జోరు వానలో గండ్ల పూడ్చివేత పనులు..
ABN, Publish Date - Sep 05 , 2024 | 10:31 AM
విజయవాడ: బుడమేరుకు గండ్లు పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మళ్లీ బుడమేరకు వరద వచ్చే అవరాశం ఉందన్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు శరవేగంగా గండ్లు పూడుస్తున్నారు. జోరు వర్షంలోనూ గండ్ల పూడిక పనులు కొనసాగుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు.
విజయవాడ: బుడమేరుకు గండ్లు పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మళ్లీ బుడమేరకు వరద వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు శరవేగంగా గండ్లు పూడుస్తున్నారు. జోరు వర్షంలోనూ గండ్ల పూడిక పనులు కొనసాగుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు ఆరా తీస్తున్నారు. గురువారం సాయంత్రంలోగా గండ్లను పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించారు. అర్ధరాత్రి భారీ వర్షం,.. ఉధృతంగా గాలి వీస్తున్న నిద్రాహారాలు లేకుండా బుడమేరు గండ్ల పూడిక పనుల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు జోరున వానలోనే పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్బంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ కూడా స్వయంగా గండ్ల పూడ్చివేత పనులవద్దకు వచ్చి పలు సూచనలు చేశారని, ఏజెన్సీలను పెట్టుకుని పనులకు అంతరాయం కలగకుండా సామాగ్రి అందజేశారని చెప్పారు. గండ్లు పూడిక జరిగితే గాని సింగ్ నగర్‌కు వరద ఉధృతి తగ్గదనే ఉద్దేశంతోనే దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నానన్నారు. సింగ్‌నగర్ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, గత నాలుగు రోజులుగా గట్టు వెంబడే ఉంటూ పూడిక పనుల్లో వేగవంతం చేసామని మంత్రి రామానాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడిక పనులపై సమీక్ష చేస్తున్నారని మంత్రి రామానాయుడు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వెనక్కి తగ్గొద్దు ఎవరైనాసరే కూల్చేయండి..
ఏపీలో భారీ వర్షాలు.. అధికారుల హెచ్చరిక..
మళ్లీ రాత్రి నుంచి కురుస్తున్న వర్షం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 05 , 2024 | 10:31 AM