రాఖీ పండుగ రోజు ఆకాశంలో అద్భుత.. భారత్‌లో కనిపించనున్న సూపర్ మూన్
ABN, Publish Date - Aug 19 , 2024 | 06:05 PM
రాఖీ పండగ రోజు.. ఆకాశంలో అద్బుతం జరగనుంది. ఆగస్ట్ 19వ తేదీ రాత్రి.. ఆకాశంలో చంద్రుడు మరింత పెద్దగా కనివిందు చేయనున్నాడు. ఈ ఏడాదిలో ఈ రోజు.. సూపర్ బ్లూ మూన్ ఏర్పడనున్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే వెల్లడించారు. సాధారణ రోజుల కంటే జాబిల్లి.. ఈ రోజు 36 శాతం అధికంగా కనువిందు చేస్తూ.. ప్రకాశించనుంది.
రాఖీ పండగ రోజు.. ఆకాశంలో అద్బుతం జరగనుంది. ఆగస్ట్ 19వ తేదీ రాత్రి.. ఆకాశంలో చంద్రుడు మరింత పెద్దగా కనివిందు చేయనున్నాడు. ఈ ఏడాదిలో ఈ రోజు.. సూపర్ బ్లూ మూన్ ఏర్పడనున్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే వెల్లడించారు. సాధారణ రోజుల కంటే జాబిల్లి.. ఈ రోజు 36 శాతం అధికంగా కనువిందు చేస్తూ.. ప్రకాశించనుంది. సాధారణంగా ఏడాదిలో రెండు లేదా మూడు సూపర్ మూన్స్ ఏర్పడతాయని కానీ.. బ్లూ మూన్ మాత్రం చాలా అరుదుగా సంభవిస్తుందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఇక సూపర్ బ్లూ మూన్ సోమవారం రాత్రి 8.00 గంటల నుంచి మంగళవారం ఉదయం 5.32 గంటల వరకు కనిపించనుంది. ఇక వివిధ దేశాల్లో ఆ యా కాలమానాలను బట్టి ఈ సూపర్ బ్లూ మూన్ సోమవారం నుంచి బుధవారం వరకు కనువిందు చేయనుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల పాటు ఈ సూపర్ బ్లూ మూన్ కనిపిస్తుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది నాలుగు సూపర్ మూన్‌లు ఏర్పడతాయని నాసా పేర్కొంది. అలా ఆగస్ట్ 19న తొలి సూపర్ మూన్.. తర్వాత సెప్టెంబర్ 18న, అక్టోబర్ 17న, నవంబర్ 15న ఏర్పడనున్నాయని వివరించింది.
సాధారణంగా భూమి చుట్టు చంద్రుడు తిరుగుతున్నప్పుడు.. అత్యంత దగ్గరగా వచ్చిన సమయంలో చంద్రుడు ప్రకాశవంతంగా మరింత పెద్దగా కనిపిస్తాడు. దానినే సూపర్ మూన్‌గా పిలుస్తారు. ఇలాంటి సూపర్ మూన్లు ప్రతీ ఏడాది రెండు, మూడు సార్లు కనిపిస్తాయి. అయితే బ్లూ మూన్ అంటే నీలి వర్ణంలోకి మారడం కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వాతావరణంలోని దుమ్ము దూళీ కణాల కాంతి, ఎరుపు కణాల కారణంగా.. కొన్ని సార్లు చంద్రుడు నీలి రంగులో కనిపిస్తాడు. అంతేకానీ చంద్రుడు నీలి వర్ణంలోకి మారడం కాదని పేర్కొంటున్నారు. అయితే సోమవారం రాత్రి కనువిందు చేయనున్న చంద్రుడు అటు సూపర్ మూన్ ఇటు బ్లూ మూన్ కూడా కావడంతో.. దీనిని సూపర్ బ్లూ మూన్‌గా పిలుస్తున్నారు. ఇక ఆగస్ట్‌లో వచ్చే ఫుల్ మూన్‌ను స్ట్రేజియన్ మూన్ అని కూడా పిలుస్తారు.
Updated Date - Aug 19 , 2024 | 06:05 PM