ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేసులతో ఇబ్బందులకు గురిచేసే కుట్రలు..

ABN, Publish Date - Oct 30 , 2024 | 11:05 AM

హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణకు గత ప్రభుత్వంలోని కీలక నాయకులు ప్రాధాన పాత్ర పోషించారు. ఈ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు నిధులు మళ్లాయని ప్రభుత్వం గుర్తించింది. దీంతో సమగ్ర దర్యాప్తు జరపాలంటే అవినీతి నిరోధక శాఖకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

హైదరాబాద్: దీపావళికి టపాసులు పేలుతాయి. అంటూ తెలంగాణలో ఓ వైపు అధికార పార్టీ నాయకులు ప్రకటన చేస్తుండగా కేసులతో ఇబ్బందులకు గురిచేసే కుట్రలు జరుగుతున్నాయని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళికి రెండు రోజుల ముందు ఫార్ములా- ఈ - బాంబు పేలింది. హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణకు గత ప్రభుత్వంలోని కీలక నాయకులు ప్రాధాన పాత్ర పోషించారు. ఈ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు నిధులు మళ్లాయని ప్రభుత్వం గుర్తించింది. దీంతో సమగ్ర దర్యాప్తు జరపాలంటే అవినీతి నిరోధక శాఖకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.


సచివాలయం ఎదుట.. ట్యాంక్‌బండ్‌ చుట్టూ.. ఫార్ములా-ఈ రేసింగ్‌ కోసం 3 కిలోమీటర్ల మేర ట్రాక్‌ నిర్మించారు. 2023లో తొలిసారి ఫార్ములా-ఈ రేస్‌ను నిర్వహించారు. ఈ రేసింగ్‌కు దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో వీక్షకులు హాజరయ్యారు. 2024 ఫిబ్రవరి 10న కూడా ఫార్ములా-ఈ రేసింగ్‌కు విదేశీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విదేశీ సంస్థతో ఎంవోయూ చేసుకుని, నిధులు చెల్లించాలంటే.. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) అనుమతి అవసరమని మునిసిపల్‌ అధికారులు చెబుతున్నారు. అయితే.. ఫార్ములా-ఈ రేసింగ్‌ నిర్వహణ విషయంలో.. ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పట్టణాభివృద్ధి (ఎంవోయూడీ) శాఖ నుంచి రూ.55 కోట్ల మేర విదేశీ సంస్థలకు నిధులను చెల్లించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్

తెలంగాణ పర్యటనకు రాహుల్ గాంధీ..

శ్రీవారి ఆలయంలో గురువారం దీపావళి ఆస్థానం..

శ్రీవారి ఆలయంలో గురువారం దీపావళి ఆస్థానం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 30 , 2024 | 11:05 AM