్టార్ కదా అని ప్రజలు అవకాశం ఇచ్చారని, ఈరోజు ఏపీ పరిస్థితి చూస్తే వైసీపీ నేతలు మొత్తం దోచేశారని సీఎం రమేష్ అన్నారు. ల్యాండ్, మైనింగ్, ఇసుక, లిక్కర్, భూములు.. ఇలా ఒకటి కాదు.. చెప్పాలంటే చాలా ఉందని ఆయన అన్నారు. ఒక ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా చెడిపోతుందో ఐదేళ్లు కళ్లారా చూశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేత పత్రాలపై విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం రమేష్ డిమాండ్ చేశారు.


కాగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ఆర్థిక ఉగ్రవాదని, ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా దోచేశారని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ ఆరోపించారు. జగన్‌ ఐదేళ్ల దోపిడీపై దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలని గురువారం లోక్‌సభలో డిమాండ్‌ చేశారు. ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన దాష్టీకాన్ని, జగన్‌ దోపిడీని లోక్‌సభ సాక్షిగా దేశానికి వివరించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల ఆటవిక రాజ్యం అంతమైంది. ఏపీ ప్రజలు ఎన్డీయేకు అపూర్వ విజయం అందించారు. విజన్‌ ఉన్న నాయకుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్లలో రాష్ట్రం కోల్పోయిన వాటిని పునర్నిర్మిస్తారనే నమ్మకం ప్రజలకు ఉంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం వెంటిలేటర్‌పైకి చేరింది. కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులతో ఆక్సిజన్‌ లభించింది. జగన్‌ రుషికొండలో రూ.500 కోట్లతో రాజభవనం నిర్మించుకున్నారు. అప్పును రూ.13 లక్షల కోట్లకు చేర్చారు. వైసీపీ ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్‌ను హత్యచేసి మృతదేహాన్ని అతడి ఇంటిముందే పడేశారు. కొవిడ్‌ సమయంలో మాస్కులు అడిగినందుకు ఒక ప్రభుత్వ వైద్యుడిని దారుణంగా హింసించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో 2,686 హత్యలు జరిగాయి. దేవాలయాలపై దాదాపు 150 దాడులు జరిగాయి. అంతర్వేదిలో శతాబ్దాల నాటి లక్ష్మీ నరసింహస్వామి రథానికి నిప్పు పెట్టారు. దుర్గాదేవి వెండి రథంలోని 3 వెండి సింహాలు మాయమయ్యాయి. ఏళ్ల తరబడి జైలులో ఉన్న వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుందో రాష్ట్రం చూసింది. అమరావతి, పోలవరం రాష్ర్టానికి రెండు కళ్లు లాంటివి. ఈ రెండింటిపై ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలు నిజంగా ఏపీ ప్రజల హృదయాలను తాకాయి’’ అని సీఎం రమేశ్‌ అన్నారు. ఆ తర్వాత ఆయన సభలో తెలుగులో మాట్లాడారు. ‘‘ఎన్డీయే కూటమిలో మోదీ, చంద్రబాబు, పవన్‌ నేతృత్వంలో అనకాపల్లి నుంచి 3 లక్షల మెజార్టీతో గెలిచాను. ముగ్గురిపై ప్రజలకు నమ్మకం ఉంది. జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ మొత్తం దోచేశారని సీఎం రమేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పైశాచికానికి పరాకాష్ఠ

పోలవరం.. మూడేళ్లలో పూర్తి!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 26 , 2024 | 07:15 AM

Advertising
Advertising